శ్రీనగర్ వీధుల్లో చెప్పులు బేరమాడుతూ సోనూసూద్ హల్ చల్...

First Published Aug 7, 2021, 11:54 AM IST

ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపాది దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ సినీ విలన్.. రియల్ హీరోగా తెలుసు. కరోనా సమయంలో అతని దాతృత్వం జాతి, కుల, మత, చిన్నా,పెద్దా తేడాలు లేకుండా అందరి హృదయాల్నీ దోచుకుంది. రియల్ హీరో సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే.
undefined
Sonu Soodసామాజిక మాధ్యమాలను కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం కాకుండా, సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయం చేసి ఒక్కసారిగా రియల్ హీరోగా అందరి హృదయాల్ని దోచుకున్నాడు. ఆ తరువాత సెకండ్ వేవ్ సమయంలోనూ ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుతో తన దాతృత్వానికి అంతు లేదని నిరూపించాడు.
undefined
ఇవే కాకుండా సాయం కావాలని అడిగిన ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నారు. అడగకపోయినా తన దృష్టికి వచ్చిందంటే వారికి ఫోన్ చేసి మరీ సాయపడుతున్నారు. ఇటీవల వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా వీధి వ్యాపారి దగ్గర చెప్పులు కొన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు.
undefined
Sonu Soodషమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపాది దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు. ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆతరువాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపుకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకోండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తగత ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
undefined
షమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపాది దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగారు. ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆతరువాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపుకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకోండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తగత ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
undefined
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్ చేస్తూ సోనూ చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
undefined
click me!