Korean Kanakaraju Movie Review: కొరియన్‌ కనకరాజు మూవీ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?

Published : Aug 07, 2026, 06:57 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, రితికి నాయక్‌ జంటగా `కొరియన్‌ కనకరాజు` చిత్రంలో నటించారు. నేడు(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్‌ తేజ్‌కి హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
కొరియన్‌ కనకరాజు మూవీ రివ్యూ

వరుణ్‌ తేజ్‌ ఇటీవల కాలంలో వరుసగా పరాజయాలు చవిచూశారు. మాస్‌ సినిమాలు, ఫ్యామిలీ చిత్రాలు, యాక్షన్‌ మూవీస్‌, స్పోర్ట్స్ చిత్రాలు ఇలా అన్ని రకాల జోనర్‌ చిత్రాలు ట్రై చేశారు. కానీ విజయం వరించలేదు. ఈ క్రమంలో రూట్‌ మార్చాడు. ఇప్పుడు కామెడీ చిత్రంతో వచ్చాడు. `కొరియన్‌ కనకరాజు` సినిమాలో నటించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందింది. నేడు శుక్రవారం(ఆగస్ట్ 7)న ఇది విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? వరుణ్‌ తేజ్‌కి హిట్‌ ఇచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
కొరియన్‌ కనకరాజు మూవీ స్టోరీ ఏంటంటే

కనకరాజు(వరుణ్‌ తేజ్‌) అనంతపురం జిల్లాలోని పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపిస్తుంటాడు. ఆయన అంటే ఊర్లో కొంత హడల్‌ ఉంటుంది. తన స్నేహితుడు కిష్టప్ప(సత్య) ఫోటోస్టూడియో నడిపిస్తుంటారు. కనకరాజుకి ఏ సమస్య వచ్చిన కిష్టప్ప చూసుకుంటాడు. అయితే ఓ సారి చైత్ర(రితిక నాయక్‌)ని చూసి ఫిదా అవుతాడు కనకరాజు. ఆమె కియా కార్ల కంపెనీలో పనిచేస్తుంటుంది. ఆమెని  ప్రేమలో పడేసే ప్రయత్నం చేస్తుంటాడు. చైత్రకి కొరియా సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడే ఒక అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలనే డ్రీమ్‌లో ఉంటుంది.  కానీ చైత్ర వెంట కనకరాజు తిరుగుతుంటాడు. ఓ సారి ప్రత్యర్థి చెంగల్‌రెడ్డి(సునీల్‌)తో గొడవ అవుతుంది. వాళ్ల మనుషులను కొడతాడు కనకరాజు. దీంతో బార్‌లో తిష్టవేస్తారు. కనకరాజుని అంతు చూడాలనుకుంటాడు. అందులో ఫైట్‌ జరుగుతున్న సమయంలో బార్‌లో ఓ సీసాలో ఆత్మ ఉంటుంది. అది కొరియన్‌ గ్యాంగ్‌ స్టర్‌ ది. ఫైట్‌ లో భాగంగా  ఆ సీసా మూత ఊడిపోవడంతో అందులో మందు, వాటర్‌ కలుపుకొని తాగుతాడు కనకరాజు. అందులో ఉన్న ఆత్మ కనకరాజులోకి వెళ్తుంది.  మరి ఆత్మ తనలోకి రావడంతో కనకరాజులో వచ్చిన మార్పేంటి? ఆయన కొరియా ఎందుకు వెళ్లాడు. అక్కడ కనకరాజు, చైత్ర, కిష్టప్ప చేసిన రచ్చ ఎలాంటిది? అనేది మిగిలిన సినిమా.

