అయోధ్య : రామయంత్రం మీద బాలరాముడి ప్రతిష్టాపన.. రామయంత్రం అంటే ఏమిటంటే...

First Published Jan 20, 2024, 7:32 AM IST

జనవరి 22న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇక మధ్యలో ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉంది.  ఈ సమయంలో ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

బాల రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే ముందు ఆ విగ్రహాన్ని గర్భగుడిలో రామయంత్రం మీద ఉంచుతారు. బాల రాముడు విగ్రహం గర్భగుడిలో శుక్రవారం నాడు కొలువుతీరింది. 

విగ్రహ ప్రతిష్టాపనకు ముందు రాముడి విగ్రహాన్ని రామయంత్రం మీద ఉంచారు. ఇంతకీ రామ యంత్రం అంటే ఏమిటి? వివరాలు చూద్దాం...

Latest Videos


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యంత్రాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ యంత్రాలను వేదమంత్రోచ్ఛరణలతో  పవిత్రం చేసి విగ్రహం కింద ఉంచుతారు. అలాంటి యంత్రాల్లో రామయంత్రం కూడా ఒకటి.

రామయంత్రం ఎలా కనిపిస్తుందంటే..
రామయంత్ర నలు చదరంగా ఉంటుంది. లోపల ఎనిమిది తామర రేకులు ఆకారంలో మంత్రాలు రాసి ఉంటాయి. ఇక యంత్రానికి చుట్టూ కూడా ప్రత్యేకమైన మంత్రాలు రాసి  ఉంటాయి.

మధ్యలో  ఆరు త్రిభుజాలు
8 తామర పూరేకులతో తయారైన ఈ రామయంత్రంలో మధ్యలో ఆరు త్రిభుజాలు ఉంటాయి .ఈ ఆరు త్రిభుజాల్లో ఒక్కో దాని మీద ప్రత్యేకమైన పదాలు రాస్తారు. ఇక మధ్యలో రా రామాయ నమః అని రాసి ఉంటుంది.

రామయంత్రాన్ని ఎలా తయారు చేస్తారు?
రామయంత్రాన్ని భోజ్ పాత్ర అనే ఓ రకమైన చెట్టు బెరడు లేదా ఆకుతో తయారుచేస్తారు. రామయంత్రాన్ని తయారీలో దానిమ్మ కాడలు, కుంకుమపువ్వు  ఉపయోగిస్తారు.

ఇవి ఎక్కడ దొరుకుతాయి?
రకరకాల మెటీరియల్ లో ఈ రామయంత్రం దొరుకుతుంది.  పూజ స్టోర్స్ లో  అందుబాటులో ఉంటుంది. ఇంట్లో కట్టుకునే ముందు శుద్ధిచేసి, ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది.

రామయంత్రతో లాభాలేంటి
రామయంత్రం ఇంట్లో ఉంటే ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు దరిచేరవు. సుఖశాంతులు, ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో ఉన్న ఎలాంటి  ఇబ్బందులైనా తొలగిపోతాయి. 

ram mandir ayodhya

జనవరి 22న ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ వేడుక కోసం.. రామయ్య తన జన్మస్థానంలో కొలువుతీరే అపూర్వ ఘట్టం కోసం భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

click me!