Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?

Published : Feb 06, 2026, 07:10 PM IST

Sri Chidambaram Garu Review: వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట జంటగా నటించిన మూవీ `శ్రీ చిదంబరం గారు`. వినయ్‌ రత్నం రూపొందించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందంటే?

PREV
16
శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ

ఇప్పుడు భారీ యాక్షన్‌ సినిమాలతోపాటు రూటెడ్‌ లెవల్లో ఉన్న మంచి స్వచ్ఛమైన పల్లె ప్రేమ కథలు వస్తున్నాయి. హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన చిత్రం `శ్రీ చిదంబరం గారు` మూవీ. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట జంటగా నటించారు. వినయ్‌ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వినితా రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చింతా రాజశేఖర్‌ రెడ్డి సహ నిర్మాత. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 6)న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
శ్రీ చిదంబరం గారు మూవీ కథ

సోల్మన్‌ అలియాస్‌ చిదంబరం(వంశీ తుమ్మల) తాపీ మేస్ట్రీ పని చేస్తుంటాడు. తనకు మెల్ల కన్ను ఉండటంతో చిన్నప్పట్నుంచి ఊర్లో అవమానిస్తారు. మెల్ల కన్ను లోపం అని, అరిష్టం అని, నానా రకాలుగా తిడతారు. స్కూల్‌లో స్టూడెంట్స్ తోపాటు, టీచర్‌ కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది. దీంతో మనసులో కుంగిపోతుంటాడు. అభద్రతాభావానికి లోనవుతుంటాడు. తన లోపం బయటకు కనిపించకూడదని, నల్ల అద్దాలు పెట్టుకొని మ్యానేజ్‌ చేస్తుంటాడు. బిక్కు బిక్కుమంటూ మేస్త్రీ పనిచేసుకుంటూ బతుకుతుంటాడు. అదే ఊర్లో లీలా(సంధ్య వశిష్ట) చిదంబరంని ఇష్టపడుతుంది. కాకపోతే ఆ విషయం చిదంబరంకి చెప్పదు. లీలా చెల్లి కోరిక మేరకు ఇంట్లో బాత్‌ రూమ్‌ కట్టించాలనుకుంటారు. మేస్త్రీకి చెప్పగా, బాత్‌ రూమ్‌ కట్టడానికి చిదంబరంని పంపిస్తాడు. ఆ సమయంలో లీలా, చిదంబరం మనసులు కలుస్తాయి. తనని లీలా ఇష్టపడుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలోనే ఊర్లో అవారాగా తిరిగే సురేష్‌ కూడా లీలాపై మనసు పడతాడు. పెళ్లి సంబంధాలకు కూడా వెళ్తాడు. కానీ లీలా అమ్మ నో చెబుతుంది. ఇక లీలాకి పెళ్లి చేయబోతున్నారని, వెయిట్‌ చేస్తే లీలా తనకు దూరం అవుతుందని భావించిన చిదంబరం తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. అయితే నిన్ను నువ్వు ప్రేమించుకోలేనివాడివి, నీపై నీకు నమ్మకం లేనిది నన్ను ఎలా ప్రేమిస్తావు, నాతో ఎలా సంతోషంగా ఉంటావని ప్రశ్నిస్తుంది. చిదంబరం నోరు జారడంతో చెంపదెబ్బ కొడుతుంది. నల్ల అద్దాలు తీసి ప్రపంచాన్ని చూడు అని చెబుతుంది. తను కూడా తన లోపాన్ని ఎత్తిచూపుతుందని భావించిన చిదంబరం బాధపడతాడు. కుమిలిపోతాడు. లీలాని దూరం పెడతాడు. తన మెల్ల కన్ను లేకుండా చేసుకోవాలని భావిస్తాడు. అందుకోసం లక్ష రూపాయలు అప్పు చేసి ఫాస్టర్‌కి ఇస్తాడు. మరి తన మెల్లకన్ను సెట్‌ అయ్యిందా? రాజమండ్రికి వెళ్లాక చిదంబరంలో వచ్చిన మార్పేంటి? తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.? లీలా తండ్రి ఎందుకు పిచ్చివాడిగా మారిపోయాడు? అతనికి చిదంబరం తండ్రికి ఉన్న సంబంధమేంటి? చివరికి చిదంబరం, లీలా ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన కథ.

