mangoes: మామిడి పండ్లను తిన్నాకా ఈ ఫుడ్స్ ను మాత్రం తినకండి.. చాలా ప్రమాదకరం..!

Published : May 17, 2022, 09:44 AM IST

mangoes: పండ్లలో రారాజైన మామిడి పండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో.. అందులోనూ ఈ  పండ్లు ఈ సీజన్ లోనే లభిస్తాయి. అందుకే ఇష్టమున్నన్ని పండ్లను లాగించేస్తుంటారు. అయితే దీన్ని తిన్న తర్వాత కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..   

PREV
18
mangoes: మామిడి పండ్లను తిన్నాకా ఈ ఫుడ్స్ ను మాత్రం తినకండి.. చాలా ప్రమాదకరం..!

mangoes: పండ్లలో రారాజైన మామిడిపండుకున్న క్రేజ్ మరే పండుకు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కమ్మని వాసనతో, నోరూరించే రుచితో అందరిని ఊరిస్తుంటుంది. అందులోనూ వేసవి మామాడి పండ్ల సీజన్. ఇంకేముంది మార్కెట్ లో లభించే వివిధ రకాలైన బంగిన పల్లి, నీలాలు, చెరకు రసం, సువర్ణ రేఖ, పెద్ద రసం వంటి మామిడి పండ్లను కొనేస్తుంటారు. 
 

28

మామిడి పండ్లు రుచికే కాదు.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటుగా శక్తిని కూడా అందిస్తాయి. 
 

38

మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాదు ఓవర్ వెయిట్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.  ఇన్నిఉపయోగాలున్న మామిడి పండ్లను తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని వేళ తీసుకున్నా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ మామిడి పండ్లను తిన్న తర్వాత ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

48

పెరుగు (Yogurt).. మామిడి పండ్లను తిన్న తర్వాత పెరుగును(Yogurt) తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.  పెరుగును, మామిడి పండును కలిపి తీసుకుంటే మన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా తయారయ్యి అనేక సమస్యలకు దారి తీస్తుంది. 

58

కారం (Spicy Foods).. తియ్యని మామిడి పండ్లను తిన్న వెంటనే ఎక్కువ కారంగా ఉండే ఆహారాలను తింటే చర్మ, ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

68

కాకరకాయ (Butterguard).. మ్యాంగోస్ తిన్న తర్వాత కాకరకాయతో చేసిన వంటకాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండును తిన్న వెంటనే కాకరకాయను తినడం వల్ల శ్వాస్ తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, వికారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

78
soft drinks

శీతర పానీయాలు (Soft drinks).. వేడి తాపం నుంచి బయటపడేందుకు చాలా మంది ఈ వేసవిలో శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. నిజానికి వీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఏరి కోరి కొని తెచ్చుకున్నట్టే. వీటికి బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం బెటర్. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ శీతల పానీయాలను మామిడి పండ్లను తిన్న వెంటనే అస్సలు తాగకూడదు. ఎందుకంటే శీతల పానీయాల్లో, మామిడి పండ్లు రెండింలో షుగర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ రెండింటినీ వెంట వెంటనే తీసుకుంటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇది మధుమేహులకు డేంజర్. 

88

నీళ్లు (water).. మామిడి పండ్లను తిన్న తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఇది పేగుల్లో ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఒక వేళ తాగాలనకుంటే అరగంట వెయిట్ చేయాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories