`కన్నప్ప` మూవీ రివ్యూ, రేటింగ్‌.. మంచు విష్ణు, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, మోహన్‌బాబుల మూవీ సంచలనం సృష్టించిందా?

Published : Jun 27, 2025, 01:23 PM IST

మంచు విష్ణతోపాటు, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కన్నప్ప` మూవీ శుక్రవారం(జూన్‌ 27న) ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
`కన్నప్ప` మూవీ రివ్యూ

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ `కన్నప్ప`. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్‌ బాబు నటిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. శివుడి భక్తుడైన కన్నప్ప చరిత్ర నేపథ్యంలో ఫిక్షనల్‌ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, కాజల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందంతోపాటు శివబాలాజీ ముఖ్య పాత్రలు పోషించారు. 

ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్‌ 27న) విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? మంచు విష్ణు సక్సెస్‌ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`కన్నప్ప` మూవీ కథ ఏంటంటే?

కన్నప్ప చరిత్ర చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవుడిని నమ్మని తిన్నడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు, కన్నప్పగా ఎలా మారాడు? అనేదే ఈ కథ. ఉడుమూరులో(ప్రస్తుత శ్రీకాళహస్తి) 2వ శతాబ్దంలో జరిగే కథ ఇది. ఉడుమూరు అటవి ప్రాంతంలో ఐదు గూడేలు ఉంటాయి.

 అందులో ఒక గూడేనికి నాధనాధుడు(శరత్‌ కుమార్‌) దొర. ఆయన కొడుకే తిన్నడు(మంచు విష్ణు). చిన్నప్పుడు తన స్నేహితుడిని అమ్మోరుకి బలి ఇవ్వడంతో దేవుడి లేడు, అది ఒక బండరాయి అని ఫిక్స్ అవుతాడు. 

వీరు ఉండే ప్రాంతంలోనే వాయు లింగం ఉంటుంది. దాన్ని మహదేవ శాస్త్రి(మోహన్‌ బాబు) పూజలు చేస్తుంటాడు. ఆ వాయు లింగంపై కాళాముఖుడి(అర్పిత్‌ రంకా) కన్నుపడుతుంది. తన మనుషులను పంపిస్తాడు. వాళ్లు గూడెంలోని ఆడవారిని ఇబ్బంది పెట్టడంతో తిన్నడు వారిని చంపేస్తాడు. 

ఈ విషయం తెలిసి కాళాముఖుడు ఈ గూడేలపై దండెత్తి వస్తుంటాడు. తిన్నడిని చంపి వాయు లింగాన్ని ఎత్తుకెళ్లాలని ప్లాన్‌ చేస్తాడు. అతన్ని అడ్డుకునేందుకు ఐదు గూడాల సైనం ఏకం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవలు అవుతాయి.

 వారిలో ఒకడు తిన్నడు ప్రేమించిన నెమలి(ప్రీతి ముఖుందన్‌) ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. దీనితో అతనితో తిన్నడు గొడవ పడతాడు. అతన్ని కొట్టడంతో నాధనాధుడు తిన్నడిని గూడెం నుంచి వెలివేస్తాడు. అదే సమయంలో కాళాముఖుడు దాడి చేస్తాడు. 

దీంతో తిన్నడి తండ్రిని చంపేస్తాడు. మరి అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగుతాడు తిన్నడు. కాళాముఖుడిని ఎలా అంతం చేశాడు? దేవుడిని నమ్మని తిన్నడు శివ భక్తుడు ఎలా అయ్యాడు? 

ఇందులో రుద్ర(ప్రభాస్‌) ఏం చేశాడు? అర్జునుడు, కిరాత(మోహన్‌లాల్‌) మధ్య జరిగిన గొడవేంటి? అది ఈ కథకి లింకేంటి? ఇందులో మధుబాల, ముఖేష్‌ రుషి, శివబాలాజీ పాత్రలేంటి? అంతిమంగా కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా కథ.

36
`కన్నప్ప` మూవీ విశ్లేషణ

శ్రీకాళహస్తిలో వెలసిన శివుడు, కన్నప్ప గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కన్నప్ప శివభక్తుడిగా మారడమే ఈ కథ. అది ఎలా జరిగింది. ఎంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఇందులో ఆసక్తికర అంశం. తెలుగు సినిమాల్లో భక్తి నేపథ్యంలో చాలా వచ్చాయి. 