37
కొరియన్‌ కనకరాజు మూవీ విశ్లేషణ

హర్రర్‌ ని బేస్‌ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్‌ వచ్చింది. తాజాగా `కొరియన్‌ కనకరాజు` ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్ హర్రర్‌ కామెడీ చిత్రం. ఒకరిలోకి మరొకరి ఆత్మ వచ్చి అతనిలా ప్రవర్తించడం చాలా సినిమాల్లో చూశాం, కానీ ఇందులో దాన్ని కామెడీ ప్రధానంగా చేసుకొని, అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్‌ చేయడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. సినిమా ప్రారంభం రెగ్యూలర్‌గానే ఉంటుంది. ఊర్లో కనకరాజు అల్లరి చిల్లరగా తిరడం, గొడవలు, చెక్క భజన చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విలన్లతో గొడవలు, అనంతరం అమ్మాయి కనిపించడం ప్రేమలో పడటం, ఆమె కోసం ప్రయత్నాలు చేయడం, ఊర్లో ప్రత్యర్థితో గొడవలు ఇలా రొటీన్‌ సీన్లతో మూవీ స్టార్ట్ అవుతుంది. సత్య పాత్ర ఎంట్రీతో కొంత కామెడీ ట్రాక్‌ ఎక్కుతుంది. కానీ కామెడీ వర్కౌట్‌ కాలేదు. అయితే వరుణ్‌ తేజ్‌ని ఆత్మ ఆవహించిన తర్వాత నుంచి మూవీ హిలేరియస్‌గా మారుతుంది. సత్య ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్, డైలాగులు, యాక్టింగ్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సునీల్‌తో యాక్షన్‌ సీన్‌ కూడా అదిరిపోయింది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ బాగుంది. సెకండాఫ్‌లో కొరియాకి టర్న్ తీసుకుంటుంది. వరుణ్‌ తేజ్‌లోకి ఫోర్‌ ఫింగర్స్ ఆత్మ రావడం, అది చేసే యాక్షన్‌ కూడా బాగుంది. అయితే యాక్షన్‌ కంటే కామెడీనే ప్రధానంగా చేసుకొని సినిమాని నడిపించడం విశేషం. ముఖ్యంగా కొరియాలో చేసే క్షుద్రపూజ హిలేరియస్‌గా ఉంటుంది. సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో సత్య ఈ పూజ నిర్వహిస్తుంటాడు. తన నాన్న ఊర్లో ఉండి, వాట్సాఫ్‌ వీడియో కాల్లో ఈ పూజ చేస్తుంటారు. అది సిగ్నల్‌ రాక స్ట్రక్‌ అవుతుంది. ఆ సమయంలో సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టచెక్కలావ్వాల్సిందే. ఇక క్లైమాక్స్ లో ఫైట్‌ అదిరిపోయింది.

47
కొరియన్‌ కనకరాజు మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు

అయితే సినిమా కథ బలంగా లేదు. దర్శకుడు తనకు అనుకూలంగా ప్లెక్సీబుల్‌గా మార్చుకున్నారు. లాజిక్ లను పట్టించుకోకుండా సినిమా తీశాడు. తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాడు. కామెడీనే బేస్‌ చేసుకొని వెళ్లాడు. ఒకదాని తర్వాత మరో ఎపిసోడ్‌ గట్టిగా ప్లాన్‌ చేసుకున్నాడు. దీంతో కథ ఫ్లోని పట్టించుకోలేదు. లాజిక్‌ లకు ప్రయారిటీ ఇవ్వలేదు. కామెడీకి లాజిక్‌తో పనేంటి అనేది ఆయన బలంగా నమ్మాడు. ఇక బీజీఎం బాగుంది. కాకపోతే ఓజీని రివర్స్ కొట్టినట్టు ఉంది. సెకండాఫ్‌తో పోల్చితే ఫస్టాఫ్‌ తేలిపోయింది. అదే సమయంలో బాగా లెన్తీగా ఉంది. దీంతో ఫస్టాఫ్‌ చాలా వరకు బోర్‌ కొడుతుంది. క్లైమాక్స్ ఫైట్‌ సెట్‌ కాలేదు, కార్టూన్‌ సినిమాని తలపించింది. అయితే అందులోనూ కొంత ఫన్‌ యాడ్‌ చేయడం విశేషం. అదే సమయంలో ఈ మూవీలో సత్య నటన, కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. ఆయనే అసలైన హీరో అని చెప్పొచ్చు. వరుణ్‌ తేజ్‌ని పక్కన పెట్టి దర్శకుడు సత్యతో సినిమాని నడిపించడం విశేషం. అతను కూడా అదే స్థాయిలో ఇరగదీశాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తంగా ఈ చిత్రం హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

57
కొరియన్‌ కనకరాజు మూవీలో నటీనటులు ఎలా చేశారంటే

కనకరాజు పాత్రలో వరుణ్‌ తేజ్‌ అదరగొట్టాడు. పాత్రలో జీవించాడు. తనకు యాప్ట్ అనిపించుకున్నాడు. అదే సమయంలో నటుడిగానూ మరింత పరిణతి చూపించాడు. ఈజీగా ఈ మాస్‌ రోల్‌ని చేశాడు. ఇంకోవైపు ఫోర్‌ ఫింగర్‌గానూ ఇరగదీశాడు. స్టయిలీష్‌ యాక్షన్‌తో మెప్పించాడు. గ్యాంగ్‌ స్టర్‌గానూ వాహ్‌ అనిపించాడు. వరుణ్‌ తేజ్ లో నెక్ట్స్ లెవల్‌ యాక్టింగ్‌ని చూడొచ్చు. కిష్టప్పగా సత్య చేసిన సందడి, కామెడీ వర్ణించలేం. సినిమాకి ఆయనే అసలైన హీరో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సత్య లేకపోతే సినిమా లేదు. ఆయన తండ్రిగా మురళీధర్‌ గౌడ్‌ నటన ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. స్మశానం ఎపిసోడ్‌లో, క్షుద్రపూజలు చేసే ఎపిసోడ్‌లో ఆయన కూడా దుమ్ములేపారు. చైత్రగా రితిక నాయక్‌ ఉన్నంతలో మెప్పించింది. బుల్లిరాజు కాసేపు సందడి చేశాడు. అలాగే వీటీవీ గణేషన్‌ సైతం నవ్వించే ప్రయత్నం చేశారు. విలన్‌గా సునీల్‌ కాసేపు కనిపించాడు. మిగిలిన పాత్రదారులు ఓకే అనిపించారు.

67
కొరియన్‌ కనకరాజు మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

థమన్‌ మ్యూజిక్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా బీజీఎం అదిరిపోయింది. ఓజీని తలపించినట్టు ఉన్నా, అది వినడానికి బాగుంది. గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఆర్‌ఆర్‌ సైతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే, అంత గొప్పగా అనిపించలేదు. ఇరికించినట్టుగానే ఉన్నాయి. మనోజ్‌ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా నీట్‌గా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కేర్‌ తీసుకోవాల్సిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని గట్టిగా డిసైడ్‌ అయినట్టు ఈ సినిమా చూస్తుంటే తెలుస్తోంది. పాయింట్‌ కొత్తగా ఉంది. దాన్ని బ్లెండ్‌ చేసిన తీరు కూడా బాగుంది. కామెడీని రాసుకున్న తీరు బాగుంది. ఇంకా బాగా రాసుకోవాల్సింది. కొన్ని చోట్ల మాత్రమే కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది, కానీ చాలా చోట్ల తేలిపోయింది.  సెకండాఫ్‌ని బాగా ప్లాన్‌ చేసుకున్నాడు.  యాక్షన్‌, కామెడీ సమపాళ్లలో మేళవించాడు. అదరగొట్టాడు. నిర్మాణ విలువలకు కొదవలేదు. క్వాలిటీగా తీశారు.

77
ఫైనల్‌గా

యాక్షన్‌ ప్రధానంగా సాగే హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ `కొరియన్‌ కనకరాజు`. సరదాగా నవ్వుకోవడానికి మంచి ఆప్షన్‌.

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories