జాతీయ దేవాలయంగా రామ మందిరం..
అరుణ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ - “అయోధ్యలోని రామ మందిరం మన జాతీయ దేవాలయంగా మారబోతోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైన సంస్కృతికి ఈ ఆలయం పునరుజ్జీవింపజేసింది. మన సంస్కృతిని బలోపేతం చేసే సందేశాన్ని ఈ ఆలయం ఇస్తుంది. దీంట్లో ప్రపంచం మొత్తానికి తెలిసే ఒక వారసత్వం ఉంది, ఈ ఆలయం స్ఫూర్తికి మూలం, విశ్వాసానికి కేంద్రంగా ఉంది, ఇది మన గర్వంగా, మన గుర్తింపుగా మారుతుంది. మన నైతికతను అందరూ స్వీకరించాలి" అన్నారు.