
కొన్ని సినిమాలు చరిత్రలో ఎప్పటికీ అలా నిలిచి ఉంటాయి. అలాంటి వాటిలో దసరా బుల్లోడు సినిమా కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రకళ ప్రధాన పాత్రలుగా నటించి, వి.బీ రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ఇది. హీరో జగపతి బాబు తండ్రి వి.బీ రాజేంద్రప్రసాద్. ఆయన అక్కినేని నాగేశ్వరావుతో ఎన్నో సినిమాలు నిర్మించారు. కానీ దసరా బుల్లోడు సినిమాతో ఆయన మొదటి సారి దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిజానికి దసరా బుల్లోడు సినిమా కథను వి.బీ రాజేంద్రప్రసాద్ రాసుకున్న తరువాత దర్శకుడి కోసం వెతికారట. వి.బీ రాజేంద్రప్రసాద్ నిర్మాణ సంస్థకు ఆస్థాన దర్శకుడు విక్టరీ మధుసూధన రావు. ఆయన డైరెక్షన్ లోనే ఈసినిమా చేయాలి అనుకున్నారు. కానీ ఆయన అప్పటికే బిజీగా ఉండటంతో.. ఆదుర్తి సుబ్బారావును అడిగారు. ఆయన కూడా చేయకపోవడంతో.. వి.బీ రాజేంద్రప్రసాద్ మీరే డైరెక్ట్ చేయండి అని అక్కినేని నాగేశ్వరరావును అడిగారట. అప్పుడు ఆయన మీరే ఎందుకు చేయకూడదు.. అని వి.బీ రాజేంద్రప్రసాద్ ను అడిగారట. కథ మీరే రాశారు కాబట్టి.. మీరు డైరెక్ట్ చేస్తేనే బాగుంటుంది అని ఏఎన్నార్ అనడంతో వి.బీ రాజేంద్రప్రసాద్ సినిమాను డైరెక్ట్ చేసి.. మొదటి సినిమా దసరా బుల్లోడు తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఈసినిమా ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఎంతో చాలాకీగా తిరిగే కుర్రాడు గోపి( అక్కినేని నాగేశ్వరావు). గోపిని అతని అన్నయ్య వాసు(గుమ్మడి) వదిన యశోధ(అంజలీదేవి) ఎంతో ప్రేమగా పెంచుతారు. వారి పెద్దన్న భూషయ్య(ఎస్వీ రంగారావు) చాలా నిజాయితీపరుడు కానీ అతని భార్య బుల్లెమ్మ( సూర్యాకాంతం) మాత్రంమోసాలు చేస్తూ... అందరిని దూరం చేస్తుంటుంది. దాంతో గోపీకూడా వాసు దగ్గరే పెరుగుతాడు. బుల్లెమ్మ సోదరుడు బుల్లయ్య( నాగభూషనం) ఈ కథకు విలన్ గా తయారవుతాడు. , గోపిని తన కూతురు నిర్మల( చంద్రకళ) కు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. నిర్మాల కూడా గోపీని ప్రేమిస్తుంటుంది. బుల్లయ్య కూతురు అయినా.. ఆమె చాలా మంచిది. అయితే మరో వైపు గోపీ మాత్రం రాధ( వాణిశ్రీ) ప్రేమలోపడతాడు. కథ కొనసాగుతుండగానే.. నిర్మాలకు క్యాన్సర్ అని తెలుస్తుంది. వెంటనే నిర్మాల ఈ విషయం వారికి తెలియకుండా దాచి. గోపీని,రాధను ఎలాగైనా కలపాలని ప్రయత్నిస్తుంది. తన ప్రేమను త్యాగం చేయడానికి రెడీ అవుతుంది.
నిర్మల అనారోగ్యం గురించి, గోపి పట్ల ఆమెకున్న ప్రేమ గురించి తెలిసిన బుల్లయ్య, ఆమె ప్రేమను గెలిపించాలని అనుకుంటాడు. గోపితో నిర్మల వివాహాన్ని త్వరగా చేయాలని పట్టుబడతాడు. అదే సమయంలో, గోపిని, రాధను విడదీయడానికి కుట్రపన్ని..అందులో భాగంగా. గోపికి, వాసుకు మధ్య వివాదం సృష్టించి, వారి నుంచి గోపిని విడదీస్తాడు. అంతే కాదు గోపీ నుండి దూరంగా ఉంచమని రాధను బెదిరిస్తాడు. నిర్మల పరిస్థితిని అర్థం చేసుకున్న రాధ, అయిష్టంగానే గోపీకి దూరం అవుతూ వస్తుంది. గోపిని నిర్మలను పెళ్లి చేసుకోమని ఓప్పిస్తుంది కూడా.
వివాహ సన్నాహాలు జరుగుతుండగా, వాసు రాధను గోపి సన్నిహితుడైన బోడి బాబు(పద్మనాభం)తో వివాహం చేయించడానికి ఏర్పాట్లు చేస్తాడు. పెళ్లి రోజున, బోడి బాబు గోపి రాధలను తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తాడు, కానీ బుల్లయ్య మధ్యలో కల్పించుకుని.. గోపి రాధల పెళ్లి జరగకుండా అడ్డుకుంటాడు. ఆతరువాత జరిగిన పరిణామాల మధ్య గోపీ రాధ ఒక్కటవుతారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల..ప్రశాంతంగా కన్నుమూస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులక క్లైమాక్స్ సీన్ కంటతడిపెట్టిస్తుంది. మనసు బరువెక్కేలా చేస్తుంది.
దసరా బుల్లోడు సినిమా చూస్తే ఎలా ఉంటుందంటే.. ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంటుంది. నవరసాలు కలగలిపిన కథ, స్క్రీన్ ప్లే దసరా బుల్లోడు సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళాయి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా అప్పట్లోనే ఏఎన్నార్ స్టైలిష్ లుక్స్, వాణీశ్రీ, గడుసుదనపు అభినయం.. చంద్రకళల అమాయకత్వం, గుమ్మడి-యస్ వి రంగా రావుల హుందాతనం, సూర్యకాంతం గయ్యాళి తనం తో సినిమాకు కావల్సిన నవరసాలు పండాయి. దానికితోడు కుటుంబ కథ.. కలహాలు, అపార్ధాలు, అనర్ధాలతో కూడి ఉంటుంది సినిమా. దసరాబుల్లోడు సినిమా మొత్తం ఎంత సరదాగా సాగుతుందో అంత ట్రాజడీతో కన్నీరు పెట్టిస్తుంది. సినిమా ఓపెనింగ్ అంతా అక్కినేని నాగేశ్వరరావు కుర్రతనంతో చేసే చిలిపి పనులు, హీరోయిన్లతో డ్యూయోట్లు, సరసాలు.. అలా సాగుతుంది. ఆతరువాత సినిమా అంతా చాలా సీరియస్ గా తీసుకెళ్ళాడు దర్శకుడు. నాగభూషణం విలనిజం, దానికితోడు సూర్యాకాతం గయ్యాళితనం ఆడ్ అవ్వడంతో.. సినిమా అంతా ఎమోషనల్ వేవ్ లోకి వెళ్తుంది.. సినిమా చూసే ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టేలా స్క్రీన్ ప్లేను, డైలాగులను అద్బుతంగా రాసుకున్నారు దర్శకుడు. ఇక చివరకు సెకండ్ హీరోయిన్ అయిన నిర్మాల మరణం తో గుండెలు బరువెక్కేలా చేశారు. అందుకే ఈసినిమా అప్పట్లో ఓ రేంజ్ లో ఆడింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దసరా బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా ముందు అనుకున్నది జయలలితను. ఆమెను తీసుకోవాలని అనుకున్నారు... జయలలితకు కూడా కథ నచ్చింది. సినిమా చేస్తాను అని చెప్పారు. కానీ అప్పుడే ఆమె తెలుగులో ఎన్టీఆర్ తో, తమిళంలో ఎమ్జీఆర్ తో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దాంతో ఈసినిమాకు డేట్లు అజెస్ట్ చేయలేకపోయిందట. షూటింగ్ ఇంకా వారంరోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా.. ఏఎన్నార్ 'దసరా బుల్లోడు' సినిమా నుంచి జయలలిత తప్పుకుంటున్నట్టు సమాచారం. కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారట నిర్మాతలు. అయితే ఈసినిమా చేసేప్పటికి వాణిశ్రీ పెద్ద హీరోయిన్ ఏమీ కాదు. కానీ అప్పటికప్పుడు తీసుకోవడంతో.. ఆమెకు 25 వేలు ఇవ్వాల్సింది.. ఏకంగా 50 వేల రెమ్యునరేషన్ ఇచ్చారట నిర్మాత.
దసరా బుల్లోడు సినిమాతో ఏఎన్నార్, వాణిశ్రీ జంట బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. వారి కాంబోకు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఈసినిమాలో ఏఎన్నార్ డ్యూయోట్లు.. వాణిశ్రీతో అప్పట్లోనే ఆన్ స్క్రీన్ రొమాన్న్ అదరగొట్టాడు అక్కినేని. అంతే కాదు పల్లెటూరి పుల్లవిరుపు మాటలు, వాణిశ్రీతో మోటు సరసాలు కూడా అప్పటి ఆడియన్స్ కు కొత్తగా అనిపించాయి. తెలుగు సినిమాకు స్టెప్పులు నేర్పిన ఏఎన్నార్.. రొమాంటిక్ సీన్లలో కూడా కింగ్ గా నిలిచాడు. ఇక ఓ ఇంటర్వ్యూలో వాణిశ్రీ కూడా ఏఎన్నార్ మాటల గురించి సరదాగా చెప్పుకొచ్చారు. హీరోయిన్లతో ఆయన ఎంత సరదాగా ఉంటారు. ఎలా కామెంట్ చేస్తారు, అనేది వాణిశ్రీ చెప్పారు. ఇక దసరా బుల్లోడు సినిమా తరువాత ఏఎన్నార్, వాణిశ్రీ కాంబోలో ప్రేమనగర్ లాంటి ఎన్నో బ్లక్ బస్టర్ హిట్స్ రావడానికి పునాది వేసింది దసరా బుల్లోడు సినిమానే. అంతే కాదు.. ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లోనే దాదాపు 20 సినిమాలకు పైగా తెరకెక్కాయి.
అప్పట్లో హీరా లాల్ డ్యాన్స్ మాస్టారుగా పచ్చగడ్డి కోసేటి... సాంగ్ షూటింగ్ చేశారు. మచిలీ పట్నం దగ్గరలోని ఓ పల్లెటూరిలో షూటింగ్ స్టార్ట్ చేశారు. భారీ సంఖ్యలో డ్యాన్సర్లు, వారికి కావల్సిన ఏర్పాట్లను చాలా డబ్బుఖర్చు చేసి నిర్మాత ఆ ఊరిలో పెద్ద పండగలా షూటింగ్ చేశారు. 12 రోజుల పాటు షూటింగయ్యాక.. చెన్నై వెళ్ళి చూస్తే.. దీ కెమేరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు. దీంతో చేసేది లేక మళ్లీ.. ఆ ఆర్టిస్ట్ ల డేట్స్ తీసుకుని.. నిర్మాత మళ్ళీ ఆ 12 రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది. ఇక 'దసరా బుల్లోడు' పాటలు ఓ సంచలనమనే చెప్పాలి. నవరసాలు పంట పండించిన దసరాబుల్లోడు సినిమాకు అతి ముఖ్యమైన ఆకర్షణ పాటలు. అక్కినేని వేసిన స్టెప్స్ అయితే అప్పటు యువతకు పూనకాలు తెప్పించింది. ఇక ఈ పాటులు దాదాపు 30 ఏళ్లు ప్రతి తెలుగువారి నోట మారుమోగిపోయాయి. ఏ ప్రోగ్రామ్స్ లో విన్నీ ఇవే పాటలు, పెళ్ళిల్లలో కూడా దరసరా బుల్లోడు పాటలు హోరెత్తిచేవి. మహదేవన్ ట్యూన్స్ కు.. ఘంటసాల మాస్టారు, సుశీల లాంటి అద్భుత గాత్రాలు ప్రాణం పోశాయి. 'పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా...', 'ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ...', ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...', 'నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...' ఇలా పాటలన్నీ బంపర్ హిట్.
దసరా బుల్లోడు సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి 4 వారాలకే 25 లక్షల గ్రాస్ ను వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే అప్పటి వరకూ కనీవినీ ఎరుగని రికార్డు కూడా సాధించింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈస్ట్ మన్ కలర్ లో తొలిసారిగా స్వర్ణోత్సవం జరుపుకున్న చిత్రం గా , ఈస్ట్ మన్ కలర్ లో తొలి రజతోత్సవ చిత్రం గా , ఈస్ట్ మన్ కలర్లో తొలి ద్విశతదినోత్సవ చిత్రం గా దసరా బుల్లోడు నిలిచింది. అంతే కాదు , తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈస్ట్ మన్ కలర్ లో 254 రోజులు ఆడియన సినిమాగా ‘దసరా బుల్లోడు’ నిలిచింది. 30 థియేటర్లలో విడుదలైన ఈసినిమా 29 థియేటర్లలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. 21 థియేటర్లలో డైరెక్టుగా, కర్నూల్లో షిఫ్ట్ మీద శతదినోత్సవం జరుపుకుంది. ఈ జనరేషన్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉండే దసరా బుల్లోడు సినిమాను చూడాలి అనుకునే ఆడియన్స్ కు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది మూవీ.