గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే..
కథలో ఐజి విజయ్ కాంత్ (శుభలేఖ సుధాకర్) పోలీస్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ (హర్షవర్ధన్) కలిసి బ్రూటల్ ధర్మ (జెడి చక్రవర్తి)కు చెందిన సత్య లాజిస్టిక్స్ అనే అక్రమ సంస్థను మూసివేస్తారు. అదే సమయంలో విజయ్ కాంత్ తన కూతురు షాలిని (ఫరియా అబ్దుల్లా)కి ధరహస్ (తరుణ్ భాస్కర్)తో పెళ్లి నిశ్చయిస్తాడు.పెళ్లి ఏర్పాట్ల సమయంలో సత్య లాజిస్టిక్స్ నుండి ఒక పార్సిల్ రావడం కథ కీలక మలుపు తిరుగుతుంది.
ఈ సందర్భంలో షాలిని, తన తండ్రి , ధరహస్ మధ్య ముందే పరిచయం ఉందని గుర్తించి అసలు విషయం ఏమిటని అడుగుతుంది. దీంతో ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభమవుతుంది. ధరహస్ తన ప్రేమించిన అమ్మాయిని (మానస చౌదరి) పెళ్లి చేసుకోవాలంటే అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అమెరికాకు వెళ్లగానే కొన్ని నియమాల కారణంగా తిరిగి పంపించబడతాడు.
ఈ ఘటనకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నియమాలేనని భావించిన ధరహస్, తన ప్రేమించిన అమ్మాయితో పాటు ఉద్యోగం కోల్పోయిన బాధతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. దీనికోసం తన స్నేహితుడి సహాయంతో చేతబడి చేసే భైరవ్ దాస్ (శ్రీవిష్ణు)ను సంప్రదిస్తాడు. ఈ కథలో బ్రూటల్ ధర్మ పాత్ర ఎలా ప్రవేశించింది, ధరహస్ జీవితం ఎలా మారింది, అసలు సత్య లాజిస్టిక్స్ పార్సిల్‌లో ఏముంది వంటి అంశాలు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయి.