Health Tips: మీరు అలసిపోయినప్పుడు వీటిని మాత్రం తినకండి.. తిన్నారో మీ పని అంతే..

Published : Jun 02, 2022, 10:29 AM IST

Health Tips: చాలా మంది..  అలసిపోయినప్పుడు టీ లేదా కాఫీ లాంటివి తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నిజానికి బాగా అలసిపోయినప్పుడు అలాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అలసిపోయినప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో తెలుసుకుందాం పదండి. 

PREV
19
Health Tips: మీరు అలసిపోయినప్పుడు వీటిని మాత్రం తినకండి.. తిన్నారో మీ పని అంతే..

కాఫీ (Coffee).. చాలా మంది బాగా అలసిపోయినప్పుడు కాఫీ తాగుతారు. కాఫీ మనల్ని చురుగ్గా చేస్తుందని.. ఇది రోజంతా మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుందని భావిస్తుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. వాస్తవానికి  కాఫీ మిమ్మల్ని కాసేపు మాత్రమే చురుకుగా ఉంచుతుంది. ఆ తరువాత అలసిపోతారు.  మీరు చాలా టైర్డ్ (Tired) గా ఉంటే మాత్రం కాఫీ తాగకండి.  దీనికి బదులుగా చక్కెర లేదా పాలు లేకుండా ఒక కప్పు టీ లేదాఒక గ్లాసు తాజా నిమ్మరసం తీసుకోండి.

29
cheese

జున్ను (Cheese) : ప్రాసెస్ చేసిన జున్నులో సంతృప్త కొవ్వులు, సోడియం మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. అన్ని రకాల జున్ను మీకు శక్తిని ఇస్తున్నట్లు అనిపించినప్పటికీ, దీని దుష్ప్రప్రభావాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. జున్ను జీర్ణం కావడం చాలా కష్టం. ఎందుకంటే దీనికి చాలా శక్తి అవసరం అవుతుంది.  కాబట్టి మీరు అలసిపోయినప్పుడు జున్ను తినకండి.
 

39

వైట్ షుగర్ (White Sugar): షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. వాస్తవానికి మీరు చక్కెరను ఎక్కువ తినడం వల్ల మీకు మంచిగా  అనిపించినా.. ఇది మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా అలసిపోయిన వెంటనే ఐస్ క్రీములు, పేస్ట్రీలు లేదా డోనట్లను తీసుకోకండి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. 

49

ఎర్ర మాంసం (Red meat): సాయంత్రం వేళ రెడ్ మీట్ ను తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎర్ర మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందులోనూ సాయంత్రం తర్వాత దీన్ని తింటే అంత త్వరగా జీర్ణం కాదు. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. అలాగే ఇది మిమ్మల్ని తర్వగా అలసిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా మీరు అలసిపోయినప్పుడు ఎట్టి పరిస్థితిలో రెడ్ మీట్ ను తినకండి. 
 

 

59

గ్లూటెన్ ఫుడ్స్ (Gluten-free foods): గ్లూటెన్ ఉన్న ఆహారాలు జీర్ణం కావడం చాలా కష్టం. ఇవి అరగడానికి ఎక్కువ మొత్తంలో కడుపులో ఆమ్లాలు అవసరం. ఈ ఆహారాలను తిన్నా, వేడి కారణంగా అవి జీర్ణం కావు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

69
Soda

సోడాలు  (Soda): మనం తినే సోడాలో ఎక్కువ మొత్తంలో  చక్కెర లేదా Aspartame ఉంటుంది. ఈ రెండు ఉత్పత్తులు మీరు త్వరగా అలసిపోయేలా చేస్తాయి. కాఫీ మాదిరిగానే ఇవి కూడా మీకు కాసేపు శక్తిని ఇచ్చినా.. ఆ తర్వాత మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. అందుకే వీటిని నివారించండి. 

79

రెడీ టు ఈట్ ఫుడ్ (Ready to eat food): రెడీ టు ఈట్ ఫుడ్ మన ఆరోగ్యానికి, మన శరీరానికి, మన ఎనర్జీ లెవల్స్ కు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిని జీర్ణించుకోవడం చాలా కష్టం కాబట్టి. దీనిలో ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఇంట్లో వండిన భోజనాన్నే చేయండి.
 

89

ఆల్కహాల్ (Alcohol): ఆల్కహాల్ ఏ రకంగా మీ  ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా సాయంత్రం వేళ దీన్ని తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే దీన్ని తాగడం వల్ల రాత్రుళ్లు నిద్ర ఉండదు. అంతేకాదు ఆల్కహాల్ ను తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది మన శరీరాన్ని మరింత అలసిపోయేలా చేస్తుంది.
 

99

తృణధాన్యాలు (Cereals):మీరు అలసిపోయినప్పుడు వైట్ బ్రెడ్ (White bread), తృణధాన్యాలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది అలాగే వీటికి శక్తి కూడా చాలా ఎక్కువ అవసరం. కాబట్టి మీరు అలసిపోయినప్పుడు అన్నం, పాస్తా లేదా Semolina తినడం మానుకోండి.

 

Read more Photos on
click me!

Recommended Stories