అయోధ్య : జనవరి 22న ప్రసాదంగా 13 లక్షల నేతి లడ్డూలు.

First Published | Jan 20, 2024, 6:42 AM IST

ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో జనవరి 22న వచ్చే వారికోసం అపురూపమైన ప్రసాద కానుక సిద్ధమవుతోంది. 

అయోధ్య రామాలయ ప్రారంభానికి వచ్చే అతిథుల కోసం ప్రసాదంగా ఇవ్వడానికి దేశీయనెయ్యితో తయారు చేసిన 13 లక్షల లడ్డూలు సిద్ధమవుతున్నాయి.

13.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. వీటిని జనవరి 22న రామమందిర ప్రారంభానికి వచ్చే 8వేలమంది ఆహ్వానితులకు ఇవ్వనున్నారు. 


ఈ లడ్డూలను మూడు రకాల టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. 11 లడ్డూలున్న టిఫిన్ బాక్స్ ప్రాణప్రతిష్టకు వచ్చిన ఆహ్వానితులకోసం ప్యాక్ చేస్తున్నట్టుగా మీడియా సమాచారం. 

ఇందులో కూడా వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ఇచ్చే ప్యాక్ లో ఏడు లడ్డూలుంటాయి. మిగతా వారికి ఇచ్చే ప్యాక్ లో ఐదు లడ్డూలు ఉంటాయి. ఈ స్టీలు డబ్బాలో లడ్డూలతో పాటు ఇది రాముడి ఆశీర్వాదం అని తెలిపే ఓ స్టిక్కర్ కూడా ఉంటుంది. 

ప్రతీ స్టీల్ బాక్సు ఓ బ్యాగులో ప్యాక్ చేయబడుతుంది. ఆ బ్యాగులో లడ్డూలతో పాటు మూడు బుక్ లెట్ లు ఉంటాయి. రామజన్మభూమి మూమెంట్, దేవ్రాహ బాబా ఎలా సహాయం చేశాడు లాంటి వాటికి సంబంధించిన పూర్తిచరిత్ర ఉంటుంది. వీటితో పాటు ఓ అంగవస్త్రం ఉంటుంది. 
 

Latest Videos

click me!