అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట : ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటి? ఎలా చేస్తారు?

First Published | Jan 17, 2024, 8:32 AM IST

అయోధ్యలో మంగళవారం నుంచి రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా మొదటి రోజు ప్రాయశ్చిత్త పూజను నిర్వహించారు. ఇంతకీ ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?

ఉజ్జయినికి చెందిన పండిత నళిన్ శర్మ తెలిపిన దాని ప్రకారం ఏ దేవాలయానికైనా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు ఈ ప్రాయశ్చిత్త పూజ చేస్తారు. దీనిని మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండి పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ప్రాయశ్చిత్తపూజ అంటే పంచద్రవ్య మరికొన్ని అలాంటి మూలికలు కలిపిన నీటితో స్నానం చేయడం. అంతేకాదు బంగారం, వెండి, నగలు వంటికి కూడా దానం చేస్తారు.


ప్రాయశ్చిత్త పూజలు చేయడం వల్ల ఎలాంటి దోషాలు అంటుకోవని అంటారు. దేవాలయాలను నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాలను ప్రతిష్టించేప్పుడు తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. దీనివల్ల పూజల నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగినా దోషం తగలదని చెబుతారు.

మరి ఈ ప్రాయశ్చిత్త పూజ ఎవరు చేయాలి? అంటే.. యజమాని చేయాల్సి ఉంటుంది. దేవాలయంలో ప్రాణ ప్రతిష్టను ఎవరైతే చేస్తారో వారు చేయాలి. రామాలయంలో ఈ ప్రాయశ్చిత్త పూజను 121 మంది బ్రాహ్మణులు చేస్తున్నారు.

దేవాలయం నిర్మాణంలోనో, పూజా విధానంలోనో, విగ్రహారాధనలోనో తెలిసో, తెలియకో ఏవైనా తప్పులు చేస్తే వాటినుంచి దోషం తగలకుండా ఉంటుందని నళిన్ శర్మ తెలిపారు. 

ప్రాయాశ్చిత్తం అనేది హిందూ సంస్కృతిలో ఆచారాలు లేదా పశ్చాత్తాప చర్యల ద్వారా... తమ చర్యలను సవరించుకోవడం లేదా క్షమాపణలు కోరడాన్ని సూచిస్తుంది.

Latest Videos

click me!