Success story: టీ షాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న 27 ఏళ్ల యువకుడు.. సక్సెస్ సీక్రెట్ ఏంటంటే?

First Published | Aug 8, 2023, 12:24 PM IST

Success story: ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి అవ్వాలి అనుకొని అక్కడ సక్సెస్ కాలేక టీ షాపు పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్న ఒక యువకుని సక్సెస్ స్టోరీ ఇది. ఆ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం.
 

డబ్బు సంపాదించడం ఎలా అనేది చాలామందికి ఎప్పటికీ అర్థం కాని విషయం. కొందరికి తలలు పండిపోయినా ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండదు. కానీ నేటి తరం పిల్లలు చిన్న ఐడియాలతో పెద్ద బిజినెస్ లు చేసి కోట్లు గడుస్తున్నారు. అలాంటి ఒక యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అనుభవ్ దూబే.. ఇతను 1996వ సంవత్సరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో జన్మించాడు.
 

ఇతని తండ్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్. తన కొడుకు కూడా తన బాటలోనే పయనిస్తాడు అని అనుకున్నాడు. కానీ కొడుకు మాత్రం తన భవిష్యత్తుకి మరో బాట వెతుక్కున్నాడు. ఐఐటి, ఐఐఎం, యూపీఎస్సీ వంటి ఎగ్జామ్స్ రాసి అందులోనే తన బంగారు భవిష్యత్తుని వెతుక్కోవాలి అనుకున్నాడు.
 


కానీ వీటన్నింటి బదులు అతను ఇండోర్ లో ఓ కాలేజీలో బీకాంలో చేరాడు. అక్కడే అతనికి ఆనంద నాయక్ పరిచయమయ్యాడు. దాదాపుగా వీరి ఇద్దరి ఆలోచనలు, అభిరుచిలు ఒకటిగా ఉండటంతో చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
 

ఆ తరువాత అభినవ్ ఢిల్లీ వెళ్లి యుపిఎస్సి కి ప్రిపేర్ అవ్వటానికి వెళ్ళాడు. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయాడు. అప్పుడే అతని ఆలోచన విధానంలో మార్పు మొదలైంది. అదే సమయంలో అతని ఫ్రెండ్ ఆనంద్ కూడా కలిశాడు. ఇద్దరి అభిరుచులు ఒకటే కావటంతో వాళ్ళిద్దరి ఆలోచన వ్యాపారం వైపు మళ్ళింది. ఇండోర్ ప్రజలకి టీ అంటే ఉన్న అభిమానం మీద వాళ్ళ దృష్టిపడింది.
 

ఇంకేముంది స్నేహితులు ఇద్దరు కలిసి మూడు లక్షల రూపాయలతో చాయ్ సుత్తా బార్ అనే టీ దుకాణం తెరిచారు. ముందు వీళ్ళ షాప్ కి పెద్దగా ఎవరూ వచ్చేవారు కాదు. కానీ వేడివేడి టీ ని మట్టి కప్పులలో అందిస్తున్న ఈ టీ దుకాణం గురించి మెల్లగా మౌత్ పబ్లిసిటీ పెరిగింది. దాంతో అమాంతం వీళ్ళ బిజినెస్ కూడా పెరిగింది.
 

వీళ్ళ దగ్గర 20 రకాల టీ లభిస్తుంది. ఇప్పుడు విదేశాలలో లో ఉన్న బ్రాంచీలతో కలిపి మొత్తం 150 బ్రాంచులకి చేరువ అయింది వీళ్ళ బిజినెస్. తాజాగా 100 కోట్ల మార్పు ఆదాయం కూడా దాటింది. డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి అభినవ్ బిజినెస్ ప్రయాణం ఒక ప్రేరణ.

Latest Videos

click me!