36
శ్రీ చిదంబరం గారు మూవీ విశ్లేషణ

విలేజ్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథలకు ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. ఆడియెన్స్ కూడా ఇలాంటి స్వచ్ఛమైన లవ్‌ స్టోరీస్‌ని ఇష్టపడుతున్నారు. ప్రేమలో కొత్తదనాన్ని, ఒక ఫ్రెష్‌ ఫీల్‌ని అందిస్తూ, ఎంగేజ్‌ చేసేలా మూవీ ఉంటే చాలు ఆడియెన్స్ హిట్‌ చేస్తున్నారు. అలాంటి మరో ప్రయత్నమే `శ్రీ చిదంబరం గారు` మూవీ. అయితే ఆకట్టుకునేలా సక్సెస్‌ అయ్యిందా అంటే చాలా వరకు అవుననే చెప్పాలి. ఒక ఫ్రెష్‌ లవ్‌ స్టోరీని, ఫ్రెష్‌గా అందించడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. సినిమా చాలా రూటెడ్‌గా ఉంది. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేవు. చాలా నీట్‌గా, క్లీన్‌గా రూపొందించారు. పల్లెతనాన్ని, పల్లెల్లో ఉండే చిన్న చిన్న ఆనందాలను, చిన్న చిన్న ఎమోషన్స్ ని కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించారు. సినిమా చూస్తున్నంతసేపు ఆ విలేజ్‌లో ఉన్నట్టుగానే ఉంది. దర్శకుడు కొత్తవాడైనా అంత బాగా కనెక్ట్ చేయడం  హైలైట్‌గా చెప్పొచ్చు. అయితే మూవీ కొంత స్లోగా సాగుతుంది. 

సినిమాగా చూసినప్పుడు హీరో తన కళ్ల జోడు స్టోరీ చెబుతూ బ్యాక్‌ వెళ్తాడు. విలేజ్‌లో తన నాన్న అప్పు చేసి ఫ్రెండ్‌ అన్న మాటలకు ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో తన మెల్ల కన్నువల్ల చాలా మంది అవమానిస్తుండటంతో లోలోపల కుమిలిపోతుంటాడు. తన వైకల్యాన్ని ఎలా కవర్‌ చేసుకోవాలో తెలియక, అందరి ముందు తలెత్తుకోలేక ఇబ్బంది పడతాడు. ఆ సంఘర్షణతో కూడిన సన్నివేశాలు ఎంగేజింగ్‌గా సాగుతాయి. అవి దాని తీవ్రతని ఆవిష్కరిస్తాయి. ఆ తర్వాత లీలా.. చిదంబరంని ఇష్టపడటం, ఆ విషయాన్ని చెప్పకుండా పరోక్షంగా హింట్‌ ఇవ్వడం, వన్‌ సైడ్‌ లవ్‌ ట్రాక్‌ ఇవన్నీ చాలా కొత్తగా, ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో తన ప్రేమని లీలాకి చెప్పడం, ఆమె తనని తాను ప్రేమించాలని చెప్పడం, దీనికితోడు ఊర్లో కుర్రాళ్లు పదే పదే అవమానించడంతో మళ్లీ అవమానంగా ఫీలవుతుంటాడు. తన మెల్లకన్ను లేకుండా చేసుకోవాలనుకోవడం, ఆవేశంలో తప్పు నిర్ణయాలు తీసుకోవడం ఎంగేజింగ్‌గా సాగుతాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. అంగవైకల్య లోపం అనేది మనిషి లోపం కాదని, మనసు ముఖ్యమని చెప్పే సందేశం బాగుంది. భావోద్వేగానికి గురి చేస్తుంది. సినిమా చిన్ని చిన్న ఎమోషన్స్ తో, చిన్న చిన్న ఫన్‌ ఎలిమెంట్లతో సాగుతుంది. లవ్‌ ట్రాక్‌కి, అందులోనూ రియాలికిటీకి దగ్గరగా ఆ ప్రేమని చూపించిన తీరు బాగుంది.

