చరిత్ర ప్రకారం.. మొహర్రం నెలలోని మొదటి రోజు ఇరాక్ లో యుద్దం మొదలైంది. కాగా మొహర్రం పదో రోజున ఇమాం హుస్సేన్ నమాజ్ చేస్తున్న సమయంలో శత్రు సైన్యం దాడి చేసి ఆయన్ను హతమార్చింది. అంతేకాదు యజీద్ సైన్యం హుస్సేన్ కుటుంబాన్ని, పిల్లల్ని, మహిళలకు కూడా చంపేశారు. ఈ యుద్దంలో మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన 70 మంది ప్రాణాలు కోల్పోతారు. ఇంత మందిని చంపినందుకు గాను హజరత్ హుస్సేన్ శత్రు సైన్యానికి.. ఎప్పటికీ మోక్షం లభించకూడదని ప్రార్థిస్తూ చనిపోతాడు.