అయోధ్యలో విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు.. ఇంతకీ వాల్మీకి ఎవరు?

First Published | Jan 3, 2024, 1:35 PM IST

వాల్మీకి ఆది కవి. రామాయణాన్ని రాసింది ఆయనే. రామాయణాన్ని మొదటి ఇతిహాస కావ్యంగా మలిచింది ఆయనే. వాల్మీకి రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలు, ఏడు ఖండాలు ఉన్నాయి.

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. అప్పటివరకు శ్రీమర్యాదపురుషోత్తం ఎయిర పోర్టుగా ఉన్న పేరును మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టుగా మార్చారు. దీంతో దేశంలోనే ఈ విమానాశ్రయం పేరు మార్మోగిపోతోంది. ఇంతకీ వాల్మీకి మహర్షి ఎవరు? అయోధ్యకు ఆయనకు ఏం సంబంధం? రాముడి పేరు తీసేసి వాల్మీకి పేరు ఎందుకు పెట్టారు? ఒకసారి చూస్తే...

వాల్మీకి ఆది కవి. రామాయణాన్ని రాసింది ఆయనే. రామాయణాన్ని మొదటి ఇతిహాస కావ్యంగా మలిచింది ఆయనే. వాల్మీకి రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలు, ఏడు ఖండాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం సుమారు 480,002 పదాలతో రూపొందించబడింది, 


రామాయణం కోసల రాజ్యంలో అయోధ్య నగరానికి చెందిన రాకుమారుడు, అతని భార్య సీతను లంక రాక్షస-రాజు  రావణుడు అపహరించిన కథను చెబుతుంది. క్రీస్తు పూర్వం 8వ నుండి 4వ శతాబ్దాల వరకు, కొన్ని దశలు 3వ శతాబ్దంవరకు విస్తరించి ఉన్నాయి. అయితే, అసలు కథ ఎప్పటిదనే తేదీ తెలియదు. 
 

వాల్మీకి మహర్షి రామాయణాన్ని బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు రాశారని అంటారు. ఆయన విగ్రహం ముందు కూర్చుని కఠిన తపస్సు చేస్తూ రామాయణాన్ని రచించారట. 

వాల్మీకి తల్లిదండ్రులు ఎవరు?
వాల్మీకి మహర్షి తల్లిదండ్రులు కశ్యప మహర్షి, చర్షిని దంపతులు. వాల్మీకి మహర్షికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఆయనే భృగు మహర్షి. అయితే, మరో చోట వాల్మీకి తండ్రి ప్రచేతసుడని.. ఆయన కొడుకు కాబట్టి ప్రాచేతసుడు అని ప్రసిద్ధి అని అంటారు. ఈ విషయాన్ని ఉత్తరకాండలో ఓ చోట వాల్మీకి ప్రస్తావించినట్లు చెబుతారు. అందుకే వాల్మీకి తల్లిదండ్రులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. 

వల్మీకం నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అని పేరు వచ్చింది. వల్మీకం అంటే పుట్ట. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు అని పూర్వాశ్రమంలో ఆయన దొంగ, కిరాతకుడు. నారదుడితో సంభాషణ తరువాత ఆయన తపస్సు చేయగా చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి. అలా పుట్టనుంచి పుట్టినవాడే వాల్మీకి. 

14 యేళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకున్న రాముడు.. ఆ తరువాత నిండు గర్భిణి అయిన సీతమ్మ తల్లిని అడవుల్లో వదిలేశాడు. ఆ సమయంలో సీతాదేవికి ఆశ్రయం ఇచ్చింది వాల్మీకి మహర్షే. ఆమె కవలపిల్లలు లవ,కుశులకు గురువు కూడా ఆయనే. 
 

Latest Videos

click me!