మధుమేహుల ఆహారంలో ఇవి ఖచ్చితంగా ఉండాలి..

First Published | Nov 14, 2022, 2:37 PM IST

మధుమేహులు అందరిలా ఏవి పడితే అవి తినడానికి  లేదు. పిండి పదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను, శక్తి లేని ఆహారాలను తక్కువగా తినాలి. పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని ఎక్కువగా తినాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

diabetes

మధుమేహాన్ని నియంత్రించాలంటే ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఆహారం పాత్ర చాలా ఉందని నిరూపించబడింది. షుగర్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో. ఏవిపడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. వీళ్లు పిండి పదార్థాలు తక్కువగా ఉండే వాటినే తినాలి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. ఎనర్జీ ఇవ్వని ఆహారాలను అసలే తినకూడదు. పోషకాలు పుష్కలంగా ఉండే వాటినే తినాలి. డయాబెటీస్ నియంత్రణలో ఉండాలంటే.. మధుమేహులు రోజూ ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం.. 

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి మధుమేహులకు మెడిసిన్స్ తో సమానం. ఎందుకంటే ఈ పండ్లను తినడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు  బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ అధ్యయనాల ప్రకారం.. సిట్రస్ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలవని వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ఈ పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, పొటాషియం, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. 
 


పెరుగు

పెరుగు కూడా మధుమేహులకు చాలా మంచిది. టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో పెరుగు ఎంతో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉండే పెరుగు శరీర మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో కూడా రోజూ ఒక కప్పును పెరుగును తింటే వచ్చే  ఇబ్బందులేమీ ఉండవు. 
 

చియా విత్తనాలు

చియా విత్తనాలు.. సిల్వియా హిస్పానికా అనే మొక్క విత్తనాలు. ఇది దక్షిణ అమెరికా దేశాల్లో, మెక్సికోలో కనిపిస్తుంది. ఈ గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

nuts

నట్స్

గింజలు ప్రోటీన్లకు, విటమిన్లకు, ముఖ్యమైన ఖనిజాలకు మంచి వనరు. డైట్ మెయింటైన్ చేస్తున్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే ఆరోగ్యంగా బరువు తగ్గడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. 
 

బార్లీ

బార్లీ,  ఓట్ మీల్ వంటి తృణధాన్యాలను తింటే కూడా షుగుర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వీటిలో చాలా త్వరగా జీర్ణమయ్యే ఫైబర్స్ లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!