గంగా విలాస్ తన ప్రయాణ దారిలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 కి పైగా ముఖ్య ప్రదేశాలలో ఆగుతుంది. ఇది సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్ సహా జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాల గుండా కూడా వెళుతుంది. క్రూయిజ్ లో సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్ వంటి అనేక ఇతర అధునాత సౌకర్యాలు ఉంటాయి.