
గర్భిణిగా ఉన్న సమయంలో పోషకాహారం ఎంత అవసరమే.. ప్రసవించిన తర్వాత కూడా అంతే అవసరం. ఎందుకంటే తల్లిపాలే బిడ్డకు బలం. పాలు బిడ్డకు సరిపడినంతగా అందితేనే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. శరీరక, మానసిక ఎదుగుదల కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అందుకే తల్లిపాలు తక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. తల్లిపాలు సరిగ్గా అందకపోతే బిడ్దకు ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలు రావడంతో పాటుగా.. బ్రెయిన్ కూడా సరిగ్గా ఎదగదు. ప్రస్తుతం చాలా మంది తల్లుల్లో పాలు సరిగా ఉత్పత్తి కావడం లేదు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే తల్లుల్లో పాలు పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్ (Oats)
ఓట్స్ లో ఫైబర్, ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని పండ్లను మిక్స్ చేసి ఓట్స్ ను ను వండుకుని తింటే మంచిది. లేదా దీన్ని స్మూతీగా కూడా తీసుకోవచ్చు. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే తల్లిపాలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా పాస్ట్ గా కూడా అరుగుతాయి.
మెంతులు (fenugreek)
మెంతులు కూడా తల్లిపాలను పెంచడానికి సహాయపడతాయి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం నీటిని వడకట్టి తాగితే కొద్ది రోజుల్లోనే పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
బచ్చలికూర
తల్లిలో పాల ఉత్పత్తిని పెంచేందుకు బచ్చలికూర కూడా ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఐరన్ కంటెంట్ తల్లిలో రక్తహీనత సమస్యను కూడా పోగొడుతుంది. పాలిచ్చే తల్లులు రోజుకు ఒకసారైనా బచ్చలి కూరను తింటే మంచిది.
వెల్లుల్లి (garlic)
రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల హై బీపీ నుంచి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. వెల్లుల్లి రెబ్బలను అలాగే తిన్నా లేదా వంటల్లో వేసుకుని తిన్నా.. తల్లుల్లో పాలు పుష్కలంగా పెరుగుతాయి.
ఫ్రూట్ జ్యూస్ (Fruit juice)
పండ్ల రసాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలను తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పాలిచ్చే తల్లులు ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ పండ్ల రసాలను తరచుగా తాగాలి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా తల్లిపాలను కూడా పెంచుతాయి.
బాదం (almond)
బాదం పప్పుల్లో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం లు లాక్టేటింగ్ హార్మోన్లను పెంచడానికి సహాయపడతాయి.
బార్లీ (Barley)
బార్లీలో ఉండే బీటా గ్లూకోన్ బ్రెస్ట్ ఫీడింగ్ హార్మోన్ అయిన ప్రోలాక్టిన్ ను పెంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరాన్నిన హైడ్రేట్ గా ఉంచడానికి కూడా సహాయపడతుంది. ఇందుకోసం బార్లీ వాటర్ లేదా బార్లీ సూప్ ను కూడా తీసుకోవచ్చు.
ఆవు పాలు
పాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బిడ్డకు పాలిచ్చే తల్లులు రోజూ ఒక గ్లాస్ ఆవు పాలను తాగడం వల్ల వారిలో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు ఎముకలను, దంతాలను బలంగా ఉంచే కాల్షియం కూడా పెరుగుతుంది.