బంగ్లాదేశ్‌లో 13వేల మంది ఇండియన్స్‌.. మనోళ్ల పరిస్థితి ఇదేనని కేంద్ర మంత్రి జయశంకర్ వెల్లడి

First Published | Aug 6, 2024, 2:39 PM IST

బంగ్లాదేశ్‌లో ఆందోళనల కారణంగా రాజీనామా చేసిన ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇటీవల అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 13,000 మంది భారతీయుల భద్రత పై చర్చ జరుగుతూ, కాంగ్రెస్ కూటమి వారు భద్రత కల్పించాలని కోరారు.

ఢిల్లీ : బంగ్లాదేశ్ అల్లర్ల కారణంగా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇంకా భారత్‌లోనే ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

అయితే, ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారా..? లేదా..? అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని అఖిలపక్ష సమావేశంలో జయశంకర్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపారు.

Latest Videos


అలాగే, అఖిలపక్ష సమావేశంలో బంగ్లాదేశ్‌లోని భారతీయుల తరలింపుపై చర్చ జరిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న 13,000 మంది భారతీయులకు భద్రత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ కోరింది. కాగా, ఎన్నికల నుంచే సమస్యలు మొదలయ్యాయని ప్రభుత్వం తెలియజేసింది. 

భారతీయులు బంగ్లాదేశ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ దేశ బలగాలు టచ్‌లో ఉన్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ తెలిపారు. అల్లర్లలో విదేశీ జోక్యం ఉందో లేదో చెప్పలేమన్నారు. అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జయశంకర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. కాగా, ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

click me!