Balakrishna: చిరంజీవికి షాకిచ్చేలా బాలయ్య కొత్త సినిమాల లిస్ట్.. ఒక్క దెబ్బతో మొత్తం మారిపోయింది

Published : Apr 24, 2026, 07:16 PM IST

బాలకృష్ణ స్పీడ్‌కి `అఖండ 2` బ్రేకులు వేసింది. కానీ చిన్న గ్యాప్‌ తీసుకుని మళ్లీ స్పీడ్‌ పెంచాడు బాలయ్య. ఇప్పుడు చిరంజీవిని మించి కొత్త సినిమాల లైనప్‌తో దూసుకుపోతున్నారు. 

PREV
16
చిరంజీవికి షాకిస్తున్న బాలకృష్ణ లైనప్‌

నందమూరి బాలకృష్ణ మొన్నటి వరకు యమ జోరు మీదున్నారు. `అఖండ 2` వరకు బాలయ్య సీనియర్‌ హీరోల్లో టాప్‌లో ఉన్నారు. వరుసగా నాలుగు విజయాలు అందుకున్నారు. `అఖండ 2`తో మరో హిట్‌ కొట్టాలని భావించారు. కానీ అది అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో బాలయ్యలో చాలా మార్పు వచ్చింది. రూట్‌ మార్చారు. యంగ్‌ డైరెక్టర్లకి ప్రయారిటీ ఇచ్చారు. డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు చేస్తున్నారు. కొత్త సినిమాల విషయంలో నయా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తున్నారు. అదిరిపోయే లైనప్‌తో బిజీగా ఉన్నారు. చిరంజీవికి షాకిచ్చేలా బాలయ్య కొత్త సినిమాల లైనప్‌ ఉండటం విశేషం.

26
ఎన్బీకే 111తో బిజీగా బాలయ్య

ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `ఎన్బీకే 111` పేరుతో, పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందుతుంది. అయితే హిస్టారికల్‌ అంశాలతో ఈ మూవీని తెరకెక్కించాలని భావించారు. కానీ బడ్జెట్‌ ఓవర్‌ అవుతుందట. దీంతో హిస్టారికల్‌, పీరియడ్‌ అంశాలను కట్‌ చేశారట. మాఫియా యాంగిల్‌లో సినిమాని నడిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్‌. కథ మారడంతో ఆమె తప్పుకుందని, కాజల్‌ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాజల్‌, బాలయ్య కలిసి `భగవంత్‌ కేసరి`లో నటించారు.

36
కొరటాల శివతో బాలయ్య నెక్ట్స్ మూవీ

ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అదిరిపోయే లైనప్‌ని సెట్‌ చేసుకున్నారు. క్రేజీ దర్శకులతో సినిమాలు చేయబోతున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టడం విశేషం. గోపీచంద్‌ మలినేని తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయ్యింది. `దేవర 2` కంటే ముందే బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు కొరటాల. ఇది కూడా అదిరిపోయే కథాంశంతో ఉండబోతుందని సమాచారం. కొరటాల మార్క్ కమర్షియల్‌ ఎలిమెంట్లు, సందేశాన్ని, అలాగే బాలయ్య మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారట.

46
వివేక్‌ ఆత్రేయతో బాలయ్య సినిమా

ఆ తర్వాత యంగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయతో సినిమాకి ఓకే చెప్పారు బాలకృష్ణ. మంచి కామెడీ చిత్రాలతో మెప్పించిన వివేక్‌ ఆత్రేయ `సరిపోదా శనివారం`తో తనలోని యాక్షన్‌ యాంగిల్‌ ని బయటపెట్టారు. ఇప్పుడు బాలయ్య మార్క్ యాక్షన్‌తో సినిమా చేయబోతున్నారు. ఇది ఆయన ఇమేజ్‌ని మార్చే సినిమా అవుతుందని టాక్‌.

56
విజయ్ కనకమేడలతో మరో సినిమా

దీంతోపాటు మరో యంగ్‌ డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడలతోనూ సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ. ఇది కూడా కన్ఫమ్‌ అయ్యిందట. విజయ్‌ కనకమేడల `నాంది`, `ఉగ్రం`, `భైరవం` వంటి చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు బాలయ్యతో మరో మాస్‌, యాక్షన్‌ సినిమాని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఇలా డిఫరెంట్‌ జోనర్‌ దర్శకులతో డిఫరెంట్‌ స్టోరీస్‌తో సినిమాలు చేసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

66
చిరంజీవి లైనప్‌

మొన్నటి వరకు చిరంజీవి భారీ లైనప్‌తో ఉన్నారు. బాలయ్యకి మించి ఆయన లైనప్‌ ఉండేది. కానీ ఇప్పుడు బాలయ్య చిరుని దాటిపోయారు. చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. త్వరలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత శ్రీకాంత్‌ ఓడెలతో సినిమా చేయనున్నారు. ప్రస్తుతానికి రెండు సినిమాలే ఉన్నాయి. ఈ లెక్కన చిరుని, బాలయ్య డామినేట్‌ చేస్తున్నారని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories