World hypertension day 2022: అధిక రక్తపోటును ఇలా నియంత్రించండి..

Published : May 17, 2022, 11:39 AM ISTUpdated : May 17, 2022, 11:42 AM IST

world hypertension day 2022: ప్రతి సంవత్సరం మే 17 న ప్రపంచ వ్యాప్తంగా  ప్రపంచ హైపర్ టెన్షన్ డేను జరుపుకుంటారు. అధిక రక్తపోటుకు ప్రధాన కారణం హైపర్ టెన్షన్. అధిక రక్తపోటును ఎలా నిర్ధారించాలి? ఏ వయస్సులో సమస్య కనిపిస్తుంది? దీనిని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.

PREV
18
World hypertension day 2022: అధిక రక్తపోటును ఇలా నియంత్రించండి..

అధిక రక్తపోటు సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవనం, పేలవమైన ఆహారం, మద్యపానం, ధూమపానం (smoking) అలవాట్లు మొదలైన అనేక కారణాల వల్ల అధిక రక్తపోటు వస్తుంది. రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే ‘అధిక రక్తపోటు’ అని అంటారు.  

28

స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి గుండె సంబంధిత సమస్యలకు అధిక రక్తపోటే ప్రధాన కారణం. రక్తపోటు నియంత్రణలో లేకపోతే వీటితో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

38

అధిక రక్తపోటును ఎలా నిర్ధారించాలి.. కొంతమంది అధిక రక్తపోటు ఉంటే ఛాతీ నొప్పి, మైకము, కళ్లు మసకబారడం మొదలైన సంకేతాల్లో కనిపించవచ్చు. అటువంటి సందర్భాల్లో మీరు డాక్టర్ వద్దకు వెళ్లి టెస్ట్ ను చేయించుకోవాలి. అధిక రక్తపోటు లక్షణాలు ఉన్న రోగులను కొన్ని సార్లు ఈసీజీ, కరోటిడ్ డాప్లర్, రీనల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, కంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు.
 

48

ఏ వయస్సులో ఈ సమస్య వస్తుంది.. సాధారణంగా అధిక రక్తపోటు సమస్య 45 ఏండ్ల వయస్సు తర్వాతే వస్తుంది. కానీ ఇప్పుడు జీవనశైలి పూర్తిగా మారిపోయింది. అందుకే చిన్న వయసు వారు సైతం దీని బారిన పడుతున్నారు. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు ఒత్తిడితో కూడిన జీవితం గడపడం, టైం ప్రకారం ఆహారం తీసుకోకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, పొగతాగే అలవాటు, మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వంటి కారణాలతో  అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. 
 

58

మద్యపానం ఎక్కువగా తాగడం, స్మోకింగ్ చేసే వ్యక్తులు సైంతం అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది.  అధిక బరువు, ఊబకాయంతో సమస్యను ఎదుర్కొనే వారు కూడా అధిక రక్తపోటు బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వేసుకునే వారు, స్టెరాయిడ్లు ఉపయోగించే వారు కూడా అధిక రక్తపోటు బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే వ్యక్తులు కూడా అధిక రక్తపోటుకు గురికావొచ్చు. 

68
World Hypertension Day

అధిక రక్తపోటును ఎలా నియంత్రించాలి.. వయసు మీద పడుతున్నవారిలో ఈ సమస్య కనిపించడం సర్వ సాధారణ విషయం. 30 లేదా 40 ఏండ్ల వయసులో రక్తపోటు సమస్య కనిపించినట్టైతే.. అది 50 సంవత్సరాల వయస్సు తరువాత అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది ప్రారంభంలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలను చూపించకుండా మీరు పెద్దయ్యాక సమస్యలు చూపిస్తుంది. అందుకే లక్షణాలు కనిపించినవెంటనే సరైన చికిత్సను ప్రారంభించండి. 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా క్రమం తప్పకుండా చెకప్ లు మరియు మందులు వేసుకోవడం అవసరం.

78

గుండె రక్తనాళాలకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలకు టమోటాలు తీసుకోవడం మంచిదని ఒక అధ్యయనంలో తేలింది. టమోటాలు తింటే కూడా బీపీ తగ్గుతుంది. అంతేకాదు ఒత్తిడికి గురికాకూడదు.  యోగా, ధ్యానం వంటివి చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది అందరిలో ఒకే విధంగా ప్రభావం చూపదు. అందుకే వైద్యుడి సలహాలను తీసుకోవాలి.

88

జీవనశైలి ఎలా ఉండాలి?

- అన్ని రకాల ఆహారాలను తీసుకోండి. ఉప్పును మోతాదుకు మించి తినకూడు.

-  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం నియంత్రించాలి. ఎక్కువగా తాజా పండ్లలను, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. 

- బరువును నియంత్రించుకోవాలి. శారీరక వ్యాయామం చేయాలి. బరువు అధికంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారుతుంది.

-  మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

- తగినంత నిద్ర పోవాలలి.  ధ్యానం చేయడం, క్రమం తప్పకుండా యోగా చేయడం మర్చిపోవద్దు.

Read more Photos on
click me!

Recommended Stories