అయోధ్య : రామాలయ నిర్మాణంలో మొదటినుంచీ ఎన్నో సవాళ్లు.. పునాదులు వేయడం ఇంత కష్టమైందా?

First Published | Jan 4, 2024, 12:38 PM IST

రామాలయం నిర్మాణం అనుకున్న తరువాత ఇక్కడి మట్టిని పరీక్షించారు. ఆ సమయంలో వారికి అర్థమయ్యిందేంటంటే నిర్మాణం అంత ఆషామాషీ కాదని..

అయోధ్య : ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్యరామాలయం ప్రారంభోత్సవం గురించే చర్చ నడుస్తోంది. ఆ అద్భుత క్షణాల కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ యేడు జనవరి 22న ఆ క్షణాలు సాకారం కానున్నాయి. 

రామాలయానికి పునాది పడ్డప్పటినుంచి నిర్మాణం పూర్తి కావస్తున్న నేటివరకు అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విషయాన్ని రామాలయ నిర్మాణ సమితి చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏసియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు, 


నృపేంద్ర మిశ్రా చెప్పిన దాని ప్రకారం.. రామమందిరానికి శంఖుస్థాపన చేయడం విషయం నుంచే సవాళ్లు మొదలయ్యాయి. అసలు పునాది వేయడంతోనే పెద్ద ఛాలెంజ్ మొదలయ్యింది అన్నారాయన. 

రామాలయం నిర్మాణం అనుకున్న తరువాత ఇక్కడి మట్టిని పరీక్షించారు. ఆ సమయంలో వారికి అర్థమయ్యిందేంటంటే నిర్మాణం అంత ఆషామాషీ కాదని.. పునాదులు వేయడం కోసం మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వాల్సి వచ్చిందట.  

తవ్వడం అంటే అలా ఇలా కాదు.. దాదాపు 15 మీటర్ల లోతు అంటే దాదాపు 3 అంతస్తు ఎత్తైన భవనం అంత లోటు మట్టిని తీయాల్సి వచ్చింది. అది కూడా వర్షరుతువు రాకముందే చేయాలి. లేదంటే వర్షానికి మట్టి తడిసిపోయి.. బురదగా మారి పని మరింత కష్టమవుతుంది. 

రామాలయం నిర్మాణం కోసం 15 మీటర్ల లోతు తవ్విన తరువాత మరో ఛాలెంజ్ ఎదురయ్యింది. ఆ ప్రాంతం మొత్తం పెద్ద బావిలాగా, లోయలాగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని నింపడం మరో సవాల్.

పునాదికోసం తవ్విన ఈ ప్రాంతాన్ని నింపడం కోసం ఇంజినీర్లు ఎలాంటి మట్టి వాడారంటే.. ఆ మట్టి దానంతట అదే రాయిలా మారిపోతుంది. రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ అది. దీనివల్ల రామాలయం పునాదిని గట్టి రాతినిర్మాణంలా మార్చేశాం. 

పునాదుల పని పూర్తయిన తరువాత మరోసారి ఎంత దృఢంగా ఉందో పరీక్షలు నిర్వహించారు. రామాలయం కన్ స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ, ప్రాజెక్ట్ మానిటరింగ్ కంపెనీ టాటా కన్సల్టెంట్ ఇంజినీర్లు సంయుక్తంగా దృఢత పరీక్షలు నిర్వహించారు. 

Latest Videos

click me!