లోన్ ఇచ్చి EMI అడగని బ్యాంక్

Published : Feb 03, 2026, 09:43 AM IST

Reverse Mortgage Scheme : బ్యాంకు నుండి లోన్ తీసుకొండి... కానీ ఈఎంఐ కట్టాల్సిన అవసరమే లేదు. ఇలాంటి అద్భుతమైన ఓ బ్యాంక్ స్కీమ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
ఈ లోన్ తీసుకొండి... ఈఎంఐ కట్టాల్సిన బాధ ఉండదు

అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం కాస్త ఆలస్యమైతేనే మన బంధువులు, స్నేహితులు వెంటపడుతుంటారు... అలాంటిది బ్యాంకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోన్ తీసుకుని సమయానికి చెల్లించకుంటే నోటీసుల మీద నోటిసులు పంపిస్తుంటాయి… రికవరీ ఏజెంట్స్ ను ఇంటిమీదకు పంపిస్తుంటాయి… నానా హంగామా చేసి పరువు తీస్తుంటాయి. కానీ కొందరు బ్యాంక్ నుండి లోన్ పొంది బ్రతికున్నంతకాలం ఈఎంఐ కట్టాల్సిన పనిలేదట... అవును.. మీరు వింటున్నది నిజమే. ఓ పథకం ద్వారా హాయిగా బ్రతికేందుకు లోన్ తీసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

25
రివర్స్ మార్ట్ గేజ్ స్కీమ్ (Reverse Mortgage Scheme)

బ్యాంకులు ఇంటిని తాకట్టుగా పెట్టుకుని ఇచ్చే లోన్ ఇది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఈ లోన్ పొందవచ్చు. అయితే ఇంటి ఆధారంగా లోన్ అమౌంట్ ఎంత అనేది నిర్ణయిస్తారు... ఈ మొత్తం నెలనెలా వాయిదాల్లో లేదంటే ఒకేసారి ఇవ్వండి చేస్తుంటారు. సొంతిల్లు మాత్రమే ఉండి ఎలాంటి ఇతర ఆదాయం లేని వృద్ధులకు మాత్రమే ఈ రివర్స్ మార్ట్ గేజ్ స్కీమ్ కింద లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు.

35
ఈ లోన్ ఎలా తిరిగి చెల్లించాలి..?

రివర్స్ మార్ట్ గేజ్ పొందిన వ్యక్తి జీవించినంతకాలం సొంత ఇంట్లో ఉంటూనే బ్యాంకు లోన్ డబ్బులు వాడుకోవచ్చు. పోషణ, వైద్యం వంటి ఎలాంటి అవసరాల కోసం అయినా లోన్ డబ్బులు వాడుకోవచ్చు. నెలనెలా లేదంటే ఏడాదికి ఇంత EMI కట్టాలనే బాధ కూడా ఉండదు. లోన్ ఇచ్చిన బ్యాంక్ నుండి డబ్బులు తిరిగి చెల్లించమనే వేధింపులు అస్సలు ఉండవు.

అయితే లోన్ పొందిన వ్యక్తి మరణం తర్వాత బ్యాంక్ ఎంటర్ అవుతుంది. సదరు వ్యక్తి వారసులు లోన్ చెల్లిస్తే ఇంటిని వదిలేస్తుంది... లేదంటే బ్యాంకు అధికారులకు ఆ ఇంటిని అమ్మే సర్వాధికారాలు ఉంటాయి. ఇలా అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి లోన్ అమౌంట్, వడ్డీ వసూలు చేసుకుని మిగిలిన డబ్బు నామినీకి అందజేస్తారు.

45
ఈ రివర్స్ మార్ట్ గేజ్ స్కీంతో మరిన్ని లాభాలు...

ఈ స్కీమ్ ద్వారా పొందే డబ్బులు ఆదాయం కాదు... లోన్ గానే పరిగణిస్తారు. కాబట్టి ఇది ఆదాయ పన్ను పరిధిలోకి రాదు. అంటే రివర్స్ మార్ట్ గేజ్ స్కీం ద్వారా నెలనెలా వాయిదాల్లో డబ్బులు పొందుతున్నా, ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు పొందినా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. వయసు మీదపడిన వృద్ధులు హాయిగా వాడుకోవచ్చు.

ఇక ఈ స్కీమ్ కింద నెలనెలా డబ్బులు పొందేవారికి గరిష్ఠంగా 20 ఏళ్లవరకు లభిస్తాయి. 60 ఏళ్ల తర్వాత లోన్ ప్రారంభం అవుతుంది కాబట్టి దాదాపు 80 ఏళ్ళ వరకు లభిస్తుందన్నమాట. ఇది లాంగ్ టైమ్ లోన్ కాబట్టి వడ్డీ కూడా చాలా తక్కువ ఉంటుంది.

55
సీనియర్ సిటిజన్స్ కు ఉపయోగం...

వయసులో ఉండగా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా కుటుంబం, పిల్లల కోసం ఖర్చు చేసుకుంటారు చాలామంది. తమకంటూ ఏదీ దాచుకోరు. అలాంటివారికి వయసు మీదపడ్డాక ఒంట్లో శక్తి నశిస్తుంది... కాబట్టి పనిచేసే అవకాశం ఉండదు... ఆదాయం లేక, దాచుకున్న డబ్బులు లేక ఇబ్బందిపడతారు. ఇలాంటి వృద్ధులు సొంతిల్లు కలిగివుంటే చాలు... ఈ రివర్స్ మార్ట్ గేజ్ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ రివర్స్ మార్ట్ గేజ్ స్కీం అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ స్కీం ద్వారా లోన్ పొందాలనుకుంటే దగ్గర్లోని బ్యాంకులో సంప్రదించవచ్చు. బ్యాంక్ సిబ్బంది నుండి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాసెస్ గురించి తెలుసుకొండి. ఇలా బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఈఎంఐ బాధలేకుండా హాయిగా జీవించండి.

Read more Photos on
click me!

Recommended Stories