ప్రపంచ దోమల దినోత్సవం 2022: దోమల వల్ల వ్యాపించే 5 ప్రాణాంతక వ్యాధులు..

Published : Aug 20, 2022, 04:12 PM IST

ఆడ అనాఫిలిస్ దోమలే మలేరియా పరాన్ని జీవిని మనుషులకు వ్యాప్తి చేస్తాయన్న విషయాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

PREV
17
ప్రపంచ దోమల దినోత్సవం 2022:  దోమల వల్ల వ్యాపించే 5 ప్రాణాంతక వ్యాధులు..

దోమలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంటూనే ఉన్నాయి. ఈ దోమలే పరాన్నజీవులకి వాహకాలుగా పనిచేస్తాయి. ఇక దోమ కాటు వల్ల వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దోమల వల్లే మలేరియా మనుషులకు వ్యాపిస్తుందని 1897 లో బ్రిటీష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. 
 

27

దోమకాటు వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలొస్తాయి. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, పసుపు జ్వరం, జికా వంటి రోగాలొస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. దోమ కాటు వల్ల ప్రతి ఏడాది ఏడు లక్షల మంది చనిపోతున్నారట. దోమల వల్ల కలిగే ఐదు ప్రాణాంతక రోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

డెంగ్యూ..

ప్రస్తుతం డెంగ్యూ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఇది ఆడ ఈడిస్ ఈజిస్టి దోమ వల్ల మనుషులకు సోకే వ్యాపించే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన 14 రోజులకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు వారం రోజుల పాటు ఉంటాయి. శరీర నొప్పులు, దద్దుర్లు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

47

పసుపు జ్వరం

పసుపు జ్వరం కూడా ఆడ ఈడిస్ట్ దోమ వల్ల సోకుతుంది. ఇది సోకితే విపరీతమైన చలి, జ్వరం, వెన్ను నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ పసుపు జ్వరం వస్తే వారం రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు. అయితే ఈ వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 30 వేలకు పైగా చనిపోతున్నారు. 

57

జికా

జికా వైరస్ కూడా ప్రాణాంతక వ్యాధి. ఇది దోమల ద్వారానే వ్యాపిస్తుంది. దీనిలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు కనిపించవు. అయితే ఈ జికా జ్వరం వల్ల డెండ్యూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. దద్దుర్లు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 

67

చికెన్ గున్యా

చికెన్ గున్యా కూడా ఒక్కోసారి ప్రాణాలను తీస్తుంది. దీనివల్ల కండరాల నొప్పి, కీళ్ల వాపు, కీళ్ల అసౌకర్యం, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ చికెన్ గున్యా ఒక వారంలోగా తగ్గిపోతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ లక్షణాలు నెలలు లేదా సంవత్సరాల పాటు ఉంటాయి. 

77

మలేరియా

మలేరియా కూడా చాలా మందిని బలికొంది. దీనివల్ల శరీరం విపరీతంగా నొప్పి, అధిక జ్వరం, చంచలత వంటి సమస్యలు కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..  ప్రపంచవ్యాప్తంగా 2022 లో 14 మిలియన్ల మలేరియా కేసులు నమోదుకాగా.. 69 వేల మంది చనిపోయారు.  

click me!

Recommended Stories