
మాస్టర్ మహేంద్రన్ బాలనటుడిగా `పెదరాయుడు`, `దేవి`, `సింహరాశి`, `సింహాద్రి` వంటి అనేక చిత్రాల్లో నటింటి మెప్పించాడు. అన్ని భాషల్లో కలిపి దాదాపు రెండు వందలకుపైగా చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఆయన హీరోగా అలరించేందుకు వస్తున్నారు. తాజాగా `నీలకంఠ` అనే చిత్రంతో హీరోగా నటించాడు. ఈ మూవీలో మహేంద్రన్ కి జోడీగా యశ్న ముత్తులూరి, నేహా పటాన్ హీరోయిన్లుగా నటించారు. స్నేహా ఉల్లాల్ స్పెషల్ సాంగ్ చేసింది. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎల్ ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణు గోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఒక్క రోజు గ్యాప్ తో నేడు శుక్రవారం(జనవరి 2)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు పెద్ద పీఠ వేసే సరస్వతిపురం అనే గ్రామంలో తప్పు చేస్తే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అదే ఊరులో టైలర్ వృత్తి చేసుకొనే నాగ భూషణం ( కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ( మాస్టర్ మహేంద్రన్ ) బాగా చదువుతాడు. కానీ అతను 10th క్లాస్ చదివే టైమ్‌లో ఒక తప్పు చేస్తాడు. దీంతో ఊరి పెద్ద రాఘవయ్య(రాంకీ) నీలకంఠకి 15 సంవత్సరాలు ఊరు దాటి వెళ్లొద్దని, ఇకపై చదువుకోవడానికి వీల్లేదని శిక్ష వేస్తాడు. అయితే నీలకంఠ 10th క్లాస్ లో సీత(యశ్న ముత్తులూరి) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె ఆ ఊరి సర్పంచ్ (పృథ్వీ) కూతురు. సీత పై చదువుల కోసం పట్నం వెళ్తుంది. నీలకంఠ తన చిన్న తనంలోనే వాళ్ళ అమ్మాకి మాటిస్తాడు, బాగా చదువుకొని ఊరుకి పేరు తీసుకొస్తా అని. కానీ తన మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడతాడు.
సరస్వతిపురంలో కబడ్డీ ఆటకి ఒకప్రత్యకమైనా స్థానం ఉంది. చదువుకి దూరం అయినా నీలకంఠ కబడ్డీ ఆట ఆడటం స్టార్ట్ చేస్తాడు. ఆ ఊర్లో జరిగిన అన్ని పోటీల్లో గెలుస్తాడు. కానీ ఊరు దాటలేని పరిస్థితి ఉండటంతో మండలస్థాయి పోటీల్లో పాల్గొనలేకపోతాడు. దీంతో తన టీమ్ మండల స్థాయిలో ప్రతిసారి ఓడిపోతుంటుంది. 15ఏళ్ల తర్వాత సీత ఊరికి వస్తుంది. దీంతో మళ్లీ నీలకంఠ, సీత కలుసుకుంటారు. వీరిద్దరు తిరిగే విషయం తెలిసి సర్పంచ్ తన కూతురుకి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ దానికి నీలకంఠ అడ్డుపడతాడు. నీ స్థాయి ఏంట్రా అని సర్పంచ్ అతన్ని అవమానించడంతో తన స్థాయి ఏంటో చూపించేందుకు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగుతాడు. మరి దొంగగా ముద్ర వేసుకున్న నీలకంఠ ఈ ఎన్నికల్లో గెలిచాడా? తన ప్రేమని గెలిపించుకున్నాడా? తన కబడ్డీ టీమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాడు? అమ్మకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది మిగిలిన సినిమా.
నీలకంఠ మూవీ సింపుల్‌గా చెప్పాలంటే ఓ పీరియడ్ విలేజ్ డ్రామా. ఇలాంటి కట్టుబాట్లు, శిక్షల నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. ముప్పై ఏళ్ల క్రితమే ఇలాంటి జోనర్ చిత్రాలు బాగా వచ్చాయి. అందులో చాలా వరకు విజయం సాధించాయి. మాస్టర్ మహేంద్రన్ బాల నటుడిగా నటించిన `పెదరాయుడు`లో కూడా ఈ పాయింట్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఈ తరహా సినిమాలు రాలేదని చెప్పాలి. దీంతో ఈ జనరేషన్‌కిది కొత్త పాయింట్ గానే నిలుస్తుంది. ఈ సినిమాలే వేసిన శిక్ష కూడా కొత్తగా ఉంది. సాధారణంగా ఊర్లో తప్పు చేస్తే వెలేయడం, వారితో మాట్లాడకుండా ఉండటం, ఎలాంటి సపోర్ట్ అందించకుండా ఉంటాయి. కానీ ఇందులో ఊరు దాటి వెళ్లొద్దని చెప్పడం కొత్తగా ఉంది.
