విజయ్ ఆంటోని నటించిన 'మార్గన్' మూవీ రివ్యూ

Published : Jun 27, 2025, 08:08 PM IST

బిచ్చగాడు చిత్రంతో తమిళ నటుడు విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి విజయ్ ఆంటోని నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి.విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం మార్గన్ నేడు శుక్రవారం రిలీజ్ అయింది.

PREV
16
Maargan Movie Review

బిచ్చగాడు చిత్రంతో తమిళ నటుడు విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి విజయ్ ఆంటోని నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి. వైవిధ్యమైన కథలు ఎంచుకుని ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని విజయ్ ఆంటోని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం మార్గన్ నేడు శుక్రవారం రిలీజ్ అయింది. లియో జాన్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా ఆయనే. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కోరుకునే థ్రిల్ అందించిందా ? సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా ? అనేది సమీక్షలో తెలుసుకుందాం. 

26
కథ

హైదరాబాద్ లో ఓ యువతి దారుణ హత్యకి గురవుతుంది. ఓ చెత్తకుప్పలో ఆమె మృత దేహం బయటపడుతుంది. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కావడంతో ముంబై అడిషనల్ డిజిపి ధృవ కుమార్(విజయ్ ఆంటోని) కూడా దీని గురించి తెలుసుకుంటారు. గతంలో తన కుమార్తె కూడా ఇదే విధంగా హత్యకి గురికావడంతో ధృవ కుమార్ స్వయంగా ఈ కేసుని చేధించాలని రంగంలోకి దిగుతాడు. హైదరాబాద్ పోలీసులతో కలసి విచారణ ప్రారంభిస్తాడు. 

ఈ క్రమంలో అరవింద్ అనే కుర్రాడికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు ధృవ కుమార్ కి అనుమానం వస్తుంది. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ వాస్తవాలు తెలుసుకుని ధృవ కుమార్ కూడా షాక్ అవుతారు. 

అరవింద్ ద్వారా ధృవ కుమార్ కి తెలిసిన నిజాలు ఏంటి ? అతడిని ఈ హత్యలతో నిజంగానే సంబంధం ఉందా ? అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ? ధృవ కుమార్ చివరికి ఈ కేసుని ఎలా చేధించగలిగారు లాంటి అంశాలే మిగిలిన కథ. 

36
విశ్లేషణ

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఒకే టెంప్లేట్ లో సాగుతుంటాయి. ఆరంభంలో నేరం జరగడం.. హీరో ఎంట్రీ ఇచ్చి ఒక్కో క్లూ పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం, విలన్ ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంచడం ఇదే తరహాలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఉంటాయి. మార్గన్ చిత్రాన్ని కూడా దర్శకుడు అదే తరహాలో ప్రారంభించారు. 

సినిమా బిగినింగ్ లోనే యువతి హత్య జరుగుతుంది. వేగంగా పరిణామాలు చాలా సీరియస్ గా మారుతాయి. హీరో ఎంట్రీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే విధానం చూస్తే ఇది కూడా రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అని అనిపిస్తుంది. హీరోకి అరవింద్ అనే పాత్రకి అనుమానం రావడం, అతడిని విచారణ చేసే క్రమంలో అసాధారణ విషయాలు వెలుగులోకి రావడంతో ఇది రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ కాదు.. వైవిధ్యమైన కథ కథనాలు ఉన్నాయి అనే ఆసక్తి పెరుగుతుంది. 

అరవింద్ పాత్ర ఎంట్రీతో కథలో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఆయా సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఇంటర్వెల్ వరకు ఈ హత్యలతో అరవింద్ కి సంబంధం ఉన్నట్లు అనుమానం కలిగించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ ఇంటర్వెల్ సన్నివేశంలో అసలైన థ్రిల్ పంచుతూ ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. ఇంటర్వెల్ సన్నివేశంతో హత్యల గురించి హీరో ఒక క్లారిటీకి వస్తాడు. ఆ సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఉత్కంఠ పెంచేలా ఉంటాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా ఉంటుంది. 

సెకండ్ హాఫ్ లో కూడా అదే టెంపో మైంటైన్ చేసి ఉంటే ఇది నెక్స్ట్ లెవల్ సినిమా. కానీ అలా జరగలేదు. సెకండ్ హాఫ్ బిగినింగ్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సాగదీత ఎక్కువవుతుంది. దీనికితోడు హీరో తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అరవింద్ పాత్రపై ఆధారపడడం ఆసక్తికరంగా ఉండదు. ఫస్ట్ హాఫ్ లో బలంగా నిలిచిన అరవింద్ పాత్ర సెకండ్ హాఫ్ లో మాత్రం మైనస్ గా మారింది అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఓవర్ గా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. హత్యలు చేసేది ఎవరు అనే ట్విస్ట్ ఆసక్తికరంగా రివీల్ అవుతుంది. కానీ దాని వెనుక ఉన్న కారణం బలంగా లేదు. 

46
నటీనటులు

థ్రిల్లర్, సస్పెన్స్ తరహా చిత్రాలు విజయ్ ఆంటోనికి కొత్త కాదు. కాబట్టి ఆయన ఈ చిత్రంలో నటించడం కేక్ వాక్ అనే చెప్పాలి. పోలీస్ అధికారి పాత్ర విజయ్ ఆంటోనికి టైలర్ మేడ్ రోల్ లా అనిపిస్తుంది. అయితే విజయ్ ఆంటోని పాత్రలో వేరియేషన్స్ లేకపోవడం మైనస్. సినిమా మొత్తం ఒకే తరహాలో ఆయన పాత్ర ఉంటుంది. 

అజయ్ దిషాన్ పోషించిన అరవింద్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ లో అంతలా తేలిపోయింది. కానీ అతడి పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆల్మోస్ట్ ఈ చిత్రానికి అతడు సెకండ్ హీరో అనే తరహాలో నటించాడు. పోలీస్ అధికారి పాత్రలో నటి బ్రిగిడ సాగా నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిథి మేరకు నటించారు. సముద్రఖని అతిథి పాత్రలో కాసేపు మెరిసి వెళ్ళిపోతారు. 

56
టెక్నికల్‌గా

థ్రిల్లర్ చిత్రాలకు కాన్సెప్ట్ ఒకే తరహాలో ఉంటుంది. కథనంలోనే వైవిధ్యం చూపించి ఆడియన్స్ కి థ్రిల్ అందించాలి. దర్శకుడు లియో జాన్ పాల్ ఆ విషయంలో ఫస్ట్ హాఫ్ లో సక్సెస్ అయ్యారు. తొలి సన్నివేశం నుంచే ఆసక్తిని పెంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందిస్తూ వెళ్లారు. ఇలా ఇంటర్వెల్ వరకు సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీయడం, క్లైమాక్స్ ని ముగించిన విధానం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. 

విజయ్ ఆంటోని హీరోగా ఆకట్టుకోగా, సంగీత దర్శకుడిగా కూడా తన పని చక్కగా నిర్వహించారు. కథకి అవసరమైన మంచి మ్యూజిక్ అందించారు. ఎస్ యువ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. కథకు అవసరమైన మేరకు కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ విలువలు ఉన్నాయి. 

66
ఫైనల్‌గా

మార్గన్ చిత్రం ఫస్టాఫ్ తో మంచి థ్రిల్ అందిస్తుంది. సెకండ్ హాఫ్ లో బలం తగ్గింది. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Read more Photos on
click me!

Recommended Stories