నవజాత శిశువులకు తల్లిపాలు ఉత్తమమైన ఆహారం. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ బాడీస్ ఎన్నో రకాల బాల్య వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాలొచ్చే ప్రమాదం తల్లులకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. అంతేకాదు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లుల్లో అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని గైనకాలజిస్టులు అంటున్నారు.