సినిమాని నడిపించిన తీరు కూడా ఎంగేజింగ్‌గా ఉంది. ప్రారంభం నుంచే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా నడిపించారు. ప్రేమాభినాలు ఉన్న చోటే, కఠినమైన నిబంధనలు కూడా ఉంటాయి. దానికీ మూవీ అద్దం పడుతుంది. సినిమాలోని డ్రామా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఆసక్తిని పెంచుతుంది. దీనికితోడు ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేశారు. కథ ఎంగేజింగ్‌గా సాగుతూనే ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. హీరో పాత్రలోని ఎమోషన్స్ ఆద్యంత కట్టిపడేస్తాయి. ఆయనకు శిక్ష పడటం, దీంతో ఏం చేయలేని స్థితిలో ఉండటం, అమ్మకిచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాననే బాధ, మరోవైపు ప్రేమ దూరం కావడం హీరో పాత్రని సంఘర్షణకు అద్దం పడుతుంది. ఆయా సన్నివేశాలను బాగా డీల్ చేశారు.
ఇంటర్వెల్ సస్పెన్స్ బాగుంది. సెకండాఫ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. విలేజ్ రాజకీయాలు, ప్రేమ కోసం హీరో సవాల్ చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి సీన్లు ఎంగేజింగ్ గా సాగుతాయి. రేసీగా ఉంటుంది. అదే సమయంలో ఇన్‌స్పైర్ చేసేలా ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉన్నాయి. ఊరు లో జరిగే కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అయితే కథ ఊహించినట్టుగా ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. ఎంటర్‌టైన్మెంట్ పాళ్లు తగ్గాయి. ఎమోషన్స్ పై బాగా వర్క్ చేయాల్సింది. కొంత రొటీన్ ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది.
హీరోగా మాస్టర్ మహేంద్రన్ చాలా బాగా నటించాడు. సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఇరగదీశాడు. స్క్రీన్ ప్రజెన్స్ నేచురల్ గా ఉంది. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టాడు. యాక్షన్స్ లో మాత్రం వాహ్ అనిపించాడు. హీరోయిన్ యాశ్న ముత్తులూరి సీత పాత్రలో బాగా ఒదిగిపోయింది. కనిపించినంతసేపు కట్టిపడేసింది. చాలా ఏళ్ల తర్వాత స్నేహ ఉల్లాల్ తెరపై కనిపించడం ఓ విశేషమైతే, ఆమె స్పెషల్ సాంగ్‌లో దుమ్మురేపడం మరో విశేషం. ఊరి పెద్దగా రాంకీ అదరగొట్టాడు. అలాగే సర్పంచ్‌గా పృథ్వీ సైతం తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు. మిగిలిన పాత్రదారులు ఓకే అనిపించారు.
దర్శకుడు రాకేష్ మాధవన్ పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం బాగుంది. తాను చెప్పాలనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చెప్పడంలో విజయం సాధించాడు. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. ఎక్కడా కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ రాలేదు. చాలా బాగా డీల్ చేశాడు. విజువల్, ఎడిటింగ్ శ్రవణ్ జి కుమార్ చేశారు. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పాటర్న్ రిఫ్రెషింగ్ గా ఉంది. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా, అలరించేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీలో హైలైట్ అని చెప్పాలి. అనిల్ ఇనుమడుగు, కృష్ణ రాసిన పాటలు వింటేజ్ ఫీలింగ్ కల్గించాయి. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా మర్లపల్లి శ్రీనివాసులు,దివి వేణుగోపాల్ మంచి కమర్షియల్ మూవీని అందించడంలో సక్సెస్ అయ్యారు. సినిమా మేకింగ్ రిచ్‌గా ఉండటం విశేషం.
ఫైనల్ గా : `నీలకంఠ` రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కమర్షియల్ ఎమోషనల్ డ్రామా.
రేటింగ్ : 2.5