సింగిల్స్ కి నిర్మలమ్మ ఇచ్చిన పెద్ద వరం ఏంటో తెలుసా?

Published : Feb 02, 2026, 04:53 PM ISTUpdated : Feb 02, 2026, 05:05 PM IST

Tax Relief for Singles : ఒంటరిగా వ్యాపారాలు చేసేవారికి ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రకటించింది. ఇలా ట్యాక్ మినహాయింపు పొందేందుకు ఎవరు అర్హులో తెలుసా..? 

PREV
14
రూ.2 కోట్ల వ్యాపారం చేసినా నో ట్యాక్స్...

Incometax Tips : మీరు వ్యాపారం చేస్తున్నారా..? మీ టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉందా..? అయితే మీరు ఎలాంటి ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇందుకు ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

మోదీ సర్కార్ పాత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్తగా ఆదాయపు పన్ను చట్టం 2025 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపు విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ కొత్త చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తోంది.

24
ఆదాయపు పన్ను చట్టం 2025

మోదీ సర్కార్ పాత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్తగా ఆదాయపు పన్ను చట్టం 2025 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపు విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ కొత్త చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తోంది.

34
రూ.2 కోట్ల వ్యాపారానికి నో ఇన్కమ్ ట్యాక్స్..

మీరు ఎలాంటి భాగస్వామ్యాలు లేకుండా ఒంటరిగా వ్యాపారం చేస్తుంటే పన్ను మినహాయింపు పొందవచ్చు. సంవత్సరం మొత్తం టర్నోవర్ మొత్తం రూ.2 కోట్లలోపు ఉంటే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే మొత్తం టర్నోవర్ లో 95 శాతం ఆన్ లైన్ మోడ్ లో చెల్లింపులు జరిగి ఉండాలి. ఇలాంటప్పుడు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఉదాహరణకు A అనే యజమాని 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2 కోట్ల వ్యాపారం చేశాడని అనుకుందాం. ఇది తప్పితే అతడికి మరో ఆదాయం లేదు. కాబట్టి ఇతడి ఆదాయాన్ని ఇలా లెక్కిస్తారు.

మొత్తం టర్నోవర్ : 2,00,00,000 రూపాయలు

ఇందులో కేవలం 6 శాతాన్ని మాత్రమే ఆదాయంగా పరిగణిస్తారు. అంటే రూ.12,00,000 ఆదాయం. దీనిపై కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

44
ఈ పన్ను మినహాయింపు ఒంటరి యజమానులకు మాత్రమే...

రూ.2 కోట్లలోపు పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రత్యేకంగా సింగిల్స్ కు మాత్రమే వర్తిస్తుంది. హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), భాగస్వామ్య సంస్థలకు ఈ పన్ను రాయితీ వర్తించవు.

రూ.3 కోట్ల టర్నోవర్ కలిగిన వ్యక్తిగత వ్యాపారాలు కూడా ఈ పన్నురాయితీ పరిధిలోకి వస్తాయి. అయితే వీరికి లాభం 6 శాతంగా పరిగణిస్తారు కాబట్టి ఆదాయం 18 లక్షలు అవుతుంది... కాబట్టి దీనిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories