Health Tips: ఉదయాన్నే మిల్క్ పౌడర్ తో చేసిన టీ, కాఫీలను తాగుతున్నారా? అదెంత డేంజరో తెలుసా?

Published : Jun 02, 2022, 09:33 AM IST

Health Tips: కొంతమంది పాలతో టీ కాఫీలు చేసుకుని తాగితే మరికొంత మంది మాత్రం పాలపొడి (milk Powder)తో తయారుచేసుకుని తాగుతుంటారు. అయితే పాలపొడి టీని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.   

PREV
17
Health Tips: ఉదయాన్నే మిల్క్ పౌడర్ తో చేసిన టీ, కాఫీలను తాగుతున్నారా? అదెంత డేంజరో తెలుసా?

భారతదేశంలో చాలా మంది టీ తోనే రోజును ప్రారంభిస్తుంటారు. అందులోనూ టీ తాగకుండా మంచం కూడా దిగని చాలా మందే ఉన్నారుు. ఇకపోతే టీ, కాఫీలకు పట్టణాల్లో ప్యాకెట్ పాలను ఉపయోగిస్తే.. గ్రామాల్లో నేరుగా ఆవు పాలనే యూజ్ చేస్తుంటారు.  అయితే ఈ పాలకు బదులుగా పాల పొడి ( milk Powder) ను కూడా ఉపయోగించే వారు మరికొందరు ఉన్నారు. 

27

పాలను తీసుకురావడానికి  వీలులేకనో  మరో కారణం చేతనో కానీ కొంతమంది మాత్రం టీ, కాఫీలను పాల పౌడర్ తోనే తయారుచేసుకుని తాగుతుంటారు. అందులోనూ పాలపౌడర్ చాలా మంచిదని చెప్పే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకి పాల పౌడర్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి. 

37

మిల్క్ పౌడర్ తయారీ: మిల్క్ పౌడర్ మన బరువును పెంచడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ దీన్ని ఎలా తయారుచేస్తారంటే.. పాలపొడిలో పాల పరిమాణం సుమారు 87.3 శాతం ఉంటుంది. నీటి శాతం 3.9 శాతంగా ఉంది. పాలలో 8.8 శాతం కొవ్వు మరియు ప్రోటీన్, పాల చక్కెర, ఖనిజాలు మొదలైనవి ఉంటాయి. మిల్క్ పౌడర్ తయారు చేయడానికి, పాలను వేడి చేస్తారు. వాస్తవానికి ఈ పాల పొడి ఆవిరి పాలు. ఇది మరింత మందంగా ఉంటుంది.  ప్రాసెస్ కూడా చేయబడుతుంది.

47

పాలపొడితో తయారు చేసిన టీ లేదా కాఫీ యొక్క దుష్ప్రభావాలు:

అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది:  కొలెస్ట్రాల్ తో కూడిన ఆహారం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పాల పొడి మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచేస్తుంది. అంతేకాదు ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇది మీ ధమనులలో చేరడంతో పాటుగా..రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది.

57

డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచిది కాదు: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాల పొడిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి పాల పొడిలో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. 
 

67

డైట్ ను ఫాలో అయ్యేవారు పాల పొడికి దూరంగా ఉండాలి:  బరువు తగ్గాలనుకునే వారు  డైట్ ను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా వీళ్లు ఒంట్లో కొలెస్ట్రాల్ ను పెంచే  ఆహారాలకు దూరంగా ఉంటారు. కాగా పాల పొడి కొలెస్ట్రాల్ పాలు. దీనిలో మంచి కొవ్వు అసలే ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు వీటికి దూరంగా ఉండటమే మంచిది. 

77

పాలపొడిలో కాల్షియం ఉండదు: చూర్ణం చేసిన పాలలో సాధారణ పాల కంటే తక్కువ కాల్షియం ఉంటుంది. పాలపొడిని సరిగ్గా నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంది. తాజా పాలలో విటమిన్ బి 5 , బి 12 వంటి పోషకాలు ఉంటాయి. అయితే ఇది పాల పొడిలో ఉండదు. తాజా పాలలో ఫాస్ఫరస్, సెలీనియం పరిమాణం పాల పొడి కంటే ఎక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories