గర్భిణీలకు కుంకుమపువ్వుతో ఎన్ని ప్రయోజనాలో..

First Published | Aug 21, 2021, 1:51 PM IST

గర్భిణీలకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమపువ్వు వేసుకుని తాగితే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటారు. అయితే పిల్లల రంగును కుంకుమపువ్వు ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఆరోగ్య ప్రయోజనాల్ని మాత్రం కలిగిస్తుంది. 

ప్రెగ్నెన్సీ అనేది మహిళ జీవితంలో పునర్జన్మలాంటిది. గర్భిణిగా ఉన్న 9 నెలలు రకరకాల సమస్యలు, భావోద్వేగాలు... వెరసి రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. రకరకాల ఫుడ్ తినేలనే కోరికలు కలుగుతాయి. పుల్లగా, తీయగా, కారంగా... ఏదైనా తింటే బాగుండు అనే కోరికలు. దీనికి తోడు వాంతులు, వెన్నునొప్పి, వికారం లాంటివి సతాయిస్తాయి. మామూలుగా మూడునెలల వరకు వికారం, వాంతులు ఉంటాయి. ఆ తరువాత సర్దుకుంటాయి. కానీ కొంతమందిలో ఇది తొమ్మిది నెలల వరకు కొనసాగుతుంది. దీంతో తల్లి ఆరోగ్యం, పొట్టలోని శిశువు ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. అందుకే గర్భధారణ అనేది స్త్రీకి మళ్లీ జన్మలాంటిది అనేది. 

తల్లిగా కొత్త బాధ్యతల్లోకి అడుగుపెడుతుండడం.. దానికి సిద్ధమవ్వడం ఓ వైపు. మరోవైపు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం కలిసి గర్భవతుల్ని ఆందోళనలో పడేస్తాయి. డెలివరీ సరిగానే అవుతుందా? ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవలసి వస్తుంది? బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుందా? లాంటి అనేక సందేహాలూ ముప్పిరిగొంటాయి. వీటన్నింటినుంచి బయటపడాలంటే సమతుల ఆహారంతో పాటు, యోగా, ధ్యానంలాంటివి మానసిక ప్రశాంతతను కలిగించి, డెలివరీని సులభతరం చేస్తాయి. 


తల్లిగా కొత్త బాధ్యతల్లోకి అడుగుపెడుతుండడం.. దానికి సిద్ధమవ్వడం ఓ వైపు. మరోవైపు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం కలిసి గర్భవతుల్ని ఆందోళనలో పడేస్తాయి. డెలివరీ సరిగానే అవుతుందా? ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవలసి వస్తుంది? బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుందా? లాంటి అనేక సందేహాలూ ముప్పిరిగొంటాయి. వీటన్నింటినుంచి బయటపడాలంటే సమతుల ఆహారంతో పాటు, యోగా, ధ్యానంలాంటివి మానసిక ప్రశాంతతను కలిగించి, డెలివరీని సులభతరం చేస్తాయి. 

గర్భిణి సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం, మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండడం ఇవి ఆరోగ్యసమస్యల్ని దూరం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం అనంగానే గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినొద్దు.. అనే విషయాల్లో చాలా సందేహాలుంటాయి. అయితే ఈ తొమ్మిది నెలలూ కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడతారు. గర్భిణీలకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమపువ్వు వేసుకుని తాగితే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటారు. అయితే పిల్లల రంగును కుంకుమపువ్వు ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఆరోగ్య ప్రయోజనాల్ని మాత్రం కలిగిస్తుంది. 

కుంకుమపువ్వును ఆహారంలో చేర్చడం వల్ల మానసిక కల్లోలాలు తగ్గుతాయి. గర్భిణీ సమయంలో మానసిక అశాంతి మామూలు విషయమే. ఈ రెండింటికీ విడదీయరాని సంబంధం ఉంటుంది. హార్మోన్లలో వేగంగా మార్పులు కావడం, గర్భిణి సయమంలో శరీరంలో కలిగే అసౌకర్యాలు, మూడ్ స్వింగ్స్ దీనివల్ల చిరాకు, అశాంతి, ఆందోళనలు వెంటాడుతుంటాయి. వీటిని నియంత్రించడంలో కుంకుమ పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. కుంకుమపువ్వు సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని రక్త ప్రవాహాన్ని క్రమబద్దీకరించడం ద్వారా మానసిక స్థితిని మాడ్యులేట్ చేస్తుంది. భావోద్వేగపరమైన అప్ అండ్ డౌన్స్ ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 

గర్భిణులు ఎదుర్కొనే మరో సమస్య నిద్రలేమి. సరిగా నిద్ర పట్టకపోవడం, అనీజీగా ఉండడం కనిపిస్తాయి. ఈ లక్షణాలను తగ్గించి చక్కటి నిద్ర పట్టాలంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

హార్మోన్లలో మార్పుల కారణంగా, గర్భధారణ సమయంలో తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లు మామూలుగా ఉంటాయి. మరికొన్నిసార్లు తీవ్రమైన దురదతో ఉండి, భరించలేకుండా ఉంటాయి. కుంకుమపువ్వుతో ఈ తిమ్మిరిని సులభంగా నివారించవచ్చు.

ఎందుకంటే కుంకుమపువ్వులో నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి, శరీరంలోని కండరాల నొప్పిని తగ్గించడంలో పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా ఉండే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

కుంకుమపువ్వు గుండె పనితీరును పెంచుతుంది.  గర్భధారణ సమయంలో ఆహారం మీద కలిగే కోరికలు, అధిక ఆకలి మీ క్యాలరీలను అధికం చేస్తాయి. ఇవి అటోమెటిగ్గా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. కుంకుమపువ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వులోని సమ్మేళనాలు ధమనుల్లో రక్తం అడ్డుపడటాన్ని నిరోధిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.

అలర్జీలను నివారిస్తుంది : గర్భవతిగా ఉన్నప్పుడు అలెర్జీలు ఎక్కువగా దాడి చేస్తాయి. సీజనల్ అలర్జీలు, ఛాతీలో అసౌకర్యం, శ్వాస సమస్యలతో పోరాడడంలో కుంకుమపువ్వు సహాయపడుతుంది. కుంకుమపువ్వును తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితం, మొత్తం ఆరోగ్యానికి మంచిది. మంచిది కదా అని అతిగా తిననంతవరకు ఏదీ చెడు కలిగించదు. కుంకుమపువ్వు కూడా అంతే.. 

Latest Videos

click me!