అయోధ్య : బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగిరాజ్ గురించి ఆసక్తికర విషయాలివే..

First Published | Jan 4, 2024, 10:43 AM IST

బాలారాముడి విగ్రహానికంటే ముందే అరుణ్ యోగిరాజ్ అనేక ప్రసిద్ధ విగ్రహాలనూ చెక్కారు. వీటిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆదిశంకరాచార్య, హనుమంతుడి విగ్రహాలూ ఉన్నాయి. 

అయోధ్య : కన్నుల పండువగా, అంత్యంత వైభవంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం కొనసాగుతోంది. రామాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్. కర్నాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్. విగ్రహ రూపకల్పన కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. 
 


అరుణ్ యోగిరాజ్ కు ఇన్స్ట్రాగ్రామ్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇన్ స్టాలో 37.3వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం శిల్పకారుల కుటుంబం. అరుణ్ యోగిరాజ్ తండ్రి కూడా ప్రసిద్ధ శిల్పకారుడే. 

బాలారాముడి విగ్రహానికంటే ముందే అరుణ్ యోగిరాజ్ అనేక ప్రసిద్ధ విగ్రహాలనూ చెక్కారు. వీటిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆదిశంకరాచార్య, హనుమంతుడి విగ్రహాలూ ఉన్నాయి. 

ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న 28 అడుగుల ఎత్తైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజే తయారు చేశారు. కేదారీనాథ్ లో అదిశంకరాచార్యుల 12 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయనే తయారు చేశారు. 

అరుణ్ యోగిరాజ్ కు రామాలయం ట్రస్టు విగ్రహరూపకల్పనకు ఎంచుకుంది. అప్పటినుంచి ఆయన పేరు మారుమోగుతోంది. ఆయన అంతకుముందు కార్పొరేట్ ఉద్యోగం చేసేవారట.

ఎంబీఏ చదువుకున్న అరుణ్ యోగిరాజ్ చదువుఅయిపోయాక ఓ కార్పొరేట్ కంపెనీలో చేరారు. కానీ 9-5 ఉద్యోగం ఆయనకు నచ్చలేదు. దీంతో పూర్తిస్థాయి శిల్పకారుడిగా తన కెరీర్ ను తీర్చిదిద్దుకున్నారు. 

పూర్తి స్థాయిలో శిల్పకారుడిగా మారి తమ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారు అరుణ్ యోగిరాజ్. నేడు దేశంలోనే అత్యంత ప్రసిద్ధ శిల్పకారుల్లో ఒకరిగా నిలిచారు. 

అరుణ్ యోగిరాజ్, ప్రధాని మోడీతో దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో అరుణ్ ప్రధానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని బహూకరిస్తున్నారు. 

Latest Videos

click me!