ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ ను తప్పకుండా తినండి

First Published Sep 25, 2022, 10:51 AM IST

కలుషితమైన గాలిని పీల్చడం, స్మోకింగ్ చేయడం వంటి వివిధ కారణాల వల్ల నేడు ఎంతో మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. 
 

lungs

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 25 నాడు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చెడు జీవన శైలి వల్ల నేడు ఎంతో మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు.  సిగరేట్లు కాల్చడం, కలుషితమైన గాలిని పీల్చడం, జీవన శైలిలో మార్పుల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అలవాట్లను వదిలేస్తే మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..

బెర్రీలు

బెర్రీల్లో దివ్య ఔషదగుణాలుంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు వంటి బెర్రీలల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

ఆకు కూరలు

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఆకు కూరలు ఎంతో ఉపయోగపడతాయి. బచ్చలికూర, క్యాబేజీ, బోకోలి, మోరింగా ఆకులు మొదలైనవాటిలో ఊపిరితిత్తులకు మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ కూర గాయలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించడంలో కూడా సహాయపడతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 

టమాటాలు

టమోటాల్లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే అప్పుడప్పుడు టమాటా జ్యూస్ ను తాగండి. 
 

బీట్ రూట్

బీట్ రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పుష్కలంగా ఉండే నైట్రేట్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండే బీట్ రూట్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

ఆపిల్

రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు నిపుణులు. అవును మరి దీనిలో ఉండే ఔషదగుణాలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ బి, కాల్షియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

పసుపు

పసుపును సర్వ రోగ నివారిణీ. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పసుపు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వైరస్ కు వ్యతిరేకంగా పోరాడగల సామర్థ్యం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 
 

click me!