ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తొందరగా పోతాయట

First Published Sep 24, 2022, 4:21 PM IST

కళ్ల కింద నల్లటి వలయాలు వివిధ కారణాల వల్ల ఏర్పడుతాయి. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే..
 

అందంగా మెరిసే చర్మం, మచ్చలని లేని ముఖం ఉండాలని  ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ ఒత్తిడితో కూడిన లైఫ్ కారణంగా చాలా మంది చర్మం కాంతిహీనంగా.. ముఖం నిండా మొటిమలు మచ్చలతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, తీరిక లేని పనుల వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. ఇక వీటికి ఎంత మేకప్ వేసుకున్నా... ఎంతో స్ఫష్టంగా కనిపిస్తాయి. అయితే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో డార్క్ సర్కిల్స్ ను సులువుగా వదిలించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి. 

బాదం నూనె 

కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను వదిలించుకోవడానికి బాదం నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రాత్రి మీరు పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని డార్క్ సర్కిల్స్ పై అప్లై చేసి.. కొద్ది సేపు చిన్నగా మసాజ్ చేయండి. దీన్ని రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయం నీట్ గా ముఖం కడగండి. ఆ తర్వాత కొద్దిసేపయ్యాక మీ కళ్లు తేమగా మారడాన్ని గమనిస్తారు. దీనికి కారణం బాదంనూనె. అయితే ఇలాగే బాదం నూనెను డార్క్ సర్కిల్స్ కు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

గ్రీన్ టీ

రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. అయితే గ్రీన్ టీ తాగాక అవసరం లేదని టీ బ్యాగులను పారేస్తుంటారు. ఇప్పటి నుంచి ఆ పనిచేయకండి. ఎందుకంటే ఈ టీ బ్యాగులతో డార్క్ సర్కిల్స్ కు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో పెట్టండి. అవి చల్లగా అయిన తర్వాత కళ్లపై 15 నిమిషాలు పెట్టండి. ఈ టీ బ్యాగులు కళ్ళ కింద నల్లటి మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.

కీరదోసకాయ 

కీర దోసకాయలో వాటర్ కంటెంట్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తేమగా ఉంచుతాయి. అంతేకాదు రెగ్యులర్ గా వీటిని వాడటం వల్ల డార్క్ సర్కిల్స్ కూడా వదిలిపోతాయి. ఇందుకోసం కీరాలను గుండ్రంగా కోసి అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టండి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మీ కళ్ల కింద నల్లటి వలయాలపై పెట్టండి. తర్వాత చల్లటి నీటితో కళ్లను శుభ్రంచేసుకోండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తొందరగా వదిలిపోతాయి. 

dark circles


బంగాళదుంపలు

ప్రతి వంటగదిలో బంగాళాదుంపలు పక్కాగా ఉంటాయి. మీకు తెలుసా బంగాళాదుంపలతో కూడా డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు బంగాళాదుంపలను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి. ఈ రసంలో దూదిని ముంచి కళ్ల చుట్టూ అప్లై చేయండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కళ్లను కడగండి. దానిపై మంచి అండర్ ఐ క్రీమ్ ను అప్లై చేయండి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తొందరగా వదిలిపోతాయి.
 

click me!