Driver Ramudu Review : 20 ఏళ్ల జయసుధ తో.. 56 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ రొమాన్స్, డ్రైవర్ రాముడు సక్సెస్ కు కారణాలు ఏంటో తెలుసా?

Published : Jan 04, 2026, 09:24 AM IST

తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో ఎన్టీఆర్ ఎక్కువగా సినిమాలు చేసి మెప్పించారు. వారిలో జయసుధ కూడా ఒకరు. ఎన్టీఆర్ కంటే దాదాపు 35 ఏళ్లు చిన్నదైన జయసుధ.. ఎన్టీ రామారావుకు హిట్ పెయిర్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో డ్రైవర్ రాముడు కూడా ఒకటి.

PREV
17
45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డ్రైవర్ రాముడు

తెలుగు సినీ పరిశ్రమ కీర్తి కిరీటం, నందమూరి నటసార్వభౌముడు తారకరాముడు నటించిన అద్భుతమైన సినిమాల్లో డ్రైవర్ రాముడు కూడా ఒకటి. అప్పటి యంగ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు .. తెరకెక్కించిన ఈసినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా జయసుధ నటించింది. ఈసినిమాను టెక్నాలజీ ఏమాత్రం లేని ఆ రోజుల్లోనే... చాలా త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. 1979 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం.. 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ పట్టదలతో పూర్తి చేసిన డ్రైవర్ రాముడు సినిమా విశేషాలను రివ్యూలో తెలుసుకుందాం?

27
28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్..

డ్రైవర్ రాముడుఎన్టీరామారావు 265వ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను పెద్దాయన చాలా త్వరగా పూర్తి చేయాలని పట్టుదలతో పనిచేశారు, చేయించారు కూడా. మూడే మూడు షెడ్యూల్స్ లో డ్రైవర్ రాముడు సినిమాను తెరకెక్కించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, కేవలం 28 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈసినిమా కోసం రోడ్డు సౌకర్యంలేని ప్రాంతాలకు ఎన్టీఆర్ స్వయంగా రోడ్డు వేయించారు. 1978 అక్టోబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు మూడు సినిమాలను రిలీజ్ చేయాలి అనుకున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే రెండు పౌరాణిక సినిమాలుగా శ్రీమద్ విరాటపర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం సినిమాలు చేసి.. వాటి మధ్య ఒక కమర్షియల్ మూవీగా డ్రైవర్ రాముడును రూపొందించారు.

37
డ్రైవర్ రాముడు కథ విషయానికి వస్తే..

రాము (ఎన్టీ రామారావు) నిజాయితీ గల ఒక లారీ డ్రైవర్. ఎంతో కష్టపడి లారీ నడుపుతూ.. పైకి వచ్చన వ్యక్తి. చాలా తక్కువ సమయంలోనే డ్రైవర్ నుంచి లారీ యజమానిగా మారుతాడు. రాముకి మీనా( రోజా రమణి) అనే కళ్లులేని చెల్లెలు ఉంటుంది. ఆమె అంటే రాముకు ప్రాణం. తన తోటి లారీ డ్రైవరు వాసు( కైకాల సత్యణారాయణ) తప్పు దోవలో వెళుతుంటే అతనిని కాపాడి మంచి మనిషిగా మార్చుతాడు రాము. ఇక హీరోయిన్ చుక్కమ్మ( జయసుధ) ఒక హోటల్ నడుపుతుంటుంది.ఒక సారి చుక్కమ్మ ను రౌడీ ఏడిపిస్తుంటే.. అతనిబారి నుంచి రాము ఆమెను కాపాడతాడు. దాంతో వీరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇక మరో పక్క. పోలీసు ఇన్ స్పెక్టర్ రాజా(శ్రీధర్) మీనాని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కమల్( మోహన్ బాబు) అనే స్మగ్లర్, అతని తండ్రి జాకాల్( రావుగోపాలరావు) దొంగ బంగారము రవాణా చేస్తుంటారు. ఒకరోజు పోలీసులకు పట్టుబడటంతో.. రాముని అందులో ఇరికించి.. అతని జీవితం నాశనం చేయాలని ప్లాన్ చేస్తారు. రాముని ఆ నేరంకింద జైలులో పెట్టిస్తారు. చుక్కమ్మ, లారీ క్లీనర్ నాని ల సహాయముతో రాము జైలు నుంచి తప్పించుకుని బయటపడతాడు. రాము తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు అనేది ఈసినిమా కథ.

