ఐస్ క్రీంలో విషం కలిసి.. పన్నెండేళ్ల చిన్నారిని చంపిన మేనత్త.. కారణం ఏంటంటే...

Published : Apr 21, 2023, 02:16 PM IST

కేరళలో ఓ ఘటన కలకలం రేపింది. సొంత మేనత్తే పన్నెండేళ్ల చిన్నారిని పొట్టనపెట్టుకుంది. ఐస్ క్రీంలో విషం కలిపిచ్చి చంపేసింది. 

PREV
17
ఐస్ క్రీంలో విషం కలిసి.. పన్నెండేళ్ల చిన్నారిని చంపిన మేనత్త.. కారణం ఏంటంటే...
ice cream

కేరళ : మేనత్త అంటే తల్లి తర్వాత తల్లి అంతటి ప్రేమ కురిపిస్తుందని అంటారు. కానీ ఈ మేనత్త మాత్రం.. ఆ పసివాడి పాలిట యముడిలా మారింది. చిన్నారికి ఐస్ క్రీమ్ లో విషం కలిపి మరీ చంపేసింది. అలా చేయడం వల్ల ఎవరికీ తెలియదనుకుంది. కానీ, చివరికి విషయం వెలుగు చూడడంతో అరెస్టై జైలుకు వెళ్లింది. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది. 

27
ice cream

కేరళలోని కోజికోడ్ లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూడడంతో అసలు ఏం జరిగిందనే దానిమీద ఆసక్తి పెరిగిపోయింది. అరికులం ప్రాంతానికి చెందిన మహమ్మద్ అలీ కుమారుడు అహ్మద్ హసన్ రిఫాయి (12) ఈ ఘటనలో మృతి చెందాడు. హసన్ రిఫాయి చెంగరోత్ ఎంయూపిఎస్ లో ఆరవ తరగతి చదువుతున్నాడు. 

37

గత ఆదివారం హసన్ రిఫాయి తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తిన్నాడు. ఆ తర్వాత వాంతులు చేసుకున్నాడు.అది గమనించిన తల్లితండ్రులు వెంటనే హసన్ రిఫాయిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అతనికి చికిత్స అందించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించడంతో బాలుడు శుక్రవారం నాడు చనిపోయాడు. 

47

ఇంతకీ హసన్ రిఫాయి ఎందుకు చనిపోయాడు.  ఐస్ క్రీమ్ లో ఏముంది? అని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో హసన్ రిఫాయి మరణం మీద పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు అందరినీ షాకింగ్ గురిచేశాయి. 

57

బాలుడి సొంత అత్త తహిరా అతడిని చంపాలని పథకం వేసిందని తెలిసింది. దీనికోసం బాలుడికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ను సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చింది.. దాంట్లో విషం కలిపింది. ఐస్ క్రీమ్ ని బాలుడికి తినిపించింది. అది తిన్న తర్వాత బాలుడు తేరుకోలేకపోయాడు. అస్వస్థతకు లోనే వాంతులతో ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని హాస్పిటల్ లో చేర్పించారు. 

67

పోలీసుల విచారణలో హసన్ రిఫాయి తిన్న ఐస్క్రీమ్ లో అమోనియం ఫాస్ఫరస్ విషం కలిపినట్లుగా తేలింది. అది అత్త తాహిరనే  కలిపినట్లుగా నిర్ధారించుకున్నారు. దీంతో  ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాలుడిని చంపడానికి అసలు కారణం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. 

77

ఆస్తి కోసమే బాలుడిని చంపిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూడడంతో కేరళలో కలకలం రేగింది. బాలుడిని చంపిన మేనత్త మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  

click me!

Recommended Stories