వానలు పడుతున్నప్పుడు ఈ కూరగాయలను అస్సలు తినకూడదు.. లేదంటే రోగాల బారిన పడతారు జాగ్రత్త..

First Published Sep 25, 2022, 9:46 AM IST

కూరగాయల నుంచి మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. కానీ వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. లేదంటే జబ్బు బారిన పడతారు. 
 

మాంసం కంటే కూరగాయలే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తాయి. వీటి ద్వారే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అందుకే కూరగాయలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ  సంగతి పక్కన పెడితే.. వానలు పడుతున్నప్పుడు పకోడిలీ, వేడి వేడి బజ్జీలు లేదా టీ, కాఫీలను తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే వీటిని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా వానాకాలంలో కొన్ని రకాల కూరగాయలను కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

వంకాయ

వంకాయ మన ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీటిని రెయినీ సీజన్ లో తినకపోవడమే మంచిది. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉండే ఈ వాతావరణంలో వంకాయకు పురుగు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. అయితే వంకాయలో ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి కీలకాల నుంచి రక్షిస్తాయి. అయినప్పటికీ ఈ రసాయన సమ్మేళనాలు ఆల్కలాయిడ్ అలెర్జీకి కారణమవుతుంది. దీన్ని తినడం వల్ల వికారం, చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. 

ఆకు కూరలు

ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి అన్నో విటమిన్ల లోపాలను పోగొడుతాయి. కానీ వర్షాకాలంలో ఆకు కూరలను తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే వర్షాకాలంలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సంతాతోత్పత్తి చేస్తాయి. అవి కూడా ఆకులపైనే. వీటిని ఎంత కడిగినా.. అన్నీ తొలగిపోవు. అందుకే వర్షాకాలంలో ఆకు కూరలను తినకపోవడమే బెటర్.
 

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ వంటలు ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని వివిధ వంటల్లో వేస్తుంటారు. కానీ ఈ కాలీఫ్లవర్ లో గ్లూకోసినోలేట్స్ అని పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వానలు పడుతున్నప్పుడు వీటిని తింటే అలెర్జీ వస్తుంది. 
 

బెల్ పెప్పర్

రంగు రంగుల్లో ఉండే క్యాప్సికం వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కానీ వీటిని వర్షాకాలంలో తినకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ కూరగాయలను నమిలినప్పుడు వాటిలోని గ్లూకోసినోలేట్లు ఐసోథియోసైనేట్ లుగా మారుతాయి. దీనివల్ల వికారం, వాంతులు, విరేచనాలు, శ్వాస సమస్యలు వస్తాయి. అందుకే వీటిని వానలు పడుతున్నప్పుడు తినకపోవడే మంచిది. 
 

ఏమి తినాలి

బెండకాయలు, సొరకాయ, బీన్స్, దోసకాయ, టమాటాలు వంటి కూరగాయలను తినడం మంచిది. ఎందుకంటే ఈ కూరగాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి. 

click me!