బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్

Published : Nov 30, 2025, 12:00 PM IST

Actress Hema: నటి హేమ రీసెంట్ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకోవడంపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
15
నటి హేమ వ్యాఖ్యలు 

నటి హేమ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దశాబ్దాలుగా రాణిస్తున్నారు. అత్త, తల్లి, వదిన తరహా పాత్రలతో బాగా ఫేమస్ అయ్యారు. అయితే గతేడాది హేమ రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకున్నారు. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ సంఘటన పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. హేమ అరెస్ట్ కూడా అయ్యారు. బెయిల్ పై విదలయ్యాక హేమ సినిమాలు బాగా తగ్గించారు. ఇప్పుడిప్పుడే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. 

25
ట్రోలింగ్ పై హేమ కామెంట్స్ 

తనపై తరచుగా ట్రోలింగ్ జరుగుతుండడం, ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుండడంపై హేమ రీసెంట్ ఇంటర్వ్యూలో స్పందించారు. హేమ మాట్లాడుతూ నేను ఎక్కడికైనా బయటకి వెళితే హేమ ఈ కారులో వచ్చింది, గుడికి వెళితే హేమ ఈ లెటర్ రికమండేషన్ తో వచ్చింది అని ట్రోల్ చేస్తుంటారు. నన్ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఫ్యామిలీతో గుడికి వెళ్ళాలి అంటే రికమండేషన్ అవసరం అవుతోంది. అది గుర్తుంచుకోవాలి. 

35
అది బాలయ్యకి మాత్రమే సాధ్యం 

నిజమే నేను బాలయ్య బాబు దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకుని తిరుమలకు వెళ్ళాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా అమ్మని తిరుమలకు తీసుకుని వెళ్లడం కోసం బాలయ్యని రికమండేషన్ లెటర్ రిక్వస్ట్ చేశాను. నీకు తెలిసిన వాళ్ళు మీరే బాబు.. మీకు మాత్రమే అది సాధ్యం అవుతుంది అని అడిగాను. దీనితో బాలయ్య బాబు నాకు లెటర్ ఇచ్చారు. దానికి హేమ ఎమ్మెల్యే కారులో వచ్చింది, ఎంపీ కారులో వచ్చింది అంటూ ట్రోల్ చేశారు. నేను ఎంతో కొంత గుర్తింపు ఉన్న సెలెబ్రిటీని.. జనాలు నా దగ్గరకు కూడా వస్తారు. 

45
45 ఏళ్ళ వయసులో అది సహజం 

జనాలు నా దగ్గరకు వచ్చే క్రమంలో ఏమైనా జరిగితే అప్పుడు కూడా నన్నే అంటారు. అలాంటప్పుడు రెకమండేషన్ తో, సెక్యూరిటీతో వెళితే తప్పేముంది అని హేమ ప్రశ్నించారు. ఇన్నేళ్ల నా కెరీర్ లో షూటింగ్స్, కిచెన్, బెడ్ రూమ్ తప్ప నా లైఫ్ లో ఇంకేమీ లేదు. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు వచ్చాయి. ఈ టైంలో హార్మోనల్ చేంజస్ ఉంటాయి. కాబట్టి నేను డిప్రెషన్ ఫీల్ అవుతున్నా. డిప్రెషన్ నుంచి బయటపడాలంటే నేను లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. 

55
ఎక్కడ తిరిగినా నన్ను అడగొద్దు అని నా భర్తకు చెప్పా 

 దీనితో నా భర్తని కూర్చోబెట్టి చెప్పాను. నేను కొంతకాలం లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇంట్లో ఉండను. బయట తిరుగుతాను. ఎక్కడికి వెళ్ళాను ? ఏం చేస్తున్నాను ? ఇవన్నీ నన్ను అడగొద్దు. ఫోన్ చేసి డిస్ట్రబ్ చేయొద్దు. మీకు ఆకలి వేస్తే పనిమనిషిని పెట్టుకుని వంట చేయించుకోండి. నన్ను మాత్రం అడగొద్దు అని చెప్పేసినట్లు హేమ పేర్కొంది. నాకు వీలు ఉన్నప్పుడు వంట చేసి వెళతాను. లేనప్పుడు మాత్రం నన్ను వదిలేయండి అంటూ తన భర్తకి చెప్పినట్లు హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories