మధుమేహులు ఖర్జూరాలను తినొచ్చా?

First Published Sep 24, 2022, 4:55 PM IST

వన్స్ మధుమేహం బారిన పడితే.. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలంతే.. ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. 
 

dates

షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చెక్కెర స్థాయిలను ఉన్నపాటుగా పెంచేస్తాయి. దీనివల్ల వీరి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. మంచి పోషకాహారాన్ని తింటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి కాబట్టి మధుమేహులు ఖర్జూరాలను తినకూడదని చెప్పే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖర్జూరాలను తింటే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. 

dates

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందులోనూ ఈ పండ్లు బలే టేస్టీగా ఉంటాయి. అందుకే పెద్దల నుంచి చిన్నపిల్లలకు వరకు వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి. 

dates

క్యాన్సర్ నివారిణీ

ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ప్రమాదకరమైన జబ్బులను, క్యాన్సర్లను నివారిస్తాయి. తీపి పదార్థాలను తినాలన్న కోరిక వచ్చినప్పుడు మధుమేహులు వీటిని తినండి. రోజూ కొన్ని ఖర్జూరాలను తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. 

ఎముకలు బలోపేతం అవుతాయి

ఖర్జూరాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే బోలు ఎముకల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీ శరీరంలో మెగ్నీషియం లోపించినప్పుడే ఈ వ్యాధి బారిన పడతారు. అంతేకాదండోయ్ ఈ ఖర్జూరాల్లో రక్తాన్ని పెంచే ఐరన్ కంటెంట్.. ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని లిమిట్ లో రోజు తినండి. మీ ఎముకలను బలంగా ఉంచుకోండి. 
 

షుగర్ లెవెల్స్ కంట్రలో లో ఉంటాయి

సాధారణంగా ఖర్జూరాలు తియ్యగా ఉంటాయని రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయిని వీటిని పక్కన పెట్టేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఏ మాత్రం పెంచవు గాక పెంచవు. బదులుగా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి కూడా. అలా అని వీటిని ఎక్కువగా తినేయకూడదు. షుగర్ పేషెంట్లు 3 ఖర్జూరాలకు మించి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!