అయోధ్యలో ప్రధాని మోడీకి జననీరాజనం..

First Published | Dec 30, 2023, 12:48 PM IST

శనివారంనాడు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించారు. టెంపుల్ టౌన్ లో ప్రధాని మోడీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్‌ను ప్రారంభించారు. 

అయోధ్య : అయోధ్యలో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. రూ.1500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. రోడ్ షో లో మోడీకి ఘనస్వాగతం లభించింది. 

అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణానికి రూ. 1450 కోట్ల ఖర్చు చేశారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దీనికి నామకరణం చేశారు. ఏటా 10 లక్షల మంది భక్తులు వినియోగించుకునేలా నిర్మాణం చేశారు.


దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ఉండబోతున్నాయి. జనవరి 6 నుంచి రెగ్యులర్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

ఇక రూ. 240 కోట్లతో అయోధ్య దామ్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం మూడు అంతస్తుల్లో ఉంది.  రైల్వే స్టేషన్ గోడలపై రామాయణంలోని ఘట్టాలు చిత్రీకరించారు. 

పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ ను  ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆరు వందే భారత్, రెండు అమృత్ భారత రైళ్లను ప్రారంభించారు. 

46 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మోడీ అనంతరం అయోధ్యలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. 

Latest Videos

click me!