ఐఐటీ సన్యాసులు... కార్పోరేట్ జాబ్స్ వదిలి కాషాయం కట్టిన ఐఐటియన్లు వీరే

Published : Jan 17, 2025, 12:20 PM ISTUpdated : Jan 17, 2025, 12:28 PM IST

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో చదివి సన్యాసులుగా మారిన ఐఐటియన్లు మన దేశంలో చాలామంది వున్నారు. తాజాగా ప్రయాగరాజ్ కుంభమేళాలో ఐఐటీ బాబా గురించి బైటపడింది... కాషాయం కట్టిన మిగతా ఐఐటియన్ల గురించి కూడా తెలుసుకుందాం. 

PREV
14
ఐఐటీ సన్యాసులు... కార్పోరేట్ జాబ్స్ వదిలి కాషాయం కట్టిన ఐఐటియన్లు వీరే
IIT Baba

IIT (Indian Institute of Technology) ... భారతదేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలు. ఐఐటీ సీటు సాధించాలని కోట్లాదిమంది స్టూడెంట్స్ ప్రయత్నిస్తుంటారు... కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. ఐఐటీలో చదివితే లైఫ్ సెట్ అవుతుందని విద్యార్థులకే కాదు వారి పేరెంట్స్ కు కూడా నమ్మకం. అందుకే తమ పిల్లలను చిన్నప్పటినుండి ఐఐటీ లక్ష్యంగా తీర్చిదిద్దుతుంటారు చాలామంది.

ఇలా దేశంలోని వివిధ ఐఐటీల్లో చదివినవారు మనదగ్గరే కాదు విదేశాల్లోని టాప్ కంపనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో వున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, డిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఐఐటీయన్లే... ఇలా చాలామంది ఐఐటీలో చదివాక వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. కొందరు ఉద్యోగాలు, మరికొందరు వ్యాపారాలు, ఇంకొందరు రాజకీయాలు... ఇలా ఏ రంగం ఎంచుకున్నా ఐఐటియన్లు ఉన్నతస్థాయిలో వున్నారు.

అయితే ఐఐటియన్లు కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలకే పరిమితం కాలేదు... ఆద్యాత్మికత వైపు నడిచినవారు వున్నారు. తాజాగా ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో ఓ ఐఐటీ బాబా దర్శనమిచ్చారు. కార్పోరేట్ లైఫ్ ను వదిలిపెట్టి కాషాయం ధరించిన ఆ బాబా అందరినీ ఆకట్టుకుంటున్నారు. మీడియా సంస్థలు ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు ఎగబడుతున్నాయి...  సోషల్ మీడియాలో కూడా ఆ ఐఐటీ బాబా వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

అయితే ప్రయాగరాజ్ లో కనిపించిన ఐఐటీ బాబానే కాదు ఇంకా చాలామంది ఐఐటియన్లు ఆద్యాత్మికత వైపు నడిచారు. లక్షల జీతాలు వదిలేసి, కోట్ల వ్యాపారాలు పక్కనబెట్టి కుటుంబానికి దూరంగా, ప్రజలకు దగ్గరగా బ్రతుకున్నారు చాలామంది ఐఐటియన్లు. ఇలా సన్యాసం తీసుకున్న, కాషాయం ధరించిన ఐఐటియన్ల గురించి తెలుసుకుందాం. 

24
IIT Baba

1. ఐఐటి బాబా : 

ప్రయాగరాజ్ కుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చిన ఐఐటి బాబా అసలు పేరు అభేయ్ సింగ్. ఆయన స్వస్థలం హరియాణా. చిన్నప్పటినుండి చదువులో ముందుండేవారు అభేయ్... స్కూల్, కాలేజీ విద్యను మంచిమార్కులతో పూర్తిచేసారు. ఎందరో విద్యార్థులు కలలుగనే ఐఐటీలో ఇతడు సీటు సాధించగలిగారు... బాంబే ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేసారు. 

ఐఐటీలో వుండగానే అభేయ్ కు ప్లేస్ మెంట్ లో ఉద్యోగం లభించింది. కొంతకాలం కార్పేరేట్ ఉద్యోగం చేసారు... ఈ జీవితం సంతృప్తిగా లేకపోవడంతో ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ వైపు మళ్లారు. అక్కడా అతడికి సంతృప్తి దొరకలేదు... దీంతో ఆద్యాత్మిక మార్గం పట్టారు. కుటుంబాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని వదిలి పూర్తిస్థాయి సన్యాసిగా మారారు అభేయ్ సింగ్. 

కాషాయం ధరించిన ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఆయనను మీడియా ఛానల్స్, యూట్యూబర్లు ఇంటర్వ్యూ చేయడంతో ఈ ఐఐటీ బ్యాగ్రౌండ్ బైటపడింది. ఇక తన జీవితం ఆద్యాత్మిక మార్గంలోనే నడుస్తుందని అభేయ్ సింగ్ చెబుతున్నారు. 
 

34
IIT

2. రసనాథ్ దాస్ :

దేశంలోనే అత్యున్నత ఐఐటీలో చదివారు... వాల్ స్ట్రీట్ ఉద్యోగం చేసారు. స్టాక్ మార్కెట్ లో పనిచేస్తూ చేతినిండా సంపాదించేవారు రసనాథ్ దాస్. కానీ ఆయనకు ఈ చదువు, ఈ ఉద్యోగం ఏదీ సంతృప్తిని ఇవ్వలేదు. ఆద్మాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 

రసనాథ్ దాస్ ఐఐటీతో పాటు కార్నెల్ యూనివర్సిటీలో ఎంబిఏ చేసారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివిన అతడికి విదేశాల్లో మంచి సాలరీతో ఉద్యోగం కూడా లభించింది. వీటన్నింటిని వదిలి కాషాయం ధరించారు కసనాథ్ దాస్.

3. ఖుర్షేద్ బట్లివాలా : 

ప్రతిష్టాత్మక బాంబే ఐఐటీలో చదివి ఆద్యాత్మిక మార్గం పట్టిన మరో వ్యక్తి ఖుర్షేద్ బట్లివాలా. ఈయన ఐఐటీలో మాస్టర్ డిగ్రీ చేసారు. ఈయన ప్రస్తుతం ఆర్ట్ లివింగ్ ద్వారా దేశ విదేశాల్లో అద్యాత్మిక బోధనలు చేస్తున్నారు. తన జీవింత సంఘటనలను ఇతరులను మోటివేట్ చేయడాని ఉపయోగిస్తుంటారు.. ఇలా నిజ జీవితానికి దగ్గరగా వుండే అతడి ఉపన్యాసాలు యువతను ఎంతగానో ఆకట్టుకునేలా వుంటాయి. 

4. స్వామి ముకుందానంద  : 

ఈయన ఐఐటి డిల్లీలో బిటెక్ పూర్తిచేసారు... అలాగే ఐఐఎం కలకత్తాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఉన్నత చదువులు చదివిన స్వామి ముకుందానందను అనేక ఉద్యోగావకాశాలు వచ్చాయి... కానీ వాటిని తృణపాయంగా వదిలేసి ఆద్యాత్మిక మార్గం పట్టారు. 

కార్పోరేట్ జీవితాన్ని వదిలి  కాషాయ వస్త్రాలు ధరించి మోటివేషనల్ స్పీకర్ గా మారారు. అలాగే ఆద్యాత్మిక సంస్థలను కూడా ఈయన నెలకొల్పారు. ప్రస్తుతం ఆయన ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు. 

5. అవిరల్ జైన్ :

IIT (BHU) వారణాసి నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసారు అవిరల్ జైన్. ఇక్కడ చదువుతుండగానే అతడికి రూ.40 లక్షల సాలరీతో మంచి కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ అతడికి ఈ ప్రొఫెషనల్ లైఫ్ నచ్చలేదు... దీంతో భారీ జీతంలో కూడిన ఉద్యోగాన్ని 2019 లో వదిలిపెట్టాడు. అప్పటినుండి ఆద్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నారు. 

44
Mahhan MJ

6. సాంకేత్ ఫరేఖ్ : 

ఐఐటీ బాంబేలో చదివి ఆద్యాత్మిక మార్గం పట్టిన మరోవ్యక్తి ఈ సాంకేత్ ఫరేఖ్. ఇతడు ఐఐటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసారు. ఆ తర్వాత కొంతకాలం మంచి సాలరీతో ఉద్యోగం కూడా చేసారు. కానీ చివరకు అన్నీ వదిలేసి సన్యాసిగా మారిపోయారు. 

7. ఆచార్య ప్రశాంత్ : 

ఐఐటి డిల్లీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. ఈయన అసలు పేరు ప్రశాంత్ త్రిపాఠి... ఆద్యాత్మికత వైపు వచ్చాక పేరు మార్చుకుని ఆచార్య ప్రశాంత్ గా మారారు. అతడు ధర్మ టాక్స్ పేరుతో మోటివేషనల్, భక్తి ఉపన్యాసాలు ఇస్తుంటారు.

8. మహాన్ మహరాజ్ :

ఐఐటి కాన్సూర్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. అనంతరం కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తిచేసారు. చదువు పూర్తయ్యాక ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా పనిచేసారు. 

అయితే ఈ ఉద్యోగం, ప్రొఫెషనల్ జీవితం అతడికి నచ్చలేదు. దీంతో అన్నీ వదిలేసి ఆద్యాత్మిక యాత్ర చేపట్టారు మహాన్ మహారాజ్. 


9. రాదేశ్యామ్ దాస్  : 

ఐఐటి బాంబే నుండి 1993 లో ఎంటెక్ పూర్తిచేసారు రాదేశ్యామ్ దాస్. కానీ ఆయనకు  ఆద్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రజాసేవ చేయాలనే కోరిక వుండేది. దీంతో 1997 లో ఇస్కాన్ లో చేరారు. ప్రస్తుతం పూణేలో ఇస్కాన్ ద్వారా ప్రజాసేవ చేస్తున్నారు.  

click me!

Recommended Stories