ఎన్టీఆర్‌ ఎన్నో సినిమాలు చేశారు. నాగార్జున `అన్నమయ్య`, `శ్రీరామదాసు` వంటి చిత్రాలు చేశారు. అలాగే ఇదే కథతో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు `భక్త కన్నప్ప` చిత్రాన్ని రూపొందించారు. ఇవన్నీ పెద్ద విజయం సాధించాయి. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన భక్తిరస చిత్రమే `కన్నప్ప`. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రమిది. 

ఇందులో బిగ్‌ కాస్ట్ నటించడంతో సినిమా రేంజ్‌ పెరిగింది. అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా అంటే అందుకుందనే చెప్పాలి. మంచు ఫ్యామిలీ సినిమా కావడంతో జనరల్‌ ఆడియెన్స్ ఒక అభిప్రాయంతో ఉంటారు.

 కానీ అలాంటి వారికిది సర్‌ప్రైజ్‌ అని చెప్పొచ్చు. ఊహించిన దానికంటే బాగా తీశారు. బాగా చేశారు. కథ, కథనాన్ని నడిపించిన తీరు, అందులో నటీనటులు నటించిన తీరు, ప్రతి పాత్రకి ఆర్టిస్ట్ లను సెట్‌ చేసిన తీరు బాగుంది. పర్‌ఫెక్ట్ గా కుదిరింది. 

కన్నప్ప కథ చెప్పడం నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. దేవుడిని నమ్మని తిన్నడు తనకు ఎలా భక్తుడు అయ్యాడనేది పార్వతి శివుడిని ప్రశ్నించడం, ఆయన ఈ కథని చెప్పడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. 

ఈ క్రమంలో గూడెంలో నెలకొన్న మూఢనమ్మకాలు, వాటిని తిన్నడు ఎదురించడం, శివలింగంని రాయిగా అనడం, ఈ క్రమంలో చోటుచేసుకునే అంశాలు డ్రామా ఆకట్టుకునేలా ఉన్నాయి.

46
`కన్నప్ప` మూవీ హైలైట్స్, మైనస్‌లు

ఫస్టాఫ్‌ మొత్తం గూడెంలో చోటు చేసుకునే డ్రామా, హీరోయిన్‌తో మంచు విష్ణు ప్రేమ, ఆయనకు తల్లి లేకపోవడంతో అమ్మకి తన బాధలు చెప్పుకోవడం, కాళాముఖుడుని ఎదురించేందుకు గూడెం ప్రజలంతా ఏకం కావడంతోపాటు అసలు తిన్నడు ఎవరు అని అక్షయ్‌ కుమార్‌ పార్వతి అయిన కాజల్‌కి వివరించడంతో సాగుతుంది. 

ఇంటర్వెల్‌ ట్విస్ట్ లో మోహన్‌లాల్‌ ఎంట్రీ, మంచు విష్ణుతో ఆయన తలపడే సీన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఫస్టాఫ్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. సెకండాఫ్‌లో యుద్ధం, ఆ తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ తిన్నడిలో ఆయన తెచ్చే మార్పుతో సాగుతుంది. 

అయితే ఫస్టాఫ్‌లో సినిమా కాస్త లాగ్‌ అనిపిస్తుంది. కొంత స్లోగా సాగుతుంది. ప్రేమ, గూడెంలో మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతుంది. ఆ డ్రామా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. అయితే హీరోయిన్‌ తో విష్ణు రొమాంటిక్‌ సీన్లు యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. 

అదే సమయంలో కొంత ఓవర్‌గానూ అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌లో ప్రభాస్‌ ఎంట్రీతో సినిమా వేలే లెవల్‌కి వెళ్తుంది. శివుడి గురించి తెలిపే సన్నివేశాలు వాహ్‌ అనిపిస్తాయి. క్లైమాక్స్ మరింత పీక్‌లోకి వెళ్తుంది. 

సెకండాఫ్‌లో గంటసేపు అసలు సినిమా అని చెప్పొచ్చు. ఆయా సీన్లు భక్తితోపాటు ఎమోషనల్‌గా ఉంటాయి. ఆద్యంతం హృదయాన్ని బరువెక్కించేలా ఉంటాయి. ఆద్యంతం రక్తికట్టించాయి. క్లైమాక్స్ లో మంచు విష్ణు సీన్లు, మోహన్‌ బాబు సీన్లు పీక్‌లోకి తీసుకెళ్తాయి.

