త్రివర్ణకాంతుల్లో మెరిసిపోతున్న అయోధ్య... (గ్యాలరీ)

First Published | Jan 20, 2024, 10:30 AM IST

అయోధ్యలోని ముఖ్య ప్రాంతాలన్నీ.. ఎటు చూసినా జెండా రంగుల్లో దేశభక్తిని ఉప్పొంగించేలా ఏర్పాటు చేశారు. 
 

అయోధ్య : ప్రాణప్రతిష్టకు ముస్తాబవుతున్న అయోధ్యలో మరో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. అయోధ్యలోని రామాలయం, పరిసరాలు.. మొత్తం త్రివర్ణ కాంతుల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. 

ఆలయానికి త్రివర్ణ కాంతులతో అలంకరించి భారతీయతను, దేశ గౌరవాన్ని సూచించేలా ముస్తాబు చేశారు. రాత్రివేళ అయోధ్య అద్భుతంగా ఆవిష్కృతం అవుతోంది. 


అయోధ్యలోని ముఖ్య ప్రాంతాలన్నీ.. ఎటు చూసినా జెండా రంగుల్లో దేశభక్తిని ఉప్పొంగించేలా ఏర్పాటు చేశారు. ఎటు చూసినా జెండారంగులే కనువిందు చేయనున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుక అయోధ్యలో రామాలయ ప్రారంభం. ఈ వేడుకకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

అయోధ్యలో మొత్తం పదివేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 400 సీసీటీవీ కెమెరాలు ఒక దేవాలయంలోనే ఏర్పాటు చేశారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి ఫేషియల్ రికగ్నైజేషన్ చేయనున్నారు.

జనవరి 16వ తేదీ మంగళవారం నుంచి అయోధ్యలో పవిత్రాభిషేకం ప్రారంభమైంది. ప్రాణ్-ప్రతిష్ఠ జనవరి 16 నుంచి 22 వరకు వివిధ దశల్లో నిర్వహిస్తారు.

భగవాన్ శ్రీ రాంలాలా ప్రాణ-ప్రతిష్ఠా యోగానికి అనుకూలమైన సమయం పౌష్ శుక్ల కూర్మ ద్వాదశి, విక్రమ సంవత్ 2080, అంటే సోమవారం, జనవరి 22, 2024. అన్ని సాంప్రదాయాలను అనుసరించి, జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పవిత్రోత్సవం జరగనుంది.

ప్రాణ-ప్రతిష్ఠలో 121 మంది ఆచార్యులు ఉత్సవానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను సమన్వయం, మద్దతు, మార్గనిర్దేశం చేస్తారు.భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో దీక్షలు జరగనున్నాయి.

Latest Videos

click me!