47
డ్రైవర్ రాముడు నటీనటులు

ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఈసినిమాకు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. రాఘవేంద్రరావు కి నందమూరి వారి బ్యానర్ లో ఇది తొలిసినిమా. లారీ డ్రైవర్‌గా, స్వయంకృషితో ఎదిగి... లారీ ఓనర్ గా మారిన పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆయన సరసన జయసుధ.. ఎన్టీఆర్ కు పోటీగా నటించింది. వీరిద్దరి మధ్య వయసులో 35 ఏళ్ల గ్యాప్ ఉన్నా.. డ్యూయెట్ల విషయంలో కానీ.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో కానీ.. ఎక్కడా తగ్గలేదు. ఇక ఎన్టీఆర్ కు సోదరిగా రోజారమణి, ఆమె భర్తగా శ్రీధర్ నటించారు. కైకాల సత్యనారాయణ మరో లారీ డ్రైవర్‌ వాసుగా నటించగా.. డ్రైవర్ రాముడు సినిమాకు విలన్లుగా రావు గోపాలరావు, మంచు మోహన్ బాబు తండ్రీకొడుకుల పాత్రల్లో మెప్పించారు.

57
సినిమా ఎలా ఉందంటే?

డ్రైవర్ రాముడు సినిమా అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే తో ఆ తరం ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కథ తక్కువ.. ఎలివేషన్లు ఎక్కువైపోయాయి.. కానీ అప్పట్లో సినిమాల కథను అద్భుతంగా తీర్చిదిద్దేవారు దర్శకులు. ఈ సినిమా టైమ్ కు డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకుడిగా మంచి యంగ్ ఏజ్ లో.. దూకుడు మీద ఉన్నాడు. ఈసినిమా కోసం ఏ అంశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. 56 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ చేత.. యాక్షన్, రొమాన్స్ , కామెడీ కూడా చేయించాడు రాఘవేంద్రరావు. ఇక ఈసినిమాకు ప్రధాన బలంగానిలిచిన అంశం సిస్టర్ సెంటిమెంట్. కళ్లు లేని చెల్లెలు జీవితం గురించి అన్న పడే తపన.. థియేటర్ లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. సాధారణ డ్రైవర్ కృషితో ఓనర్ స్థాయికి ఎగడం లాంటి అంశాలతో యువతకు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అవసరమైన చోట్ల పాటలు.. అభిమానులకు ఉత్సాహం తెప్పించడానికి యాక్షన్ సీక్వెన్స్ లు.. మధ్యలో ప్రేక్షకులు కాస్త కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటానికి జయమాలినీ చేత ఐటమ్ సాంగ్ కూడా చేయించారు.

67
ప్రాణం పోసిన చక్రవర్తి పాటలు.. జంధ్యాల మాటలు

డ్రైవర్ రాముడు సినిమాకు పాటలతో ప్రాణం పోశారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందరామమూర్తి రాసిన అద్భుతమైన సాహిత్యానికి, చక్రవర్తి బాణీలు, బాలు గాత్రం అభిమానులను ఉర్రూతలూగించాయిన చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా.. గుగుగు గుడిసుంది ఐటమ్ సాంగ్, మామిళ్లతోపుకాడ నేనుంటే.. అంటూ లారీలో ఎన్టీఆర్, జయసుధ పాడుకునే పాటలు.. రేడియోట్లో, టేప్ రికార్డర్స్ లో మారుమోగిపోయేవి. అన్నా చెల్లెలు అనుబంధాన్ని తెలుపుతూ సాగిన .. ఏమని వర్ణించను పాట శ్రోతలచేత కంటతడి పెట్టిస్తుంది. ఇలా డ్రైవర్ రాముడు విజయానికి పాటలు మేజర్ కారణం అయ్యాయి. పాటలతో పాటు ఈసినిమా మాటలు కూడా అంతే ప్రభావాన్ని చూపించాయి. ఎన్టీఆర్ పవన్ ఫుల్ డైలాగ్స్ తో పాటు, సెంటిమెంట్, కామెడీ పంచులు ఇలా అన్నిరకాల డైలాగ్స్ ను అద్భుతంగా రాశారు జంధ్యాల మాస్టారు.

77
డ్రైవర్ రాముడు విజయం..

డ్రైవర్ రాముడు సినిమాను 28 రోజుల్లో పూర్తి చేసి..అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతే కాదు హైదరాబాద్ , విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, ఒంగోలు, మచిలీపట్నం, తిరుపతి, కర్నూలు, కడప, వరంగల్, వంటి కొన్ని కేంద్రాలలో డ్రైవర రాముడు వంద రోజులు ఆడింది. తిరుపతిలో 25 వారాలు, విజయవాడలో షిఫ్టింగ్లతో 25 వారాలు ఆడింది. ఇక సెకండ్ రిలీజ్‌లో కూడా డ్రైవర్ రాముడు తన సత్తా చూపించింది. బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము దులిపేసింది. ఇక డ్రైవర్ రాముడు సినిమాను తమిళంలో శివాజీగణేషన్, శ్రీప్రియా జంటగా 1981 లో లారీ డ్రైవర్ రాజకన్ను పేరుతో రీమేక్ చేయగా.. ఆసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే కథను 1984, హిందీలో మిథున్ చక్రవర్తి, రంజీతా జంటగా 'తర్కీబ్' పేరుతో రీమేక్ చేయబడింది. డ్రైవర్ రాముడు సినిమాలో ఈ తరం ఆడియన్స్ కూడా చూడగలిగే అంశాలు.. నేర్చుకోవాలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీనిచూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే.. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories