పదేళ్లలో 300మంది హత్య.. విషపుసూదితో ప్రాణాలు తీశాను.. వీడియో వైరల్...

First Published | Apr 22, 2023, 8:48 AM IST

తమిళనాడులో ఓ వ్యక్తి తాను పదేళ్లలో 300 మందిని హత్యచేశానని చెబుతున్న ఓ వీడియో  వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

తమిళనాడు : తమిళనాడులోని ఆసుపత్రులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదేళ్లలో 300 మంది రోగులను తాను హత్య చేశానని ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు.  దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

అతని విచారించిన తర్వాత శుక్రవారం నాడు పోలీసులు ఈ మేరకు వివరాలను తెలియజేశారు… నిందితుడు మోహన్ రాజ్ (34)  పల్లి పాలయానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రి దగ్గర ఎప్పుడు తచ్చాడుతూ ఉండేవాడు. ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే వ్యక్తితో స్నేహం కుదిరింది. అప్పుడప్పుడు అతను చెప్పే పనులు చేస్తుండేవాడు.


ఈ క్రమంలోనే ఏప్రిల్ 18వ తేదీన తాను 10 ఏళ్లలో 300 మందిని హత్య చేసినట్లుగా ఓ వీడియోలో మాట్లాడి దాన్ని రిలీజ్ చేశాడు. అది వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే… ఆరోగ్యం క్షీణించి కోలుకోలేని రోగులకు.. వయోభారంతో బాధపడే వారికి.. కారుణ్య మరణాల కింద..  వారి కుటుంబ సభ్యులు, బంధువుల కోరిక మేరకు ముక్తిని ప్రసాదించే వాడినని చెప్పాడు. 

వారికి విషపుమందును సూదితో వేసి హత్య చేసేవాడినని.. దీని కోసం  ఒక్కొక్కరి దగ్గర రూ. 5000 తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా ఇప్పటివరకు ఈ పదేళ్లలో దాదాపు 300 మందిని చంపేశానని మోహన్ రాజ్ చెప్పాడు. 

విల్లివాక్కంలోనే కాదు.. చెన్నై, బెంగళూరులో కూడా ఇలాంటి పనులకి వెళ్లానని చెప్పుకొచ్చాడు. రూ. 5000 తనకు ఇస్తే రెండు నిమిషాల్లో పని పూర్తి చేస్తానని మోహన్ రాజ్ తెలిపాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పల్లిపాలయం  పోలీసులు అలర్ట్ అయ్యారు. మోహన్ రాజు మీద కేసు నమోదు చేసుకున్నారు. అతడిని అరెస్టు చేశారు. 

అయితే పోలీసులు అరెస్టు చేసిన తర్వాత మోహన్ రాజ్ తను అది మద్యంమత్తులో మాట్లాడినట్టుగా పేర్కొన్నాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న 18 మంది నకిలీ డాక్టర్లతోపాటు.. మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Videos

click me!