అంబానీ ఇంట పెళ్లి వేడుకలో తెలుగమ్మాయి స్పెషల్ షో ... జస్టిన్ బీబర్ కంటే తోపా..!!

First Published | Jul 12, 2024, 4:56 PM IST

ప్రపంచ కుభేరుల ఇంట అంగరంగవైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో ఓ తెలుగమ్మాయి మెరవనుంది.  ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బిబర్ ప్రదర్శన జరిగిన వేడుకలోనే తెలుగమ్మాయి సాంస్కృతిక ప్రదర్శన సాగనుంది. 

Anant Radhika

ముంబై : ప్రపంచ కుబేరుల్లో ఒకరయిన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లంటే మామూలు మాటలా. ఆకాశమే పందిరిగా, భూలోకమే పీటగా వేసారా అన్నట్లుగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ఏర్పాట్లు చేసారు. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఈ పెళ్లి వేడుకలో ఇవాళ అత్యంత కీలకమైన రోజు ... అనంత్, రాధిక వివాహం ఇవాళ జరుగుతోంది.. మూడుముళ్ళ బంధంతో ఈ జంట ఒక్కటి అవుతున్నారు.  

Anant Radhika

ప్రీ వెడ్డింగ్ వేడుకలను అంబానీ కుటుంబం ఎంత వైభవంగా నిర్వహించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్, బాలివుడ్ తారలతో ప్రత్యేక కార్యక్రమాలు, పాప్ సింగర్స్ తో ఆటాపాటలు... దేశ విదేశాలకు చెందిన అతిథులు... ఇలా కోట్లు ఖర్చుచేసి ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు జరిపింది అంబానీ కుటుంబం. ఇలా అంబానీల ఇంట పెళ్లి సందర్భంగా జరిగిన వేడుకలు ఎంత అట్టహాసంగా సాగాయో మనందరం టివిల్లో, సోషల్ మీడియాలో చూసాం. 
 


Anant Radhika

అయితే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలే ఈ స్థాయిలో వుంటే పెళ్లిరోజు ఇంకెలా వుంటుందో..? ఏ హాలివుడ్ లేదంటే బాలీవుడ్ సెలబ్రిటీలతో కార్యక్రమాలు వుంటాయో..?  అని అందరూ ఊహించడం సహజమే. కానీ అంబానీల ఇంట పెళ్లి వేడుకలో ఓ తెలుగమ్మాయి సందడి చేయనుందని తెలుసా..? ఏంటి అవాక్కయ్యారా... ఇంత గ్రాండ్ గా జరుగుతున్న అంబానీ పెళ్లివేడుకలో మెరివబోయే ఆ తెలుగు మహిళ ఎవరో తెలుసుకోవాలని వుందా... అయితే ఆ విషయమేంటో తెలుసుకుందాం రండి. 
 

veena srivani

ముఖేష్ అంబానీ, నీతా అంబాని దంపతులు మంచి కళాపోషకులనే విషయం వారి పిల్లల పెళ్లిళ్లను బట్టే అర్థమవుతుంది. సహజంగానే గుజరాతీ కుటుంబాలు ఏ వేడుకలను అయినా అట్టహాసంగా నిర్వహిస్తారు... అంబానీలది ప్రపంచంలోనే ధనిక కుటుంబాల్లో ఒకటి కాబట్టి మరింత గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇలా ముఖేష్ చిన్నకొడుకు అనంత్-రాధిక వివాహ వేడుకలు కూడా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ సందర్భంగా అచ్చతెలుగు వీణానాదం అంబానీల ఇంట పెళ్లిలో వినిపించనుంది. తెలుగింటి ఆడబిడ్డ శ్రీవాణి ఈ వీణాగానం చేయనున్నారు. 
 

Srivani

ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి భార్యే ఈ వీణా శ్రీవాణి. తెలుగోళ్ళ ప్రాచీన సంగీత వాయిద్యం వీణతో అద్భుత రాగాలు పలికిస్తుంటారామే. పలు సినిమా పాటలతో పాటు అన్నమయ్య సంకీర్తనలు, సాంప్రదాయబద్దమైన పాటలను తన వీణతో అద్భుతంగా పలికించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇలా మంచి గుర్తింపు పొందిన తెలుగమ్మాయి అంబానీల ఇంట పెళ్లిలో వీణా వాయిద్యంతో మరోసారి మెరవనున్నారు. 

Veena Srivani

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో తన వీణానాదం వుంటుందని స్వయంగా శ్రీవాణి తెలిపారు. అచ్చ తెలుగు వేషధారణలో ప్రదర్శన ఇవ్వాలని స్వయంగా నీతా అంబానీ సూచించినట్లు వీణా శ్రీవాణి తెలిపారు. అంబానీ ఇంట పెళ్లివేడుకలో తాను ప్రదర్శన ఇవ్వడం ఎంతో గర్వంగా వుందని... మీ  ఆశీర్వాదం కావాలంటూ తెలుగు ప్రజలను కోరారు. ఇలా వీణా శ్రీవాణి అంబానీల పెళ్ళిలో ప్రదర్శన గురించి చెబుతున్న వీడియోను ఆమె భర్త వేణు స్వామి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. 
 

Latest Videos

click me!