46
శ్రీ చిదంబరం గారు మూవీలో ప్లస్‌, మైనస్‌లు

ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ, దాన్ని అంతే ఫ్రెష్‌గా, ఫ్రెష్‌ లొకేషన్లలో రూపొందించిన తీరు బాగుంది. హీరోహీరోయిన్లు కొత్తవాళ్లు కావడం కూడా ఆ కొత్తదనాన్ని మరింత పెంచింది. లవ్‌ ట్రాక్‌, మధ్య మధ్యలో ఫన్నీ సీన్లు  అలరిస్తాయి. ఆహ్లాదానికి గురిచేస్తాయి. హీరో పాత్రలోని సంఘర్షణ సైతం మెప్పిస్తుంది. అతనిలోని స్ట్రగుల్స్, ప్రేమని వ్యక్తం చేసుకున్నాక హీరోలో మార్పు కోసం హీరోయిన్‌ చేసే ప్రయత్నం బాగుంది. ముగింపులో సందేశం కూడా ఆకట్టుకుంది. స్క్రీన్‌ ప్లే మలుపులు ఎంగేజ్‌ చేసేలా ఉన్నాయి. విజువల్స్, సంగీతం సినిమాకి పెద్ద హైలైట్‌గా చెప్పొచ్చు.

కానీ సినిమాలో చాలా వరకు స్లోగా సాగుతుంది. ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. లవ్‌ సీన్లు, బాత్‌ రూమ్‌ కట్టే సీన్లు మరీ సాగదీశారు. ఊర్లో కుర్రాళ్లు ఆటపట్టించే సీన్లు ఆ స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఇక సెకండాఫ్‌లో హీరో పడే సంఘర్షణ కొంత వరకు బాగానే ఉన్నా, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారనే క్లారిటీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలిగింది. చివర్లో మరో జంటతో పోలిక కూడా సెట్‌ కాలేదు. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే మూవీ ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పొచ్చు.

56
శ్రీ చిదంబరం గారు మూవీలో నటీనటులు ఎలా నటించారంటే?

చిదంబరం పాత్రలో వంశీ తుమ్మల బాగా చేశాడు. మెల్లకన్ను ఉన్న కుర్రాడిగా, ఇన్‌సెక్యూరిటీతో బాధపడే కుర్రాడిగా బాగా ఒదిగిపోయాడు. నటనతో అదరగొట్టాడు. రియల్‌ పర్సన్‌ని చూస్తున్నట్టుగానే ఉంది. ఆ ఊర్లో నిజమైన జీవితాన్ని చూసిన ఫీలింగ్‌ తెప్పించాడు. ఇక లీలా పాత్రలో సంధ్య వశిష్ట కూడా చాలా కొత్తగా నేచురల్‌గా ఉంది. చాలా బాగా చేసింది. ఈ సినిమాకి ఈ ఇద్దరి పాత్రలే మెయిన్‌ పిల్లర్స్ గా చెప్పొచ్చు. చిదంబరం తల్లిగా కల్పలతా ఒదిగిపోయింది. నేచురల్‌గా చేసి మెప్పించింది. తులసి పాత్ర సైతం కట్టిపడేస్తుంది. చిదంబరం ఫ్రెండ్‌గా చేసిన కుర్రాడు సైతం మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

66
శ్రీ చిదంబరం గారు మూవీలో టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి చందు రవి మ్యూజిక్‌ అందించారు. మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌ సినిమాకి బ్యాక్‌ బోన్‌గా చెప్పొచ్చు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. రామ్‌ పోడిశెట్టి కెమెరా వర్క్ బాగుంది. పచ్చని పల్లెటూరి అందాలను అంతే బాగా చూపించాడు. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా బాగా చేశారు. దర్శకుడు వినయ్‌ రత్నం ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే ఫ్రెష్‌గా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే ఎమోషన్స్ ని, ప్రేమని లైటర్‌వేలో చూపించారు. ఇంకా బలంగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. ఫన్‌ డోస్‌ పెంచితే బాగుండేది. క్లైమాక్స్ ని కూడా ఇంకా బాగా ఎమోషనల్‌గా, మరింత సంఘర్షణతో చూపిస్తే బాగుండేది. కాకపోతే ఒక ఫ్రెష్‌ లవ్‌ స్టోరీని అందించడంలో సక్సెస్‌ అయ్యారు. అంగవైకల్యం ఉండటం తప్పు కాదు, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకుండా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, మనల్ని మనం ప్రేమించుకోవాలని చెప్పిన సందేశం బాగుంది. 

ఫైనల్‌గా: 

`శ్రీచిదంబరం గారు` మూవీ అంగవైకల్యానికి సంబంధించి ఒక కనువిప్పు కలిగించే ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories