Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?

Published : Mar 19, 2026, 12:53 AM IST

Dhurandhar 2 Review: రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన `ధురంధర్‌ 2` మూవీ విడుదలైంది. మొదటి పార్ట్ పెద్ద హిట్‌ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను రీచ్‌ అయ్యిందని మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
ధురంధర్‌ 2 మూవీ రివ్యూ

బాలీవుడ్‌ మూవీ `ధురంధర్‌` గతేడాది డిసెంబర్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా రూ.1300కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. దీంతో ఇప్పుడు పార్ట్ 2 `ధురంధర్‌ 2`(ధురంధర్‌ ది రివేంజ్‌)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా, సారా అర్జున్‌ హీరోయిన్‌గా, సంజయ్‌ దత్‌, అర్జున్‌ రాంపాల్‌, ఆర్‌ మాధవన్‌, రాకేష్‌ బేడీ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆదిత్య ధార్‌ దర్శకుడు. జియో స్టూడియోస్‌, బీ62 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి ఆదిత్య ధార్‌, జ్యోతి దేశ్‌ పాండే, లోకేష్‌ ధార్‌ నిర్మాతలు.  ఉగాది పండగ సందర్భంగా నేడు గురువారం(మార్చి 19)న విడుదలైంది. మరి ఈ ఇది మొదటి పార్ట్ ని మించి ఉందా? బాక్సాఫీసుని షేక్‌ చేసే సత్తా ఉందా? భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
ధురంధర్‌ 2 మూవీ కథ

`ధురంధర్‌` మూవీకి కంటిన్యూటీగా ఈ సినిమా కథ సాగుతుంది. జాస్కీరాత్‌ సింగ్‌ రాంగి(రణ్‌ వీర్‌ సింగ్‌) స్థానిక ఎమ్మెల్యే మనషులు ల్యాండ్‌ గొడవలో తండ్రిని చంపేస్తారు. తన ఇంటి ఆడవారిపై అఘాయిత్యం చేస్తారు. దీంతో అతను వారిపై ప్రతీకారం తీర్చుకుని వారిని చంపేస్తాడు. జైలుకి వెళ్తాడు. అక్కడ కొందరు ఎటాక్‌ చేసి జాస్కీరాత్‌ని కిడ్నాప్‌ చేస్తారు. కట్‌ చేస్తే, భారత ఇంటలిజెన్స్ బ్యూరో హెడ్‌ అజయ్‌ సన్యాల్‌(ఆర్‌ మాధవన్‌) అతన్ని కిడ్నాప్‌ చేసి పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను అంతం చేసే మిషన్‌(ధురంధర్‌) ని అప్పగిస్తాడు. జాస్కీరాత్‌ కాస్త పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాక హమ్జా అలీ మజారీ అనే టెర్రరిస్ట్ గా మారిపోతాడు. అక్కడ నెమ్మదిగా నాయకుడిగా ఎదుగుతాడు. బెలూచ్‌ ఉగ్రవాద గ్యాంగ్‌ కి నాయకుడు అయిన రెహ్మాన్‌ డెకాయిట్‌ని చంపేసి నాయకుడిగా ఎదుగుతాడు. మొదట బెలూచీకి నాయకుడిగా, ఆ తర్వాత లయారీ ప్రాంతానికి కింగ్‌గా అవతరిస్తాడు. పాకిస్తాన్‌లో ఉగ్రనాయకుడిగా ఎదిగిన హమ్జాకి ఎదురైన సవాళ్లు ఏంటి? తన కుటుంబం పరంగా ఎలాంటి పరిణామాలను చవిచూశాడు? ఎవరికీ అనుమానం రాకుండా ఎలా మెయింటేన్‌ చేశాడు? పాకిస్థాన్‌లో తన చక్రం ఎలా తిప్పగలిగాడు? అంతిమంగా అక్కడ ఉగ్రవాదులను ఎలా అంతం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్‌ చేశాడనేది సినిమా.

37
ధురంధర్‌ 2 మూవీ విశ్లేషణ

`ధురంధర్‌` మూవీ సంచలన విజయం సాధించడంతో `ధురంధర్‌ 2`పై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా అనేది చూస్తే, ఆ సినిమా స్థాయిలో ఉంది, కానీ దాన్ని మించి అయితే లేదు. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. ఆదిత్య ధార్‌ టేకింగ్‌, యాక్షన్‌ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో తెరపై చూసినప్పుడు వాహ్‌ అనిపించింది. అందుకే ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే ఆల్‌ రెడీ మొదటి పార్ట్ చూడటంతో ఇప్పుడు రెండో భాగం దాన్ని మించి ఉంటుందని ఆశిస్తున్నారు ఆడియెన్స్. ఆ అంచనాలను అందుకోవడంలో రెండోపార్ట్ తడబడిందని చెప్పొచ్చు. సినిమా మొదటి అరగంట సేపు రేసీగా సాగుతుంది. వరుస యాక్షన్‌, ఎమోషన్స్ తో పరుగులు పెట్టింది. దీనికితోడు బీజీఎం అదిరిపోయింది. గూస్‌ బంమ్స్ తెప్పించింది. హీరో తన ఫ్యామిలీకి ఎదురైన ఇబ్బందులు, తండ్రిని కోల్పోవడం, ఫ్యామిలీ ఇబ్బంది పడటం, న్యాయం జరగకపోవడంతో తిరుగుబాటు చేసి వారిని అంతం చేయడం వంటి సీన్లు అదిరిపోయాయి. ఆ తర్వాత ఐబీ అధికారి అతన్ని జైలు నుంచి తప్పించి ఏజెంట్‌గా శిక్షణ ఇచ్చి పాకిస్తాన్‌ పంపించే వరకు సినిమా నెక్ట్స్ లెవలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ వెళ్లాక అక్కడ తాను ఎలా ఎదిగాడనేది చూపించారు. బెలూచీకి, లయారీకి కింగ్‌ ఎలా అయ్యాడనేది చూపించారు. అక్కడ ఉగ్రవాద పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ క్రమంలో సినిమా స్లోగా సాగుతుంది. తాను కింగ్‌గా ఎదిగేందుకు హీరో వేసే ఎత్తులు, ఉగ్రవాదులను ఒక్కొక్కరిని తప్పించి తాను ఎదిగే సీన్లు బాగున్నాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే తిరిగింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. నోట్ల రద్దు వెనక స్టోరీ బాగుంది. సెకండాఫ్‌ లో కొంత రేసీగా అనిపించినా, ఆ తర్వాత మళ్లీ మొదటికొచ్చింది. 

తనే ఏజెంట్‌ అని తెలిసినప్పుడు ఇక పోరాటమే మిగిలి ఉంటుంది. అదే రీవేంజ్‌. ఆయా ఎపిసోడ్లు బాగున్నాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. అనంతరం ఎమోషన్స్ కూడా కట్టిపడేసేలా ఉన్నాయి. అయితే సినిమా ఎక్కువగా యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. అటు ఊర్లో కుటుంబం, ఇటు పాకిస్తాన్‌లో ఫ్యామిలీకి సంబంధించిన సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రతిదీ డిటెయిలింగ్‌గా చూపించే క్రమంలో మూవీ స్లోగా రన్‌ అవుతుంది. ఎంతసేపు ముందుకు సాగదు. కొంత బోర్‌ ఫీల్‌ తెప్పిస్తుంది. ఆ తర్వాత మధ్య మధ్యలో హై మూవ్‌మెంట్స్, యాక్షన్‌ సీన్లతో మూవీని లేపే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో ఒక్కో ఉగ్రవాదిని అంతం చేసే సీన్లు, లీడర్లని, ఎస్పీని చంపేసీన్లు బాగున్నాయి. హోటల్‌లో పార్టీ సీన్ కూడా అదిరిపోయింది. మరోవైపు దావూద్‌ ఇబ్రహీం సీన్లు మరింతగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్లు బాగున్నాయి. ఎమోషనల్‌గా ఆకట్టుకున్నాయి. గుండెని బరువెక్కించాయి. సినిమాలో డైలాగ్‌లు అదిరిపోయాయి. దేశభక్తిని నింపేలా, అదే సమయంలో శత్రువులకు వణుకు పుట్టించే డైలాగ్‌లు మెప్పించాయి. క్లైమాక్స్ ఫైట్‌ ట్విస్ట్, ఇంటర్వెల్‌ ట్విస్ట్, నోట్ల రద్దు ట్విస్ట్ బాగున్నాయి. సినిమాలో హీరో పెర్ఫార్మెన్స్ హైలెట్ అవుతుంది. అలాగే సంజయ్ దత్, ఆర్‌ మాధవన్ రోల్‌ ఇవి బాగా ఆకట్టుకుంటాయ. బిజీ ఏమో అదిరిపోయింది అని చెప్పొచ్చు. దేశభక్తి సంబధించిన డైలాగులు హైలెట్గా నిలుస్తాయి.

47
ధురంధర్‌2 మూవీ మైనస్ లు

సినిమాకి పెద్ద మైనస్‌ నిడివి. మూడు గంటల 49 నిమిషాలు అంటే మామూలు కాదు. మొదటి సినిమా చూడటంతో దీనిపై భారీ అంచనాలుండగా, దాన్ని అందుకోలేకపోయింది. కొత్తగా ఏం చూపించలేదు. చాలా వరకు మొదటి పార్ట్ సీన్లు రిపీట్‌ అవుతాయి. అవి మూవీపై ఆసక్తిని తగ్గిస్తాయి. నిడివి పెద్ద మైనస్‌. ఈజీగా అరగంటకుపైగా కట్‌ చేయోచ్చు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. ఆ స్థాయిలో ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. మొదటి అరగంట స్థాయిలో మూవీ లేదు. సెకండాఫ్‌ కూడా అలానే సాగింది. క్లైమాక్స్ ఫైట్‌ని బాగా సాగదీశారు. విలన్లని కూడా బలంగా చూపించలేదు. ఇవన్నీ మూవీకి మైనస్‌గా నిలిచాయి.

57
ధురంధర్‌ 2 మూవీ నటీనటుల పనితీరు

ఉగ్రవాద నాయకుడు హమ్జా అలీగా హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒదిగిపోయాడు. వన్‌ మ్యాన్‌ షో చేశాడు. స్ట్రగుల్స్ పడే వ్యక్తిగా, ఉగ్రవాదిగా, దేశం కోసం పోరాడే వ్యక్తిగా హీరో నటన అదరగొడుతుంది. యాక్షన్‌ సీన్లు, ఎమోషన్స్ సీన్లు, మాస్‌ డైలాగ్‌లు, దేశ భక్తి సీన్లలో మెప్పించాడు. ఎమోషన్స్ పరంగానూ ఇరగదీశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రణ్‌వీర్‌ సింగ్‌ మూవీని ఎక్కడికో తీసుకెళ్లాడు. సారా అర్జున్‌ ఉన్నంతలో మెప్పించింది. ఎమోషనల్‌ సీన్లో బాగా చేసింది. ఎస్పీగా సంజయ్‌ దత్‌ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆయన కూడా బాగా చేశాడు. మేజర్‌ ఇక్బాల్‌గా అర్జున్‌ రాంపాల్ నటన కట్టిపడేస్తుంది. ఆర్‌ మాధవన్‌ నటన మతిపోయేలా ఉంటుంది. క్లైమాక్స్ లో అందరి చూపు అతనిపై పడుతుంది. ఎత్తుగడలు, క్లైమాక్స్ ట్విస్ట్ లో ఆయన నటన వాహ్‌ అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

67
ధురంధర్‌ 2 మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

టెక్నీకల్‌గా సినిమా చాలా బాగుంది. స్టయిలీష్‌గా తీశాడు దర్శకుడు ఆదిత్య ధార్‌. టేకింగ్‌ పరంగా తన టాలెంట్‌ని చూపించారు. చాలా ఇంటెన్సిటీతో రూపొందించారు. కథని చాలా డిటెయిలింగ్‌గా చెప్పాడు. డైలాగ్‌లు అదిరిపోయాయి. స్క్రీన్‌ ప్లే వేరే లెవల్‌. కాకపోతే నిడివి విషయంలో, సాగదీత విషయంలో బాగా చూసుకోవాల్సింది. క్లైమాక్స్ షార్ట్ గా తీయాల్సింది. ఆ సమయంలో వచ్చే డైలాగులు బాగున్నాయి. షాశ్వంత్‌ సచ్‌దేవ్‌ మ్యూజిక్‌ బాగుంది. వికాష్‌ నౌలఖా కెమెరి వర్క్ బాగుంది. కెమెరా యాంగిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌ కి పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు.

77
ఫైనల్‌గా

 ధురంధర్‌ 2 మూవీ అదిరిపోయింది. బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుందని చెప్పొచ్చు. కానీ మొదటి పార్ట్ రేంజ్‌లో లేదు. దాన్ని మించి అసలే లేదు. భారీ అంచనాలతో వచ్చిన వారిని కొంత డిజప్పాయింట్‌ చేస్తుంది. నిడివి కూడాకట్‌ చేయోచ్చు. 

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories