జగపతిబాబు, సౌందర్య గురించి ఇండస్ట్రీలో కూడా రూమర్స్ వచ్చాయి. వాటి గురించి జగపతిబాబు స్పందిస్తూ.. సౌందర్య నాకు క్లోజ్ ఫ్రెండ్. స్నేహం చేశాను కాబట్టి మా ఇద్దరి మధ్య పొగ పెట్టారు. దీంతో ఆ రూమర్స్ మంటలుగా మారి వ్యాపించాయి అని జగపతిబాబు అన్నారు. సౌందర్య చాలా సంప్రదాయ బద్ధమైన కుటుంబంలో పెరిగింది. అంత ఈజీగా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయదు. కానీ నాతో చేసింది.
వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా తమ ఇంట్లోకి నన్ను రానిచ్చేవారు. సౌందర్య సోదరుడు అమర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. వాళ్లంతా నాతో మాత్రమే ఎందుకు అంత చనువుగా ఉన్నారు? ఎందుకంటే నేను చెడ్డ వ్యక్తిని కాదు అనేది వాళ్ళ నమ్మకం. సౌందర్య చనిపోయినప్పుడు నేను మలేషియాలో ఉన్నాను. ఆమె చనిపోయిందని ఫోన్ రాగానే నేను వెంటనే అడిగిన ప్రశ్న అమర్ బ్రతికున్నాడా లేదా? అమర్ గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు అడిగాను అంటే అతడు కూడా నాకు ఫ్రెండ్.