OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్

Published : Dec 11, 2025, 11:16 AM IST

OTT: ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. స‌రికొత్త కంటెంట్‌కు జై కొడుతున్నారు. అందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థ‌లు అదిరిపోయే వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కులు ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 

PREV
15
ఆహాలో థ్రిల్ల‌ర్

ఓటీటీలో వినూత్న కథలకు ప్రేక్షకుల డిమాండ్ పెరుగుతోంది. థియేటర్లలో భారీ సినిమాలు హిట్ అవుతున్నా, డిజిటల్ ప్లాట్ ఫాంలలో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే సిరీస్‌లకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ క్రమంలో ఆహా తాజా థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

25
ఆహా నుంచి మైండ్‌-బెండింగ్ క్రైమ్ డ్రామా

తెలుగు డిజిటల్ మార్కెట్లో నిరంతరంగా వైవిధ్యమైన కంటెంట్ ఇస్తున్న ఆహా మరో క్రైమ్ థ్రిల్లర్‌ను విడుదల చేసింది. ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది. మొత్తం 50 ఎపిసోడ్లతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో అశ్విన్, శ్రీతు, పదని కుమార్, ప్రీతి శర్మ, గురు కీలక పాత్రలు పోషించారు. జెస్విని ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

35
రెండు భాషల్లో

డిసెంబర్ 5 నుంచి ఈ సిరీస్ ఆహా ప్లాట్ ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ప్రతి వారం శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా వీక్షించేందుకు వీలుంది.

45
ఒకే రాత్రిలో మూడు హత్యలు…

ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి వరుసగా మూడు హత్యలు జరగడంతో కథ మొదలవుతుంది. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఇద్దరు ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ అధికారులు ఎలా దర్యాప్తు చేస్తారన్నది కథలో ప్రధాన భాగం. ఏసీపీ అశ్విన్ సూచనలతో నడిచే దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంది, నిందితులను పట్టుకున్నారా లేదా అనేదే సిరీస్ సస్పెన్స్.

55
ట్విస్టులు, ఉత్కంఠ

ఈ థ్రిల్లర్‌లో ప్రతి ఎపిసోడ్ కొత్త ట్విస్టును అందిస్తూ ముందుకు సాగుతుంది. దర్యాప్తు శైలి, పాత్రల మధ్య ఉద్రిక్తత, సంఘటనలు అనూహ్యంగా మారడం ప్రేక్షకులను నిరంతరం ఆకట్టుకుంటున్నాయి. కేసుల చుట్టూ తిరిగే కథనం సిరీస్‌ను పూర్తిగా థ్రిల్లింగ్ అనుభవంగా మార్చింది. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా న‌చ్చుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories