బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా.. రొమ్ము ఆరోగ్యం ఇలా కాపాడుకోవచ్చు...

First Published Aug 20, 2021, 2:42 PM IST

రొమ్ము క్యాన్సర్ శారీరకమైనదే అయినా, మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆందోళన స్థాయిల్ని పెంచుతుంది. రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం.. అవేంటో తెలుసుకుంటే.. ఇంట్లోనే, ముందునుండే జాగ్రత్తపడొచ్చు. 

మహిళల్లో ఎక్కువ ఆందోళన కలిగించే అంశం బ్రెస్ట్ క్యాన్సర్.  దీన్ని ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతోపాటే అవగాహన కూడా పెరిగింది. అందుకే బ్రెస్ట్ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెరిగింది. ఒక వయసు దాటిన తరువాత రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు పెరిగాయి. రొమ్ముల్లో ఎలాంటి మార్పులేమైనా ఉన్నాయా అని చెకప్ లు చేసుకోవడమూ పెరిగింది. 

రొమ్ముల ఆరోగ్యం కోసం డైట్ చేయడం, వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. రొమ్ము క్యాన్సర్ శారీరకమైనదే అయినా, మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆందోళన స్థాయిల్ని పెంచుతుంది. రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం.. అవేంటో తెలుసుకుంటే.. ఇంట్లోనే, ముందునుండే జాగ్రత్తపడొచ్చు. 

తేమ : బ్రెస్ట్ ను తేమగా ఉంచడం ముఖ్యం. దీనికోసం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. బ్రెస్ట్ కు మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఒక్క నిమిషం పని.. కానీ దీనివల్ల మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఛాతీ, చనుమొనల చుట్టూ చర్మం పలుచగా, సున్నితంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాల్లో కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. మాయిశ్చరైజర్ ను  కొంచెం మందంగా రాసుకోవడం వల్ల రొమ్ములకు తగినంత తేమ అందుతుంది. పొడితనం తగ్గతుంది. దీనివల్ల రొమ్ముల్లో నొప్పి రావడం కూడా తగ్గుతుంది. అయితే ఇది అందరికీ పడకపోవచ్చు. మాయిశ్చరైజర్ రాయడం వల్ల రొమ్ము మీద దద్దుర్లు, ఎరుపు కనిపిస్తే అది మీకు పడడం లేదని అర్థం.. కాబట్టి ఆ బ్రాండ్ మార్చి వేరే బ్రాండ్ వాడాండి. 

తేమ : బ్రెస్ట్ ను తేమగా ఉంచడం ముఖ్యం. దీనికోసం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. బ్రెస్ట్ కు మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఒక్క నిమిషం పని.. కానీ దీనివల్ల మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఛాతీ, చనుమొనల చుట్టూ చర్మం పలుచగా, సున్నితంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాల్లో కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. మాయిశ్చరైజర్ ను  కొంచెం మందంగా రాసుకోవడం వల్ల రొమ్ములకు తగినంత తేమ అందుతుంది. పొడితనం తగ్గతుంది. దీనివల్ల రొమ్ముల్లో నొప్పి రావడం కూడా తగ్గుతుంది. అయితే ఇది అందరికీ పడకపోవచ్చు. మాయిశ్చరైజర్ రాయడం వల్ల రొమ్ము మీద దద్దుర్లు, ఎరుపు కనిపిస్తే అది మీకు పడడం లేదని అర్థం.. కాబట్టి ఆ బ్రాండ్ మార్చి వేరే బ్రాండ్ వాడాండి. 

మసాజ్ : రెగ్యులర్ గా బ్రెస్ట్ లను మసాజ్ చేయాలి. రొమ్ముల్లో అనేక శోషరస గ్రంథులు ఉంటాయి. వీటిల్లో లింఫ్ అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి. ఈ లింఫ్ ఫ్లూయిడ్ అనేక రకాల అనారోగ్యాలనుండి కాపాడుతుంది. ఇక రొమ్ములను మసాజ్ చేయడం వల్ల లింఫ్ గ్రంథులు ఉత్తేజితమై సరిగా పనిచేస్తాయి. అందుకే లోషన్ రాసిన తరువాత రొమ్ములను నెమ్మదిగా రకరకాల డైరెక్షన్ లో మసాజ్ చేయాలి.  దీనివల్ల రొమ్ముల ఆరోగ్యంతో పాటు, రిలాక్స్ అవుతాయి. 

విటమిన్ లు తీసుకోవడం డోసు పెంచాలి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రావడానికి విటమిన్ డి తక్కువగా తీసుకోవడం ఒక కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిలో  అధిక విటమిన్ డి స్థాయిలు ఉంటే.. రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడడం తేలిక అని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి, ఏ సందర్భంలోనైనా, రొమ్ము ఆరోగ్యానికి విటమిన్ డి తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ విటమిన్ డి శరీరానికి అందేలా చూసుకోవాలి. ఎండలోకి వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయండి. కానీ ఎండలోకి వెళ్లకుండా ఉండకండి. దీంతోపాటు ఆహారంలో విటమిన్ డి ఎక్కుగా ఉండే ఆహారపదార్థాలను చేర్చండి. 

బ్రా ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. మీకు సరైన సైజును ఎంచుకోండి. ఆ బ్రాలదేముందిలే అనుకోవచ్చు. కానీ ఇది మీ డ్రెస్సులకు సరైన షేప్ లతో పాటు.. రొమ్ము ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే బ్రా మరీ టైట్ గా కాకుండా, అలాగని మరీ లూజ్ గా కాకుండా ఉండాలి. రొమ్ములకు దన్నుగా ఉండాలి. వయసుతో పాటు సైజుల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఒకే సైజు బ్రాను యేళ్ల తరబడి వాడడం కాకుండా... బ్రా కొనేముందు సైజును కొలుచుకోవాలి. స్పోర్ట్స్ బ్రా విషయానికి వస్తే.. దీన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. 

ద్రాక్ష రొమ్ము ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇందులోనూ ముదురు రంగు ద్రాక్ష మరీ మంచిది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ద్రాక్ష అలాంటి ప్రయోజనాలు కలిగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని మీ ఆహారంలో ఎక్కువగా చేర్చండి. దంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా చేర్చాలి. 

click me!