 అదే సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. దీనికితోడు విజువల్స్, మ్యూజిక్‌ ఇందులో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా చెప్పొచ్చు. ఊహించిన దానికంటే బాగా ఉంది. బాగా తీశారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

56
`కన్నప్ప` చిత్రంలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్

తిన్నడుగా మంచు విష్ణు అదరగొట్టాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ మూవీ మరో ఎత్తు. ఈ చిత్రంతో విష్ణు నటుడిగా నిరూపించుకున్నాడు. ఎక్కడా ఓవర్‌ డ్రామా చేయకుండా బాగా చేయించాడు. 

క్లైమాక్స్ లో వేరే లెవల్‌ లో యాక్ట్ చేశాడు. జనాల్లో ఈ మూవీతో నటుడిగా విష్ణుపై ఉన్న ఇంప్రెస్‌ అంతా పోయి పాజిటివ్‌గా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాత్ర కోసం, సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. 

ఇక రుద్రగా కాసేపు కనిపించి వాహ్‌ అనిపించాడు ప్రభాస్‌. కనిపించింది కాసేపే అయినా అదరగొట్టాడు. ఫ్యాన్స్ ని అలరించేలా ఆయన పాత్ర ఉంటుంది. ఇక శివుడిగా అక్షయ్‌ కుమార్‌ మెప్పించారు. పార్వతిగా కాజల్‌ జస్ట్ ఓకే అనిపించింది.

 కిరాత పాత్రలో మోహన్‌లాల్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇవన్నీ సినిమాల్లో సర్‌ప్రైజింగ్‌ రోల్స్. ఇక మహాదేవ శాస్త్రిగా మోహన్‌లాల్‌ అదరగొట్టాడు. చివర్లో ఆయన కూడా రెచ్చిపోయాడు. బ్రహ్మానందం, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. 

నాధనాధుడిగా శరత్‌ కుమార్‌ బాగా చేశాడు. పన్నాగా పాత్రలో మధుబాల సైతం మెప్పించింది. నెమలి పాత్రలో ప్రీతి ముఖుందన్‌ అందంతో మాయ చేసింది. ఆమె యూత్‌కి ట్రీట్‌. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు.

66
`కన్నప్ప` చిత్రంలో టెక్నీషియన్ల పనితీరు

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. స్టీఫెన్‌ దేవస్యా మ్యూజిక్‌ అదిరిపోయింది. పాటలు అదిరిపోయాయి. బయట విన్నదానికంటే సినిమాలో బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. అలరించాయి. షెల్డెన్‌ చౌ కెమెరా వర్క్ అదిరిపోయింది. 

విజువల్స్ ట్రీట్‌లాగా ఉన్నాయి. న్యూజిలాండ్‌ లో తీసిన సీన్లు మతిపోయేలా ఉన్నాయి. సినిమాకి విజువల్స్ హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు. ఈమూవీకి మ్యూజిక్‌, విజువల్స్ మెయిన్‌ పిల్లర్స్ గా చెప్పొచ్చు.

 ఇక ఆంథోని ఎడిటింగ్‌ కాస్త షార్ప్ చేయాల్సింది. ఫస్టాఫ్‌లో కొంత ట్రిమ్‌ చేస్తే బాగుండేది. ఇక మాటలు, కథనం కూడా చాలా బాగా ఉంది. దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ టేకింగ్‌ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. 

డైరెక్షన్‌ సినిమాకి మరో పిల్లర్‌. ఈ మూవీ ఎలా ఉంటుందో? ఎలా తీస్తారో అనే కొంత అనుమానాలు జనంలో ఉన్నాయి. కానీ వాటిని పటాపంచల్‌ చేసింది డైరెక్షన్‌. ఫస్ట్ నుంచి చివరి వరకు డైరెక్షన్ పరంగా బాగా డీల్‌ చేశారు. 

ముఖ్యంగా సెకండాఫ్‌ని అందులోనూ చివరి గంటను తీసిన తీరు అదిరిపోయింది. అదే సినిమాకి ప్రాణంగా నిలిచింది. సినిమా ఓవరాల్‌గా అందరు చూడదగ్గ మూవీ.

ఫైనల్‌గాః భావోద్వేగ భక్తిరస చిత్రం `కన్నప్ప`.

రేటింగ్‌ః 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories