Valentine Day : ప్రేమికుల రోజు మీ పార్ట్నర్ మీ నుంచి ఇలాంటివే కోరుకుంటారు..

First Published | Feb 3, 2022, 11:53 AM IST

Valentine Day : ప్రేమలో పడిన వారికి ప్రతిరోజూ సమ్ థింగ్ స్పెషలే. అందుకే లవ్ లో ఉన్నవారు ఈ లోకంతో సంబంధంలేనట్టుగా ప్రవర్తిస్తుంటారు. అందులోనూ ప్రేమికుల రోజు వారికి ఎంతో ప్రత్యేకమైంది. ఆ రోజు కోసం ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటారు. అంతేకాదు.. వారి పార్ట్నర్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు.
 

Valentine Day : ప్రేమలో పడిన వారికి మరింత ప్రేమను వ్యక్తపరచడానికి, ఒకరిపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి  వాలంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజునే తమ లవ్ మ్యాటర్ ను చెప్పడానికి చాలా మంది ప్రేమికులు ఆసక్తి చూపుతుంటారు. కారణం.. వాలంటైన్స్ డే రోజున తమ లవ్ ను వ్యక్తపరిస్తే.. తమ ప్రేమ విఫలం కాదని వారి గట్టినమ్మకం. అంతేకాదు ఆ రోజున వారి ప్రేమను తెలిపితే.. వారి మధ్యనున్న ప్రేమ మరింత బలపడుతుందని కపుల్స్ గట్టిగా నమ్ముతుంటారు.
 


ఈ నేపథ్యంలో చాలా మంది ప్రేమికులు Confusion లో ఉంటున్నారు. అంటే ప్రేమికుల రోజు వారిని ఎలా Surprise చేయాలి. ఎలాంటి పనులు చేస్తే వారి పార్ట్నర్స్ సంతోషిస్తారు. ఎలాంటి బహుమతులిస్తే బాగుంటుందోనంటూ తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి వాలెంటైన్స్ రోజున మీ పార్ట్నర్స్ కు ఎలాంటి గిఫ్టులిస్తే వాళ్లు సంతోషిస్తారో ఇప్పుుడు తెలుసుకుందాం.


వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. చాలా మంది తమ లవర్లకు జ్యువెలరీ సెట్స్, రింగ్స్, మెన్స్ వాలెట్స్. ఫోటో ఫ్రేమ్స్ , బెల్టులు వంటివే ఎక్కువగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇదంతా పాతకాలం నాటి ముచ్చట. అందుకే రొటీన్ గా కాకుండా మీ  Partner ను   Surprise చేయడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీ భాగస్వామికి మీరే స్వయంగా తయారు చేసి బహుమతినివ్వండి. దీని వల్ల వారు ఎంతగానో సంతోషిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే మీ భాగస్వామిని సంతోషపెట్టేలా ఏదైనా మంచి బహుమతిని తయారు చేసే పనిపెట్టుకోండి. ఇలా వద్దనుకుంటే వాలెట్, రిస్ట్ వాచ్ వంటి బహుమతులు కూడా వారిని సంతోష సాగరంలో విహరించేలా చేస్తాయి. 
 

ఒకరిపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరచడానికి మీరేం చేస్తారంటే ఏం చెప్తారు.. హా ఏముంది.. ఫోన్  ద్వారానో, వాట్సాప్ మెసేజ్ ల రూపంలోనే చెప్తామంటారు కదూ.. కానీ మన ప్రేమను వ్యక్త పరచడానికి లవ్ లెటర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి తెలుసా.. అవును మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి వారిపై మనకున్న ఫీలింగ్స్ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పడంలో లవ్ లెటర్స్ ఎంతగానో సహాయపడతాయి. పూర్వకాలంలో ప్రేమను తెలపడానికి ఈ లవ్ లెటర్స్ నే ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే వాలెంటైన్స్ రోజున మీ ప్రేమను తెలపడానికి లవ్ లెటర్ ను ఇచ్చి వారిని ఆశ్యర్యపరచండి. 

lover

ప్రేమికుల రోజున లవర్స్ , కానీ కపుల్స్ గానీ ఎక్కువగా వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఇక అబ్బాయిలైతే వారి పార్ట్నర్స్ తో పార్కులకు వెళ్లాలని ఆశపడితే.. అమ్మాయిలేమో షాపింగ్ మాల్స్ కు, సినిమాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేయాలని కలలుగంటారు. మరికొందరైతే ఆ రోజున రొమాంటిక్ గా గడపాలని అనుకుంటూ ఉంటారు.
 

వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమికులు వాళ్ల లవర్లకు చాక్లెట్లను ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు చాక్లెట్లనే ఎక్కువగా తింటూ ఉంటారు. మీ ప్రియురాలికి కూడా చాక్లెట్లు ఇష్టముంటే వారికి తియ్యని చాక్లెట్లను బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి. వీటిని ఇవ్వడం వల్ల మీ భాగస్వామి ఎంతో సంతోషిస్తుంది తెలుసా.. 
 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ పనులు ఉంటూనే ఉంటాయి. అందుకే వాలెంటైన్స్ డే రోజున మీ భాగస్వామితో లేదా లవర్ తో సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. సాధారణంగా ప్రేమికుల రోజున లవర్స్ కలిసి సమయాన్ని గడపాలని ఆశపడుతుంటారు. అందుకే మీరు కూడా మీ ప్రియుడు లేదా ప్రేయసితో ఏకాంతంగా సమయాన్ని గడిపేందుకు క్యాండిల్ లైట్ డిన్నర్ వంటి వాటిని ప్లాన్ చేసుకోండి. 

Latest Videos

click me!