ఏఎన్నార్ కూతురిగా శ్రీదేవి, నాస్తికుడైన అక్కినేని పరమ భక్తుడిగా నటించిన సినిమా, భక్త తుకారాం మూవీ రివ్యూ..

Published : Mar 22, 2026, 08:46 AM IST

అలనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వారావుకు దేవుడంటే నమ్మకంలేదని అంటుంటారు. ఆయన కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. నాస్తికుడైనా.. ఏఎన్నార్ పరమ భక్తుడిగా నటించి హిట్ అయిన సినిమాలెన్నో ఉన్నాయి. అందులో భక్త తుకారాం కూడా ఒకటి.

PREV
17
అక్కినేని భక్తి రస చిత్రం..

దేవుడంటే నమ్మకంలేని అక్కినేని నాగేశ్వారావు.. పాండురంగ పరమ భక్తుడిగా నటించిన సినిమా భక్త తుకారాం. మధుసూదనరావు దర్శకత్వంలో 1973లో వచ్చిన తెలుగు భక్తిరస చిత్రాన్ని అంజలిపిక్చర్స్ పతాకంపై పి. ఆదినారాయణరావు నిర్మించాడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు అంజలీదేవి, శివాజీ గణేశన్, కాంచన, నాగభూషణం లాంటి స్టార్ కాస్ట్ నటించారు. సంగీతం పి.ఆదినారాయణరావు సమకూర్చారు. మహారాష్ట్రకు చెందిన పాండురంగని భక్తుడు తుకారాం జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది.

27
భక్త తుకారాం కథ విషయానికి వస్తే..

పదిహేడవ శతాబ్దంలో.. మహారాష్ట్రలో దేహూ గ్రామంలో జరిగిన కథ ఇది. ఆ గ్రామంలో తుకారాం( అక్కినేని నాగేశ్వరరావు) పాండురంగడికి మహాభక్తుడు. భార్య(అంజలీదేవి) ఇద్దరు బిడ్డలతో హాయిగా జీవిస్తుంటాడు. పాండురంగ భక్తునిగా అతని మంచి గుర్తింపు ఉంటుంది. అదే గ్రామంలో గొప్ప భక్తుడినని చెప్పుకుంటూ.. ఇద్దరు శిష్యులతో గ్రామాన్ని మోసం చేస్తుంటాడు కుంభోజీ( నాగభూషణం). అతనికి తుకారాం భక్తి ఇబ్బంది కలిగిస్తుంది. తుకారాం ప్రాభవాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అతనిపై వేశ్యను ప్రయోగిస్తాడు. కానీ ఆమె తుకారాం భక్తురాలిగా మారిపోతుంది. శూద్రుడైన తుకారాం వ్రాసిన భక్తి రచనలు హైందవ సంప్రదాయానికి విరుద్ధమని వాటిని నాశనం చేయాలని పీఠాధిపతితో చెప్పిస్తాడు కుంభోజి. ఎంతో శ్రమతో, భక్తితో రాసి వాటిని నీటిపాలు చేస్తారు. దాంతో కలత చెందిన తుకారాం నది ఒడ్డునే నిద్రాహారాలు మాని దేవుని స్మరిస్తూ ఉండి పోతాడు. దేవుడు కరుణించి ఆ రచనలను తిరిగి ప్రసాదిస్తాడు. దాంతో అప్పటి వరకూ తుకారాంపై కోపంగా ఉన్న పీఠాధిపతి సైతం తుకారాం భక్తిని తెలుసుకుంటాడు.

37
కుంభోజి ప్రయత్నాలు

మరోవైపు కుంభోజి ప్రయత్నాలు మాత్రం ఆపడు.. తుకారాంను ఎలాగైనా ఇబ్బందుల్లో పడేయాలని.. ప్రయత్నంలో.. ఆలయంలోని పాండురంగని విగ్రహాన్ని నూతిలో పడవేసి, శూద్రుడైన తుకారాం చర్యల్ని భరించలేని పాండురంగడు గుడి నుండి వెళ్ళిపోయాడని ప్రచారం చేస్తాడు. అదే విషయాన్ని ఏకంగా శివాజీ మహారాజు వరకూ తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అప్పటికే తుకారాం గురించి విన్న శివాజీ అతనికి కానుకలు పంపగా తుకారాం తిరస్కరిస్తాడు. తుకారాం ను పరీక్షించాలని.. గతంలో అతనిపై వచ్చిన కంప్లైంట్ విషయంలో విచారించే నిమిత్తం తుకారాం దగ్గరకు వస్తాడు. విచారిస్తున్న క్రమంలోనే.. శివాజీ చూస్తుండగానే పాండురంగని విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షంమౌతుంది. ఈ లోపులో కుంభోజీ అందించిన సమాచారంతో, శివాజీ శత్రువులు సడెన్ గా శివాజీను చుట్టుముడతారు. ఒంటరిగా ఉన్న శివాజీ వారితో ఎలా పోరాడాడు..? తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్ధించిన శివాజీకి తుకారాం ఏం చెప్పాడు? తుకారాం. చివరకు మోక్షమార్గాన్ని ఎలా చేరాడు అనేది ఈ సినిమా కథ.

47
నటీనటుల మధ్య పోటా పోటీ..

ఈ సినిమాలో నటీనటులంతా సీనియర్స్. ఎక్కడా ఎవరు తగ్గలేదు.. పోటా పోటీగా నటించారు. భక్త తుకారాం గా అక్కినేని.. ఆయన భార్యగా అంజలీదేవి సెంటిమెంట్ సీన్స్ కంటతడి పెట్టించాయి. తుకారాంలో అమయాకత్వం.. ప్రేక్షకులకు కూడా జాలి కలిగిస్తుంది. అక్కినేని నటన మెస్మరైజ్ చేస్తుంది. ఇక సెంటిమెంట్ సీన్స్, కన్నీటి సన్నివేశాలంటే అంజలీదేవికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆమె ఎన్నో అద్భుతాలు చేయగల నటి. విలన్ పాత్ర ఈ సినిమాలో చాలాప్రత్యేకం.. అన్ని సినిమాల్లోలా క్రూరుడైన విలన్ గా కాకుండా.. కన్నింగ్.. నక్క తెలివితేటలు కలిగిన కుంభోజీ పాత్ర ఇందులో నాగభూషణం అద్భుతంగా పోషించారు. ఇక పేరుకు తగ్గట్టుగానే శివాజీ పాత్రలో శివాజీ గణేషన్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు.

57
సినిమా సక్సెస్ లో పాటలు..

ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశారు మధుసూదనరావు. భక్తి రసాన్ని ఎక్కడా తక్కువ చేయకుండా అద్భుతంగా సినిమాను నడిపించారు. ఇక పండరీపురం ఆలయంలో కాకుండా.. ఈ సినిమా మొత్తం.. హంపీలోని విరూపాక్ష టెంపుల్ లో చిత్రీకరించారు. తుంగభద్ర నది ఒడ్డున ఎక్కువ భాగం షూటింగ్ జరిగినినట్టు తెలుస్తోంది. ఈసినిమాకు సగం బలం పాటలు. భక్త తుకారాం పాటలు.. అప్పట్లో టాలీవుడ్ ను ఊపు ఊపేశాయి. ఈసినిమాకు మహామహులు సాహిత్యాన్ని అందించారు. ఆత్రేయ, దాశరథి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వీటూరి, సి .నారాయణరెడ్డి లాంటి మహానుభావులు అద్భుతమైన గీతాలు రచించారు. ఈ రచనలకు పి.ఆదినారాయణ రావు కట్టిన బాణీలు.. ప్రేక్షకులను కట్టిపడేేశాయి. ఈసినిమాకు నిర్మాత కూడా పి.ఆదినారాయణ రావే. 

67
పాటలకు ప్రాణం పోసిన గాయకులు..

ఇక ఈ పాటలకు తమ గాత్రాలతో ప్రాణం పోశారు ఘంటసాల, ఎస్పీ బాలు, రామకృష్ణ, సుశీలమ్మలు. ఈ సినిమాలో ఘనా ఘన సుందరా... భలే భలే అందాలు సృష్టించావు.. ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా.. పడవెళ్ళీ పోతుందిరా... లాంటి పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి.. ఏ దేవడి మండపంలో విన్నీ.. భక్తు తుకారాం పాటలే వినిపించేవి.. ఇప్పటికి ఆ ప్లే లిస్ట్ లో ఒక్క పాట అయిన ఈసినిమా నుంచి వినిపిస్తుంటుంది.

77
చిత్రంలో విచిత్రాలెన్నో..

ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈసినిమా హీరో అక్కినేనితో పాటు.. దర్శకుడు మధుసూదనరావు కూడా నాస్తికుడే. దర్శకుడు విప్లవభావాలు కలిగిన వాడు కాబట్టి.. భక్తి సినిమాలో కూడా ఆ ప్లేవర్ కనిపించింది. కొన్ని డైలాగ్స్ లో మధుసూధరనావు అభ్యుదయ భావాలతో కూడిన సంభాషణలు రాశారు. అతిలోక సుందరి శ్రీదేవి ఈ సినిమాలో.. తుకారాం కూతురిగా కనిపిస్తుంది. లవకుశ సినిమాలో నటించిన నాగరాజు మహావిష్ణువుగా కనిపించారు. ఇక ఈమూవీ టైమ్ లో ఘంటసాలకు అనారోగ్యం కారణంగా గాయకుడురామకృష్ణ, ఈ చిత్రంలో పాటలు పాడే అవకాశం పొందాడు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమూవీని చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories