Bank Holidays : ఏప్రిల్ 1 నుండి వరుసగా సెలవులు.. ఈ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్ !

Published : Mar 29, 2026, 08:46 PM IST

Bank Holidays April 2026 : ఏప్రిల్ 2026లో పండుగలు, వార్షిక ముగింపు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా 1 నుంచి వరుసగా సెలవుల క్రమంలో కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

PREV
16
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?

దేశంలోని బ్యాంకింగ్ రంగం 2026 ఏప్రిల్ నెలలో భారీగా సెలవులను చూడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పండుగలు, జాతీయ వేడుకలు, వారాంతపు సెలవుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే ఖాతాదారులు ఈ సెలవుల వివరాలను ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం. దీంతో కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు.

26
ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల ముగింపు

ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులు తమ వార్షిక ఖాతాల ముగింపు ప్రక్రియను నిర్వహిస్తాయి. ఈ కారణంగా ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండవు. ఆ రోజున బ్యాంక్ సిబ్బంది కార్యాలయంలోనే ఉన్నప్పటికీ, నగదు జమ చేయడం, విత్‌డ్రా చేయడం వంటి ఆఫ్‌లైన్ లావాదేవీలను నిలిపివేస్తారు. ఇది ఆర్థిక సంవత్సరం చివరి ప్రక్రియ కావడంతో ఖాతాదారులు దీనిని గమనించాలి. అలాగే, మార్చి 31న మహావీర్ జయంతి కారణంగా పుల ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఏప్రిల్ 1 తో పాటు 2న కూడా నాన్ బ్యాంకింగ్ హాలిడేస్ ఉంటాయనీ, ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే కావడంతో ఏప్రిల్ 4న జీతాలు పడే అవకాశముంది. పలు బ్యాంకుల కార్యకలపాలు జీతాలు పడటం పై కూడా ప్రభావం చూపవచ్చు.

36
ఏప్రిల్‌లో పండుగలు, జాతీయ సెలవులతో బ్యాంకులు బంద్

ఏప్రిల్ నెలలో అనేక పండుగలు, జాతీయ నాయకుల జయంతి వేడుకలు ఉన్నాయి. వీటివల్ల వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.

• ఏప్రిల్ 2 (గురువారం): మాండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కేరళలోని కొచ్చి, తిరువనంతపురం వంటి నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

• ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

• ఏప్రిల్ 14 (మంగళవారం): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, బైసాఖీ, తమిళ్ నూతన సంవత్సరం, బొహగ్ బిహు వంటి పండుగలు ఒకే రోజున రావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

• ఏప్రిల్ 15 & 16: బెంగాలీ నూతన సంవత్సరం, బొహగ్ బిహు, విషు పండుగల సందర్భంగా కోల్‌కతా, గౌహతి, అగర్తలా వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

• ఏప్రిల్ 20 & 21: బసవ జయంతి, అక్షయ తృతీయ, గరియా పూజ సందర్భంగా బెంగళూరు, అగర్తలాలో బ్యాంకులు మూతపడతాయి.

46
ఎప్రిల్ లో బ్యాంకుల వారాంతపు సెలవుల వివరాలు

పండుగ సెలవులతో పాటు, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పనిచేయవు. 2026 ఏప్రిల్ నెలలో ఉన్న వారాంతపు సెలవులు ఇవే..

• ఆదివారాలు: ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో బ్యాంకులు సెలవు.

• రెండో శనివారం: ఏప్రిల్ 11న బ్యాంకులు పనిచేయవు.

• నాలుగో శనివారం: ఏప్రిల్ 25న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

56
అందుబాటులో బ్యాంకుల ఆన్‌లైన్ సేవలు

బ్యాంకు శాఖలకు సెలవు ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. కస్టమర్లు తమ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఈ క్రింది సేవలను 24/7 వినియోగించుకోవచ్చు:

1. UPI ట్రాన్సాక్షన్స్: గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నగదు బదిలీలు చేసుకోవచ్చు.

2. నెట్ బ్యాంకింగ్ & మొబైల్ బ్యాంకింగ్: ఇంటి నుండే ఫండ్ ట్రాన్స్‌ఫర్, బిల్ పేమెంట్స్ వంటివి చేసుకోవచ్చు.

3. ఏటీఎం సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

4. ఆన్‌లైన్ NEFT/RTGS: ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీలు యధావిధిగా సాగుతాయి.

66
స్టాక్ మార్కెట్ సెలవులపై ప్రభావం

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సమాచారం ప్రకారం, ఏప్రిల్ నెలలో ఎనిమిది వారాంతపు సెలవులతో పాటు మరో రెండు అదనపు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 3 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి) నాడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిలిచిపోతుంది. కాబట్టి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తమ పెట్టుబడి వ్యూహాలను ఈ తేదీలకు అనుగుణంగా మార్చుకోవడం ముఖ్యం. ఏప్రిల్ నెలలో బ్యాంకు పనులు ఉన్నవారు ఈ జాబితాను పరిశీలించి, ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే ఇబ్బందులు కలగవు.

Read more Photos on
click me!

Recommended Stories